Maruthi: దర్శకుడు మారుతికి ప్రభాస్‌ అభిమానులు ఝలక్‌, వందకుపైగా ఫుడ్‌ ఆర్డర్స్.. ది రాజాసాబ్‌ డిజాస్టర్‌ దెబ్బ

Published : Jan 29, 2026, 07:22 AM IST

దర్శకుడు మారుతి `ది రాజా సాబ్‌` తో ప్రభాస్‌ అభిమానులను చాలా డిజప్పాయింట్‌ చేశాడు. దీంతో వారంతా ఆయనకు పెద్ద ఝలక్‌ ఇచ్చారు. ఆయన ఇంటికి వందకుపైగా ఫుడ్‌ ఆర్డర్స్ పంపడం షాకిస్తుంది. 

PREV
15
డిజాస్టర్‌గా నిలిచిన ప్రభాస్‌ `ది రాజా సాబ్‌`

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి ఇటీవల `ది రాజా సాబ్‌` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలయ్యింది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.400కోట్ల బడ్జెట్‌తో రూపొందగా, బాక్సాఫీసు వద్ద రెండు వందల కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది.

25
మారుతికి తలనొప్పిగా మారిన స్టేట్‌మెంట్‌

థియేట్రికల్‌ రైట్స్ విషయంలో ఎనభై కోట్ల వరకు నష్టపోయినట్టు సమాచారం. అదే సమయంలో బడ్జెట్‌ పరంగానూ ఓవరాల్‌గా రూ.150కోట్ల వరకు నిర్మాత నష్టపోయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్‌కి ముందు దర్శకుడు మారుతి అదిరిపోయే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సినిమా అందరికి నచ్చుతుందని, నచ్చకపోతే తన ఇంటికి వచ్చి ప్రశ్నించాలని తెలిపారు. అంతేకాదు తన ఇంటి అడ్రస్‌ కూడా ఇచ్చాడు. ఇదే ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చింది.

35
దర్శకుడు మారుతికి ప్రభాస్‌ అభిమానులు ఝలక్‌

ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా హీరోని పెట్టుకుని ఇలాంటి సినిమా తీస్తావా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విషయంలో వారంతా చాలా డిజప్పాయింట్‌తో ఉన్నారు. ఆ ఆవేశాన్ని, బాధ, ఆవేదనని దర్శకుడు మారుతిపై తీర్చుకుంటున్నారు. ఆయన తన ఇంటి అడ్రస్‌ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు  ఊహించని ఝలక్‌ ఇచ్చారు. ఆయన ఇంటికి ఫుడ్‌ ఆర్డర్‌ పంపిస్తున్నారు. తాజాగా మారుతి ఇంటికి వందకుపైగా ఫుడ్‌ ఆర్డర్స్ రావడం గమనార్హం. స్విగ్గీ, జోమాటో కి చెందిన ఫుడ్‌ ఆర్డర్స్ వచ్చాయి.

45
ప్రభాస్‌ ఇంటికి వందకు పైగా ఫుడ్‌ ఆర్డ్స్

బ్యాక్ టూ బ్యాక్‌ క్యాష్‌ ఆన్ డెలివరీ రూపంలో ఈ ఆర్డర్స్ పెట్టడం గమనార్హం. వరుసగా ఇలాంటి ఆర్డర్స్ మారుతి పేరుతో, ఆయన ఇంటి అడ్రస్‌ కి వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీకి ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇలాంటి ఆర్డర్స్ ని అనుమతించవద్దని ఆయన సెక్యూరిటీకి చెప్పారట. కానీ ఇది పెద్ద రచ్చగా మారి, వైరల్‌ అవుతుంది. దర్శకుడు మారుతి కొండాపూర్‌లోని కొల్లా విల్లాలో ఉంటున్నారని సమాచారం. మొత్తంగా అత్యుత్సాహంతో దర్శకుడు చేసిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు ఆయనకే పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. అందుకే ఎంత గొప్ప సినిమా తీసినా, సైలెంట్‌ గా ప్రచారం చేసుకోవాలిగానీ, ఇలాంటి ఓవర్‌ యాక్షన్‌ స్టేట్‌మెంట్లు ఇస్తే ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకనైనా ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చేవారికి ఇదొక గుణపాఠమని చెబుతున్నారు. అదే సమయంలో అభిమానులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదు. 

55
ది రాజా సాబ్‌ ఫెయిల్యూర్‌కి కారణమిదే

ప్రభాస్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన `ది రాజా సాబ్‌` చిత్రంలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌, జరీనా వాహబ్‌, ప్రభాస్‌ శ్రీను, సప్తగిరి, వీటీవీ గణేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. మేకింగ్‌ క్వాలిటీ కూడా లోపించింది. స్టోరీ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. పైగా ప్రభాస్‌ భయపడమనే కాన్సెప్ట్ బెడిసికొట్టింది. దీంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా `ది రాజాసాబ్‌` నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories