చిరంజీవి కుటుంబంలోకి వారసులు రాబోతున్నారు. ట్విన్స్ జన్మించబోతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో మెగాస్టార్ దీన్ని కన్ఫమ్ చేశారు. ఉపాసన డెలివరీ డేట్‌ని వెల్లడించారు.
మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్ టైమ్ నడుస్తుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ విడుదలై 17 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మూడువందల అరవై కోట్ల కలెక్షన్లు దాటింది. నాలుగు వందల కోట్ల దిశగా వెళ్తోంది. చూడబోతుంటే టచ్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత చిరంజీవికి బ్లాక్ బస్టర్ పడింది. ఓ రకంగా ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 1990-20 టైమ్‌లో చిరంజీవి ఇండస్ట్రీని శాసించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి టైమ్ వచ్చిందని చెప్పొచ్చు.
25
రెండోసారి తల్లి కాబోతున్న ఉపాసన
మరోవైపు ఈ మూవీని చిరంజీవి కూతురు నిర్మించింది. ఆమెకి పెద్ద హిట్ దక్కింది. నిర్మాతగా తీసిన ఫస్ట్ మూవీతోనే ఆమె బ్లాక్ బస్టర్ అందుకోవడం విశేషం. ఇలా ఇద్దరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు. ఇది వారి కుటుంబానికి ఒక సెలబ్రేషన్‌గా చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ సెలబ్రేషన్ త్వరలో డబుల్ కాబోతుంది. కాదు త్రిబుల్ కాబోతుంది. మెగా ఫ్యామిలీలోకి వారసులు వస్తున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన త్వరలో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. కాదు పండంటి ట్విన్స్ కి జన్మనివ్వబోతుందట.
35
మెగా ఫ్యామిలీలోకి ట్విన్స్ ఆగమనం
ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్‌తో ఉన్నారు. ఆమెకి ఈ నెల 31న డెలివరీ డేట్ ఇచ్చారట వైద్యులు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి కన్ఫమ్ చేశారు. ఆయన బుధవారం కొంత మంది మీడియా ప్రతినిధులను పర్సనల్‌గా కలిశారట. ఈ క్రమంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారని సమాచారం. డేట్‌ని కన్ఫమ్ చేయడంతోపాటు రాబోయేది ట్విన్స్ అనే విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టు సమాచారం. వచ్చేది వారసులా కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
రెండోసారి ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న చరణ్, ఉపాసన
అయితే చట్టపరంగా పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. జెండర్‌ని రివీల్ చేయడానికి లేదు. దాని ప్రకారం జన్మించేది ఎవరనేది చెప్పడానికి లేదు. ఆ విషయంలోనే స్పష్టత లేదు. కానీ రాబోయేది మెగా వారసులే అని సమాచారం. ఇది గత కొన్ని రోజలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమని టాక్. ఇదే నిజమైతే మెగా స్టార్‌కి, మెగా ఫ్యామిలీ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఇదే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి త్రిబుల్ ట్రీట్‌గా చెప్పొచ్చు. మరో మూడు రోజుల్లో మెగా ఫ్యామిలీ మరో సెలబ్రేషన్‌కి రెడీ అవుతుందని చెప్పొచ్చు.
55
పెద్దితో రామ్ చరణ్ బిజీ
రామ్ చరణ్, ఉపాసనలకు ఇప్పటికే కూతురు క్లీంకార జన్మించింది. 2023 జూన్ 20న క్లీంకార జన్మించింది. ఇప్పుడు రెండున్నరేళ్లకి మరోసారి చరణ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్నారు. రెండో సంతానానికి జన్మనివ్వబోతున్నారు. కాకపోతే ఈ సారి ట్విన్స్ రానున్నారట. రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్లకి వీరిద్దరు పరెంట్స్ అయ్యారు. ఇక చరణ్ ఇప్పుడు `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 1న విడుదల కానుందని సమాచారం.