OTT Movies: ఇండియావైడ్‌గా నెట్‌ ఫ్లిక్స్ లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌

Published : Oct 25, 2026, 10:44 AM IST

ఇండియా వైడ్‌గా నెట్‌ ఫ్లిక్స్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. రవితేజ, నాని, సూర్య, సుహాస్‌ నటించిన చిత్రాలు టాప్‌ లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మరి టాప్‌ 10 లో ఉన్నవి ఏంటో చూద్దాం.

PREV
16
టాప్‌ 10 ఓటీటీ మూవీస్‌

ఇప్పుడు థియేటర్లో వచ్చే సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. అయినా ఓటీటీల డిమాండ్‌ తగ్గడం లేదు. దానికి ఉండే డిమాండ్‌ దానికి ఉంటుంది. అయితే ఓటీటీలో ఇప్పుడు మన తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్నాయి. నెట్‌ ఫ్లిక్స్ లో దాదాపు మూడు తెలుగు సినిమాలు టాప్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. అత్యధిక మంది ఆడియెన్స్ వీటిని చూసేందుకు ఇష్టపడుతున్నాయి. అయితే థియేటర్లో దుమ్ములేపిన ఈ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో రచ్చ చేస్తున్నాయి. ఇందులో రవితేజ, నాని, సూర్య, సుహాస్‌ సినిమాలు ప్రధానంగా ఉన్నాయి.

26
నెట్‌ ఫ్లిక్స్ లో నెంబర్‌ 1 స్థానంలో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్

నెట్‌ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌ నెంబర్‌ వన్‌లో ట్రెండ్‌ అవుతున్న చిత్రం సూర్య నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్`. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రమిది. తెలుగు నిర్మాత నాగవంశీ నిర్మించారు. సూర్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రమిది. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రాధికా శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతుంది. సెప్టెంబర్‌ 11 నుంచి ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

36
రెండో స్థానంలో రవితేజ ఇరుముడి

రెండో స్థానంలో తెలుగు మరో బ్లాక్‌ బస్టర్‌ రవితేజ నటించిన `ఇరుముడి` మూవీ ఉంది. ఆగస్ట్ 21న విడుదలైన ఈ చిత్రం థియేటర్లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.250కోట్లు వసూలు చేసింది. ఇండస్ట్రీ వర్గాలను, చిత్ర బృందాన్ని, నిర్మాతలను, హీరోని కూడా ఆశ్చర్యపరించింది. అయ్యప్ప స్వామి భక్తుల కథతో వచ్చిన ఈ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. సెప్టెంబర్‌ 18 నుంచి ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పటికీ ఇండియా వైడ్‌గా రెండో స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇందులో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. సాయికుమార్‌, రమేష్‌ ఇందిరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

46
మూడో స్థానంలో నాని ప్యారడైజ్‌

ఇక మూడో స్థానంలో మరో తెలుగు సినిమా `ది ప్యారడైజ్‌` ఉంది. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. మోహన్‌బాబు విలన్‌గా చేశారు. సంపూర్నేష్‌ బాబు, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 24న విడుదలైన ఈ చిత్రం మాస్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. యావరేజ్‌గా ఆడింది. అయితే ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఈ గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు టాప్‌ 3లో ట్రెండ్‌ అవుతుంది.

56
ఐదో స్థానంలో మండాడి

నాల్గో స్థానంలో హాలీవుడ్‌ యానిమేషన్‌ ఫిల్మ్ `డిటెక్టివ్‌ కానన్‌` ట్రెండ్‌ అవుతుంది. ఐదో స్థానంలో సుహాస్‌ నటించిన `మండాడి` మూవీ దుమ్ములేపుతుండటం విశేషం. సూరి, సుహాస్‌, మహిమా నంబియార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మతి మారన్‌ దర్శకుడు. సెప్టెంబర్‌ 10న ఈ చిత్రం విడుదలైంది. థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.150కోట్లు వసూలు చేసింది. అక్టోబర్‌ 8 నుంచి నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఓటీటీలోనూ దీనికి అదిరిపోయే స్పందన లభించడం విశేషం.

66
ఆరో స్థానంలో మోద రాత్రి.. మిగిలినవి ఏంటంటే?

దీనితోపాటు మరో తమిళ చిత్రం `మోద రాత్రి` మూవీ టాప్‌ 6లో ట్రెండ్‌ అవుతుంది. రిషికాంత్, అనిశా అనిల్‌ కుమార్‌ జంటగా, రాజా కరుప్పసామి దర్శకత్వంలో రూపొందిన కామెడీ డ్రామా చిత్రమిది. ఆగస్ట్ 21న థియేటర్లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. సెప్టెంబర్‌ 18 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో కూడా విశేష ఆదరణ పొందుతోంది. వీటితోపాటు `షాడో ఆప్‌ ది టెన్‌ నింజా` అనే జపనీస్‌ టీవీ సిరీస్‌ ఏడో స్థానంలో, `గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌` అనే హిందీ షో ఎనిమిదో స్థానంలో, `ధమాల్‌ 4` అనే హిందీ సినిమా 9వ స్థానంలో, `చుంబక్‌` అనే హిందీ సిరీస్‌ పదో స్థానంలో ట్రెండ్‌ అవుతున్నాయి. మొత్తంగా తెలుగు సినిమాలు, సౌత్‌ మూవీస్‌ హవా నెట్‌ ఫ్లిక్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories