Naresh: క్లాసిక్ మూవీలో ఛాన్స్, డైరెక్టర్ రిజెక్ట్ చేయడంతో ఏడ్చేసిన నరేష్.. కృష్ణ ఏం చేశారో తెలుసా

Published : Oct 25, 2026, 10:40 AM IST

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ నెపోటిజం గురించి ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశారు. సినిమాల్లో తనకు తొలి అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని వివరించారు.

PREV
15
Naresh

సీనియర్ నటుడు నరేష్ 80, 90 దశకాలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ప్రధానంగా నరేష్ హీరోగా కామెడీ, కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కేవి. నరేష్ తల్లి విజయ నిర్మల టాలీవుడ్ లో లెజెండ్రీ నటి, దర్శకురాలు. ఆమె వారసత్వంతో నరేష్ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన కెరీర్ సంగతులు, నెపోటిజం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
క్లాసిక్ మూవీలో ఛాన్స్ మిస్

భారతీరాజా తెరకెక్కించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ సీతాకోక చిలుక మూవీలో ముందుగా అవకాశం తనకే వచ్చింది అని నరేష్ తెలిపారు. నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు ఈ సినిమాలో హీరోగా నన్నే అనుకున్నారు. కానీ భారతీరాజా గారు నన్ను రిజెక్ట్ చేసి కార్తీక్ ని పెట్టుకున్నారు. అప్పుడు బోరున ఏడుస్తూ ఒక్కడినే గదిలోకి వెళ్లి తాళం పెట్టుకున్నా.

35
నీ ప్రాబ్లెమ్ ఏంటి అని కృష్ణ గారు అడిగారు

కృష్ణ, విజయనిర్మల గారు నన్ను ఓదార్చడానికి తలుపు తట్టారు. కృష్ణ గారు అసలు ఏంటి నీ ప్రాబ్లెమ్.. హీరో అవుతావా అని అడిగారు. అవును అని చెప్పా. కృష్ణ గారు వెంటనే రాజేంద్ర కుమార్ గారికి ట్రంక్ కాల్ బుక్ చేసి.. మా అబ్బాయి నరేష్ ని హీరో చేయాలి. మీ సినిమా రైట్స్ కావాలి అని అడిగారు. ఆయన ఓకె చెప్పారు. నాకు చెప్పాలనే సంతోషం అనిపించింది. కానీ విధి ఎంత విచిత్రమో చూడండి. అప్పుడే నన్ను జంధ్యాల గారు చూసి నాలుగు స్తంభాలాట మూవీలో ఛాన్స్ ఇచ్చారు.

45
విధి విచితమైనది

ఇప్పుడు నెపోటిజం గురించి మాట్లాడదాం. మా అమ్మ గొప్ప దర్శకురాలు. తలుచుకుంటే ఆమె నన్ను హీరోగా పెట్టి సినిమా చేయొచ్చు. కానీ జంధ్యాల లాంటి గొప్ప దర్శకుడు అవకాశం ఇచ్చినప్పుడు నాదేముందిరా.. వాళ్లనే ముందు చేయనివ్వు అని అన్నారు. జంధ్యాల గారి దగ్గరకు వెళ్లి మా అబ్బాయికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండీ అని చెప్పారు. అదీ బ్యాక్ డ్రాప్ అంటే. నాలుగు స్తంభాలాట సినిమా ఒక కల్ట్ సినిమాగా నిలిచింది.

55
ఇక్కడ మాత్రమే నెపోటిజం తప్పా ?

నెపోటిజం అనేది నా దృష్టిలో తప్పు కాదు. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేయాలని అనుకుంటాడు. కొడుకుకి అవసరమైన మొత్తం అందిస్తాడు. ప్రతి రంగంలో ఇలాగే జరుగుతోంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే నెపోటిజం తప్పు అని అంటారు. అందేందుకు అర్థం కాదు అని నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories