Top 10 Heroines: రష్మికకి నయనతార బిగ్‌ షాక్‌, శ్రీలీల ఔట్‌.. సమంత, కాజల్‌, సాయిపల్లవి స్థానాలివే.. టాప్ ఎవరంటే?

Published : Aug 22, 2026, 08:11 AM IST

Top 10 Heroines: ఇండియన్‌ టాప్‌ 10 హీరోయిన్లకి సంబంధించిన జులై జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. ఇందులో రష్మిక మందన్నాకి నయనతార పెద్ద షాక్‌ ఇచ్చింది. త్రిష దుమ్ములేపింది.

PREV
15
ఇండియన్‌ టాప్‌ 10 హీరోయిన్ల లిస్ట్

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్‌ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్‌ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్‌, సాయిపల్లవి, దీపికా, అలియా భట్‌ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం.

25
సమంతని కొట్టేవారే లేరు

ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్‌ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్‌ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్‌ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

35
దారుణంగా పడిపోయిన రష్మిక.. నయనతార రచ్చ

రెండో స్థానంలో అలియాభట్‌ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్‌ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్‌ 4కి రావడం విశేషం. అయితే టాప్‌ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్‌ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్‌ అనే చెప్పాలి.

45
కాజల్‌, సాయిపల్లవి సెటిల్డ్

ఇక ఐదో స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ ఉన్నారు. ఈమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట సందడి చేస్తుంది. ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. దీనికితో కమర్షియల్స్ తోనూ సందడి చేస్తుంది. ఆ తర్వాత ఆరో స్థానంలో సాయిపల్లవి ఉన్నారు. ఆమె ప్రస్తుతం హిందీలో `రామాయణ్‌` చిత్రంలో సీతగా నటిస్తోంది. దీనికి సంబంధించిన చర్చ నడుస్తోంది. దీంతో ఆమె తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటోంది. ఏడో స్థానంలో రష్మిక ఉన్న విషయం తెలిసిందే.

55
పుంజుకున్న త్రిష

ఎనిమిదో స్థానంలోకి త్రిష వచ్చింది. జూన్‌ లో 10వ స్థానంలో ఉన్న త్రిష రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలోకి రావడం విశేషం. 9వ స్థానంలో కృతిసనన్‌ ఉండగా, పదో స్థానంలోకి శ్రద్ధా కపూర్‌ వచ్చింది. గత నెలలో ఉన్న కత్రినా కైఫ్‌ జులై లిస్ట్ లేరు. అదే సమయంలో తెలుగు బ్యూటీ శ్రీలీల కూడా లిస్ట్ లో స్థానం కోల్పోవడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories