Chiranjeevi: చిరంజీవి డేట్స్ ఇవ్వకపోతే నాగార్జున, వెంకటేష్‌ హీరోలయ్యారు.. ఏఎన్నార్‌ మూడేళ్లు తిరిగాడు

Published : Aug 22, 2026, 06:18 AM IST

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి డేట్స్ ఇవ్వకపోవడంతో నాగార్జున, వెంకటేష్‌ సినిమాల్లోకి వచ్చారని, హీరోలుగా రాణించారని టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కామెంట్‌ చేశారు. చిరు డేట్స్ కోసం ఏఎన్నార్‌ మూడేళ్లు వెయిట్‌ చేశారట.

PREV
15
యంగ్‌ హీరోలు ఏ రేంజ్‌కి వెళ్లినా తిరుగులేని మెగాస్టార్‌ చిరంజీవినే

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు 48ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `పునాది రాళ్లు` చిత్రంతో వెండితెరకు పరిచయమై `ఖైదీ`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు. యంగ్‌ హీరోలు పాన్‌ ఇండియా వేటలో, గ్లోబల్‌ సినిమా వేటలో రికార్డులు క్రియేట్‌ చేస్తున్నా, మెగాస్టార్‌ స్థానం మాత్రం చిరంజీవిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హిట్‌ కోసం రెడీ అవుతున్నారు.

25
చిరంజీవి వల్లే వెంకీ, నాగ్‌ హీరోలు

ఇదిలా ఉంటే చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22) 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఆయన గురించి కామెంట్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి స్టార్‌ డైరెక్టర్‌ గీతా కృష్ణ షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. చిరంజీవి హవా గురించి చెబుతూ, నాగార్జున, వెంకటేష్‌ హీరోలు అయిన పరిస్థితిని వివరించారు. చిరంజీవి డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్‌, నాగార్జున హీరోలు అయ్యారని తెలిపారు. 1983లో చిరంజీవికి `ఖైదీ` పడింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలు తగ్గించారు. ఫామ్‌ లో ఉన్న చిరంజీవి అందరికి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట.

35
ఏఎన్నార్‌ 3ఏళ్లు తిరిగారు

ఆ టైమ్‌లో కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్‌ కొంత వరకు నటిస్తున్నారు. కానీ వారి సినిమాలు కమర్షియల్‌గా వాహ్‌ అనేలా లేదు. ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవిపైనే పడింది. అయితే ఆయన డేట్స్ కోసం ఏఎన్నార్‌ చాలా రోజులు తిరిగారట. ఏకంగా మూడేళ్లు చిరంజీవి వెంటపడ్డారట. కానీ తమ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాలు చేయడానికి చిరు డేట్స్ ఇవ్వలేకపోయారట. అంత బిజీగా ఉన్నారట. దీంతో లాభం లేదని చెప్పి తమ స్టూడియో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో నాగార్జునని రంగంలోకి దించారని వెల్లడించారు. ఆ రకంగానే నాగ్‌ రాణించారని, చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డాన్సులు, ఫైట్లు నేర్చుకుని హీరోగా రాణించారని తెలిపారు గీతా కృష్ణ. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం తానే అని చెప్పారు.

45
చిరంజీవి వల్లే హీరోగా వెంకటేష్‌

అదే సమయంలో వెంకటేష్‌ విషయంలో కూడా అదే జరిగిందని, సురేష్‌ ప్రొడక్షన్‌లో సినిమాలు చేయడానికి హీరోలు దొరకలేదట. సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా డేట్స్ ఇవ్వలేకపోయారు. చిరంజీవితో ఒక్క మూవీ చేస్తే మూడు నాలుగేళ్లు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి అట. దీంతో వెంకటేష్‌ని రంగంలోకి దించారట రామానాయుడు. వెంకీని హీరోని చేయాల్సి వచ్చిందట. అలా మెగాస్టార్‌ డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్‌, నాగార్జున హీరోలు అయ్యారని, చిరు వల్లే వాళ్లు సినిమాల్లోకి వచ్చారని, తమ స్టూడియోలు నిలబడాలంటే సొంతంగా హీరోలు కావాలని రామానాయుడు, అక్కినేని భావించి కొడుకులను హీరోలను చేశారని గీతా కృష్ణ తెలిపారు.

55
చిరు అందుకే మెగాస్టార్‌

చిరంజీవి గురించి చెబుతూ, అప్పట్లో ఆయన చేసిన డాన్సులకు జనం వెర్రెత్తి చూసేవారని, థియేటర్లు ఊగిపోయాయని, అప్పట్లో ఆ పాటల గొప్పతనం అర్థం కాలేదని, తర్వాత వింటుంటే, చిరంజీవి డాన్సులు చూస్తుంటే వాహ్‌ అనిపిస్తుందని, అందుకే ఆయన మెగాస్టార్‌గా ఎదిగారని తెలిపారు. చిరంజీవి ఆ స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టం, శ్రమ, పట్టుదల ఉందని, అందరు ఆయనలా కష్టపడలేదని వెల్లడించారు. ఆయనొక అరుదైన వ్యక్తి అని చెప్పారు. ఏసియానెట్‌ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, గీతా కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories