మాస్ మహారాజా రవితేజ.. తన జోనర్ మార్చి సినిమా చేశారు. `ఇరుముడి`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. దీంతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురుస్తోంది.
రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్‌టైనర్స్ థియేటర్‌లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ. తన జోనర్ మార్చాడు. భక్తిరస చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక కథతో వచ్చారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌ని, ఎమోషన్స్ ని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన `ఇరుముడి` చిత్రంతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇది శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.
24
చిరంజీవి రికార్డు బ్రేక్
`ఇరుముడి` మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీసుపై కనిపిస్తుంది. సినిమా మంచి వసూళ్ల దిశగా వెళ్తోందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. రవితేజ కెరీర్‌లో సోలో హీరోగా వచ్చిన చిత్రాల్లో `ధమాఖా`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు మాత్రమే ఎనిమిది కోట్లతో టాప్ లో ఉన్నాయి. కానీ `ఇరుముడి` మూవీ మాత్రం వాటి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది వచ్చిన చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. దానికి రూ.31.6వేల టికెట్స్ బుక్ అయితే `ఇరుముడి`కి రూ.32.25వేల టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడు పోవడం విశేషం.
34
ఇరుముడి మూవీ మొదటి రోజు కలెక్షన్లు
`ఇరుముడి` చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ.24.20కోట్లు రావడం విశేషం. రవితేజ గత చిత్రాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి, ట్రేడ్ వర్గాలకే కాదు, రవితేజకి కూడా సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక ఇండియాలో ఇది రూ.17.20కోట్ల గ్రాస్‌ని, రూ.14.80కోట్ల నెట్‌ని రాబట్టింది. ఓవర్సీస్‌లో ఏడు కోట్లు రావడం విశేషం. ఇది కూడా రికార్డుగా నిలిచింది. మొత్తంగా `ఇరుముడి` మూవీతో మాస్ మహారాజా రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీగా రాబట్టింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో అది మరింత పెరుగుతుంది. వరుసగా సెలవులు ఉండటంతో ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశాలున్నాయి.
రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు అని సమాచారం. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.20కోట్లు అయ్యిందట. నైజాం రూ.5.50కోట్లకు, సీడెడ్ రూ.2.25కోట్లకు, ఆంధ్రా రూ.8.25కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌లో రెండు కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లకు సేల్ చేశారట. దీంతో ఈ సినిమా హిట్ కావాలంటే రూ.21కోట్ల షేర్ రావాలి. అంటే సుమారు నలభై కోట్ల గ్రాస్ రావాలి. ఈ సినిమా జోరు చూస్తుంటే మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఈజీగా వంద కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. రవితేజ నటించిన చిత్రాల్లో `ధమాఖా` మాత్రమే వంద కోట్లు దాటింది. ఆ రికార్డుని ఇప్పుడు `ఇరుముడి` బ్రేక్ చేస్తుందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.