India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే

Published : Sep 23, 2026, 11:33 AM IST

ఓర్మాక్స్ మీడియా ఆగస్ట్ నెలకు సంబంధించిన లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో నయనతార, త్రిష, కాజల్‌ పడిపోయారు. కానీ ఊహించని విధంగా సాయిపల్లవి దూసుకొచ్చింది.

PREV
17
ఇండియా టాప్‌ 10 హీరోయిన్ల జాబితా

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్‌ హీరోయిన్లకి సంబంధించిన టాప్‌ 10 లిస్ట్ ని రిలీజ్‌ చేస్తుంటుంది. తాజాగా ఆగస్ట్ నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, త్రిష, కాజల్‌ వంటి హీరోయిన్లు పడిపోయారు. శ్రీలీల అసలు లిస్ట్ లోనే లేదు. కానీ సాయిపల్లవి మాత్రం టాప్‌లోకి దూసుకొచ్చింది. మరి సమంత, రష్మిక, దీపికా పదుకొనె, అలియా భట్‌ వంటి వారి స్థానాలేంటి అనేది టాప్‌ 10 లిస్ట్ లో చూద్దాం.

27
నెంబర్‌1 సమంతనే

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఆగస్ట్ నెలలో మొదటి స్థానంలో ఎప్పటిలాగే సమంత నిలిచింది. ఆమె ఇటీవల మా ఇంటి బంగారం మూవీతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. దీనికితోడు ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యింది. దీంతో నిత్యం తన ఫోటోలతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది సమంత. అది ఆమె క్రేజ్‌ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. అందుకే కంటిన్యూగా సామ్‌ నెంబర్‌ 1 స్థానంలో కొనసాగుతుంది.

37
అలియాభట్‌ నెంబర్‌ 2, మరి 3 ఎవరంటే?

ఇక నెంబర్‌ 2లో బాలీవుడ్‌ హీరోయిన్‌, `ఆర్‌ఆర్‌ఆర్‌` నటి అలియాభట్‌ నిలిచింది. ఆమె స్థానంలోనూ పెద్దగా మార్పు లేదు. మహా అయితే ఒక స్థానం డౌన్‌ కావడం, మళ్లీ పుంజుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. మూడో స్థానంలో మరో బాలీవుడ్‌ నటి, `కల్కి 2898ఏడీ` హీరోయిన్‌ దీపికా పదుకొనె ఉంది. ఆమె స్థానంలోనూ పెద్దగా మార్పు లేదు. జులై లో కూడా ఆమె అదే స్థానంలో ఉంది.

47
దూసుకొచ్చిన సాయిపల్లవి

నాల్గో స్థానంలోకి ఈ సారి సాయిపల్లవి వచ్చింది. ఆమె ఎక్కువగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉండేది, కానీ అనూహ్యంగా అందరికి షాక్‌ ఇస్తూ నాల్గో స్థానంలోకి రావడం విశేషం. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో `రామాయణ్‌` చిత్రంలో సీతగా నటిస్తోంది. ఇదే ఆమె క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. నయనతార, కాజల్‌లకు షాకిస్తూ సాయిపల్లవి నాల్గో స్థానంలోకి రావడం విశేషం.

57
ఐదో స్థానంలో నయనతార

జులైలో నాల్గో స్థానంలో ఉన్న నయనతార ఇప్పుడు ఒక్క స్థానం పడిపోయి ఐదో స్థానంలో నిలిచింది. నయనతార ఆ మధ్య `హాయ్‌` అనే సినిమాలో కూడా నటించింది. అయినా ఆమె స్థానం పడిపోవడం గమనార్హం. ఇక ఎక్కువగా ఐదో స్థానంలో ఉన్న కాజల్‌ ఇప్పుడు ఆరో స్థానానికి పరిమితమయ్యింది. ఆమెకి సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే.

67
ఏడో స్థానంలోనే రష్మిక మందన్నా

ఏడో స్థానంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఉండటం గమనార్హం. ఆమె జులైలో పడిపోయింది. ఇదే స్థానంలో ఉంది. ఇప్పుడు అదే ప్లేస్‌లో కొనసాగుతుంది. ప్రస్తుతం రష్మిక మందన్నా `రణబాలి`, `మైసా` చిత్రాల్లో నటిస్తుంది. దీంతో సెప్టెంబర్‌ నెలలో ఆమె పుంజుకునే అవకాశం ఉంది. ఎనిమిదో స్థానంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ ఉంది.

77
తొమ్మిదో స్థానంలో త్రిష.. లిస్ట్ లో లేని శ్రీలీల

తొమ్మిదో స్థానంలో త్రిష నిలిచింది. ఆమె జులైలో ఎనిమిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒకస్థానం పడిపోయింది. ఇక పదో స్థానంలో శ్రద్ధా కపూర్‌ ఉంది. ఆమె పెద్దగా లిస్ట్ లో ఉండదు, అడపాదడపా వస్తుంటుంది. ఆగస్ట్ లో లిస్ట్ లోకి వచ్చింది. పదో స్థానానికి పరిమితమయ్యింది. ఇక మన తెలుగు హీరోయిన్‌ శ్రీలీల ఈ సారి లిస్ట్ లోనే లేకపోవడం గమనార్హం. ఆమె అడ్రస్‌ గల్లంతయ్యిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories