Katrina Kaif Trolling: కత్రినా కైఫ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే భర్త విక్కీ కౌశల్ సైలెంట్‌గా ఉన్నాడు. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం ఆమెకు బహిరంగంగా మద్దతుగా నిలిచాడు. దీంతో నెటిజన్లు విక్కీని టార్గెట్ చేశారు. అసలు విక్కీ మౌనికి కారణం ఏంటి?
బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్ జరుగుతుంటే సల్మాన్ ఖాన్ ఆమెకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. కానీ, ఇదే విషయం ఇప్పుడు కత్రినా భర్త విక్కీ కౌశల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
25
బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ ఫైర్
ఇటీవల అంబానీ ఇంట జరిగిన వేడుకలో కత్రినా కైఫ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆమె బరువు పెరిగిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై 'బిగ్ బాస్ వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ పరోక్షంగా స్పందించాడు. "ఇటీవలే తల్లయిన ఒక మహిళను ఇలా ట్రోల్ చేయడం కరెక్టేనా? ఆమె మళ్లీ సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఫిట్‌నెస్ సాధిస్తుంది, కాస్త సమయం ఇవ్వండి" అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే తన సోదరుడు సోహైల్ ఖాన్ వయసుపై వస్తున్న కామెంట్స్, తనపై వస్తున్న ట్రోల్స్ పట్ల కూడా సల్మాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
35
విక్కీ కౌశల్‌పై నెటిజన్ల ఫైర్
కత్రినాకు మద్దతుగా సల్మాన్ ఖాన్ మాట్లాడటంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. "భార్య కత్రినాకు ఇంత అవమానం జరుగుతున్నా భర్త విక్కీ కౌశల్ సైలెంట్‌గా ఉన్నాడు. కానీ, మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఆమె కోసం గొంతు విప్పాడు" అంటూ నెటిజన్లు విక్కీని ఆడేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో విక్కీని టార్గెట్ చేస్తూ ఎన్నో ట్రోల్స్, రీల్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ వివాదంపై బాలీవుడ్ వర్గాల్లో మరో చర్చ కూడా నడుస్తోంది. కత్రినా కైఫ్ మొదటి నుంచి సోషల్ మీడియా వివాదాలకు దూరంగా ఉంటుంది. అనవసరమైన ట్రోల్స్‌కు స్పందించకుండా సైలెంట్‌గా ఉండటమే ఆమె స్టైల్. అందుకే, భార్య నిర్ణయాన్ని, ఆమె ప్రైవసీని గౌరవించే విక్కీ కౌశల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
55
కొనసాగుతున్న సల్మాన్-కత్రినా స్నేహం
2003లో మొదలైన సల్మాన్, కత్రినాల ప్రేమాయణం 2008లో బ్రేకప్ అయింది. కానీ, సల్మాన్ ఖాన్ ఎలాంటి కోపం లేకుండా కత్రినాతో కలిసి 'బాడీగార్డ్', 'టైగర్' లాంటి హిట్ సినిమాల్లో నటించాడు. అంతేకాదు, కత్రినాకు సల్మాన్ కుటుంబంతో ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. అందుకే, కష్టకాలంలో కత్రినాకు సల్మాన్ అండగా నిలవడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. కానీ, ఇదే విషయమై భర్త విక్కీ కౌశల్‌ను తక్కువ చేసి చూడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.