Top 10 Heroes: విజయ్‌ దూకుడుతో అల్లు అర్జున్‌కి దెబ్బ మీద దెబ్బ.. మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ సేఫ్‌.. టాప్‌ ఎవరంటే?

Published : Jun 22, 2026, 04:28 PM IST

ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోల లిస్ట్ లో ఈ సారి కొంత మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం విజయ్‌ దూకుడు చూపిస్తే, అల్లు అర్జున్‌ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. 

PREV
16
ఇండియా టాప్‌ 10 హీరోలు

ఎప్పటిలాగే మే నెలకు సంబంధించిన ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్ ఇచ్చింది ఓర్మాక్స్ మీడియా. అయితే ఈ సారి చిన్న చిన్న మార్పులు జరిగాయి. కానీ మేజర్‌ గా ఎవరి స్థానంలో వాళ్లు ఉన్నారు. మే నెలలో టాప్‌ 2 స్థానాలు సేమ్‌. కానీ 3, 4లో మార్పు చోటు చేసుకుంది. తమిళనాడు సీఎం విజయ్‌ దెబ్బకి అల్లు అర్జున్‌ డౌన్‌ అయ్యారు. మరి ఆయన ఎంతకి పడిపోయాడు. టాప్‌ 1 స్థానం ఎవరిది? టాప్‌ 10 లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారనేది చూద్దాం.

26
ఇండియా టాప్‌ 10 హీరోల్లో నెంబర్‌ 1 ప్రభాస్‌

ఇండియా మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 హీరోల్లో మొదటి స్థానంలో మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రభాస్‌ తన స్థానంలో నిలిచారు. ఆయన తిరుగులేని ఇమేజ్‌, స్టార్‌డమ్‌తో రాణిస్తున్నారు. ఏప్రిల్‌లోనూ ప్రభాస్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడే కాదు, చాలా నెలలుగా ఆయనే టాప్‌లో ఉంటున్నారు. తన రేంజ్‌ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ `ఫౌజీ`, `స్పిరిట్‌`, `కల్కి 2` చిత్రాల్లో నటించింది. రెండో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నిలిచారు. గత నెలలోనూ ఆయనే రెండో స్థానంలో ఉన్నారు.

36
అల్లు అర్జున్‌కి షాక్‌ ఇచ్చిన సీఎం విజయ్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో మూడో స్థానంలో తమిళనాడు సీఎం విజయ్‌ ఉన్నారు. ఆయన సీఎం అయిన నేపథ్యంలో ఆయన సంచలనంగా మారారు. ఆయన చుట్టూ డిస్కషన్‌ జరిగింది. దీంతో ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఏప్రిల్‌ నాల్గో స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు మూడో స్థానానికి ఎదగడం విశేషం. గత నెలలో మూడో స్థానంలో ఉన్న అల్లు అర్జున్‌.. ఇప్పుడు ఒక స్థానం పడిపోయారు. విజయ్‌ దెబ్బకి బన్నీ నాల్గో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం ఆయన `రాకా`లో హీరోగా నటిస్తున్నాడు.

46
మహేష్‌ బాబు సేఫ్‌ జోన్‌

ఐదో స్థానంలో మహేష్‌ బాబు ఉన్నారు. మహేష్‌ తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఆయన స్థానంలో పెద్దగా మార్పు లేదు. మార్చి, ఏప్రిల్‌, మే లోనూ ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం మహేష్‌ `వారణాసి` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

56
ఆరో స్థానంలో రామ్‌ చరణ్‌

ఆరో స్థానంలో `ధురంధర్‌ 2` హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ ఉన్నారు. గత నెలలోనూ అదే స్థానంలో ఉన్నారు. ఏడో స్థానంలో రామ్‌ చరణ్‌ నిలిచారు. పెద్దితో సత్తా చాటిన చరణ్‌ కూడా తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఇండియాలో టాప్‌ 7లో నిలిచారు. ఎనిమిదో స్థానంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఉన్నాడు. ఈ కండల వీరుడు కూడా గత కొన్ని నెలలుగా ఇదే స్థానంలో ఉంటున్నారు. తొమ్మిదో స్థానంలో మరో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. గత నెలలో కూడా ఆయన ఇదే స్థానంలో ఉన్నారు.

66
పదో స్థానంలో ఎన్టీఆర్‌

ఇక టాప్‌ 10లో పదో స్థానంలో మన తెలుగు హీరో ఎన్టీఆర్‌ నిలిచారు. ఆయన గత కొన్ని నెలలుగా అదే స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ `డ్రాగన్‌` మూవీలో నటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది. ఇలా మొత్తంగా ఇండియా టాప్‌ 10 హీరోల్లో తెలుగు నుంచి ఐదుగురు హీరోలు, నలుగురు హిందీ హీరోలు, కోలీవుడ్‌లో విజయ్‌ ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories