Published : Nov 06, 2025, 08:56 AM ISTUpdated : Nov 06, 2025, 09:01 AM IST
Illu Illalu Pillalu November 06th Episode: సేనాపతి చేసిన రచ్చకి వేదవతి చాలా బాధపడుతుంది. నర్మదను పిలిచి వారి జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తుంది. నర్మద మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో మొదలవుతుంది.
Illu Illalu Pillalu November 06th Episode:సేనాపతి ఇంటి ముందుకు వచ్చి చేసిన రచ్చ గురించి వేదవతి బాధపడుతుంది. తన తమ్ముడు అన్న మాటలు గుర్తు చేసుకుని ఫీలవుతుంది. ఆ సమయానికి నర్మదా అక్కడికి వస్తుంది. అప్పుడు వేదవతి ‘నీకు వాళ్లు 8 నెలల నుంచే తెలుసు. కానీ నాకు మాత్రం ఊహ తెలిసినప్పటినుంచి తెలుసు. పరువు కోసం ప్రాణమైన ఇచ్చేవాళ్ళు లేదా ప్రాణమైన తీసేవాళ్లు. అందుకే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు. ఆ స్థలం విషయంలో తప్పులు ఉన్నా చూసి చూడనట్లు వదిలేయ్’ అని చెబుతెంది. నీ మంచికే చెప్తున్న విను అంటుంది. దానికి నర్మదా మాత్రం ఒప్పుకోదు. ఎలాంటి పరిణామాలు జరిగినా తానే చూసుకుంటానని చెబుతుంది. ఆ మాటలకు వేదవతికి ఇంకా కోపం వచ్చేస్తుంది.
24
చాటుగా విన్న శ్రీవల్లీ
వేదవతి చాలా కోపంగా ‘పాతికేళ్లుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కుటుంబాలు రెండూ రోడ్ల మీదకు వచ్చి ఒకరినొకరు నరుక్కుంటే నువ్వు ఏం చేస్తావు’ అని ప్రశ్నిస్తుంది. కానీ నర్మద వెనక్కి మాత్రం తగ్గదు. తన ఉద్యోగ బాధ్యతను వదలనని చెబుతుంది. ఇంటి కోడిలిగా మీరు ఏం చెప్పినా చేస్తానని… డ్యూటీ విషయానికి వస్తే మాత్రం విననని అంటుంది. గవర్న్ మెంట్ రూల్స్ మాత్రమే పాటిస్తానని చెబుతుంది. దీంతో వేదవతికి ఇంకా కోపం పెరిగిపోతుంది. వీరిద్దరి మాటలు శ్రీవల్లి చాటుగా వింటూ ఉంటుంది. ఆ గొడవ విని ఎంతో సంతోషిస్తుంది. ఈరోజుకి కడుపు మంట తీరిపోయింది అంటూ ఎంతో హ్యాపీగా ఫీలవుతుంది.
34
ప్రేమ, ధీరజ్ గిల్లికజ్జాలు
ఒకరినొకరు కొట్టుకున్న తర్వాత ప్రేమ అలిగి బయటకి వచ్చేస్తుంది. ధీరజ్ వచ్చి బతిమిలాడతాడు. అయినా కూడా మాట వినదు. పాత విషయాలన్నీ తీసి తిడుతున్నావని, తట్టుకోలేకపోతున్నానని అంటుంది ప్రేమ. దీంతో ధీరజ్ తాను కూడా ఒక చాప, దిండు తెచ్చుకొని ఆమె పక్కనే వేసి పడుకుంటాడు. ఆ తర్వాత సీన్… భాగ్యం, ఆనందరావు దగ్గరికి మారుతుంది. అప్పులోళ్లు వారికి తరముతూ ఉంటారు. వారు పరుగులు పెడుతూ ఉంటారు. రామరాజు గారు డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు.. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి అప్పు కడతామని భాగ్యం ప్రశ్నిస్తుంది. ఇక రామరాజును డబ్బులు అడగాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ రామరాజును డబ్బు అడగాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఇద్దరూ కలిసి రామరాజు ఇంటికి వెళతారు. అక్కడ తమ కూతురు శ్రీవల్లి గేటు బయటే ఉండడం చూస్తారు. కూతురితో మీ మామయ్యని రెండు మూడు లక్షలు అప్పు అడగమని చెబుతారు. మామయ్య ఇంట్లో లేరని చెబుతుంది వల్లీ. దీంతో వారిద్దరూ రామరాజు వచ్చేవరకు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటారు. వేదవతి వంట చేస్తూ ఉంటే నర్మదా అక్కడికి వెళుతుంది. అత్తను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. కానీ వేదవతి మాత్రం కోపంతో మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగిసిపోతుంది.