కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చిన ఫ్యామిలీ- కొత్త సీఈఓ కార్తీకేనా?

Published : Nov 06, 2025, 07:53 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 6వ తేదీ)లో శివన్నారాయణను కాకా పట్టడానికి ట్రై చేస్తుంది పారు. జ్యోత్స్నను సీఈఓ పదవికి రాజీనామా చేయమంటాడు శివన్నారాయణ. మళ్లీ ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో అని కంగారు పడుతుంది దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో మీకోసం పాలు తీసుకొచ్చాను అంటుంది పారు. నేను అడగలేదే అంటాడు శివన్నారాయణ. మీకోసం ఏం చేయాలో నాకు తెలియదా అంటుంది పారు. శివన్నారాయణను పొగడ్తలతో కాకా పట్టేందుకు ప్రయత్నిస్తుంది. నువ్వు ఇంత భజన చేస్తున్నావంటే..  విషయం ఏదో పెద్దదే. చెప్పు ఏం కావాలి చెప్పు అంటాడు శివన్నారాయణ. ఇంట్లో ఒక్కరు తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు అంటుంది. ఆ ఒక్కరు ఎవరు అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న అండి. అదే సీఈఓగా కొనసాగుతుందని చెప్తే సంతోషపడుతుంది అంటుంది పారు. వీళ్ల మాటలు చాటుగా వింటూ ఉంటుంది జ్యోత్స్న.

26
మీ అమ్మానాన్నలకు దూరంగా ఉండు

నీ మనుమరాలికి నీ మీద నమ్మకం లేదా పారిజాతం అంటాడు శివన్నారాయణ. చాలా కాన్ఫిడెంట్ గా నామీద ఎందుకు నమ్మకం ఉండదు అంటుంది పారు. మరి నీ వెనకాలే వచ్చి డోర్ దగ్గర ఎందుకు నిలబడింది? అంటాడు శివన్నారాయణ. ఆ మాట విన్న జ్యోత్స్న అక్కడినుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. లోపలికి రా అని పిలుస్తాడు శివన్నారాయణ. సీఈఓ పోస్టుకు రాజీనామా చేయ్.. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అంటాడు శివన్నారాయణ. జ్యో, పారు షాక్ అవుతారు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మీ అమ్మానాన్నలకు కాస్త దూరంగా ఉండమని చెప్తాడు. ఒకే తాత అంటుంది జ్యోత్స్న. 

36
దీపకు ధైర్యం చెప్పిన కార్తీక్

మరోవైపు ఆందోళనగా ఉంటుంది దీప. టిఫిన్ చేయమని కార్తీక్ కి ప్లేట్ ఇస్తుంది. ఏమైంది అలా ఉన్నావని అడుగుతాడు కార్తీక్. కొబ్బరికాయ కుళ్లిపోయింది. ఆ ఇంట్లో మళ్లీ ఎలాంటి గొడవలు జరుగుతాయో బావ అని కంగారు పడుతుంది దీప. తాత తీసుకునే నిర్ణయం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వు అనుకున్నట్లు ఏం కాదు. అంతా మంచే జరుగుతుందని దీపకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు నువ్వు టిఫిన్ చేయమని దీపకు కూడా తినిపిస్తాడు కార్తీక్.

46
నీకు ఇంకెవరైనా పిల్లలున్నారా డాడీ?

మీ నాన్న ఒక్కడే ఉన్నాడు. వెళ్లి నాకు సపోర్ట్ చేయమని మీ నాన్న కాళ్ల మీద పడు. నువ్వు సీఈఓగా ఉండాలంటే ఇంట్లో వాళ్ల సపోర్ట్ కచ్చితంగా ఉండాలి అంటుంది పారు. ఏడవడం, కాళ్లమీద పడటం నా వల్ల కాదు గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఇది తప్ప మనకు ఇంకో ఆప్షన్ లేదు వెళ్లు అంటుంది పారు. డాడీ నేను కాకుండా మీకు ఇంకెవరైనా పిల్లలున్నారా? అని దశరథను అడుగుతుంది జ్యో. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఒక్కరే భార్య, ఒక్కరే కూతురు అంటాడు దశరథ. అయితే మీ కూతురే ఈ ఇంటి వారసురాలు కదా అంటుంది జ్యోత్స్న. అవును అంటాడు దశరథ. మరి అలాంటి కూతురు సీఈఓగా ఉండకపోతే ఎలా అంటుంది జ్యోత్స్న.

నీకు ఆస్తి కావాలని అడుగు ఇస్తా. కానీ సీఈఓ పదవి నిర్ణయం నా చేతిలో లేదు అంటాడు దశరథ. నాకు ఆస్తి, పదవి రెండూ కావాలి అంటుంది జ్యోత్స్న. ఆస్తి పోతే నేను మాత్రమే రోడ్డు మీద పడతా. కానీ కంపెనీ నష్టపోతే ఎంత మంది రోడ్డున పడతారో నీకు తెలుసా? అంటాడు దశరథ. ఇప్పటికే చాలా నష్టపోయాము. ఇప్పుడు కంపెనీ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయేలా ఉంది. నీకు నేను సపోర్ట్ చేయలేను. మా నాన్న ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం కూడా అని జ్యోకు షాకిస్తాడు దశరథ.

56
ఆడవాళ్లకు నిర్ణయం తీసుకునే అధికారం లేదా?

సీఈఓగా తీసేస్తే నా పరువు పోతుంది. ఎంప్లాయిస్ ముందు తల ఎత్తుకోలేను అని దశరథను రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. ఏం జరుగుతోంది దశరథ అంటూ అక్కడికి వస్తాడు శివన్నారాయణ. సీఈఓగా కొనసాగించాలని జ్యోత్స్న అడుగుతోంది నాన్న అంటాడు దశరథ. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డు మెంబర్స్. ఇప్పుడు ఆ కుర్చీ సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది అంటాడు శివన్నారాయణ. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. కొత్త సీఈఓ కచ్చితంగా బావే అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ నే మళ్లీ సీఈఓ చేస్తారేమో అని మనసులో అనుకుంటుంది పారు.

పరిస్థితి చేజారి పోతోందని అనుకున్న పారు ఈ ఇంట్లో మగవాళ్లకు తప్ప ఆడవాళ్లకు నిర్ణయం తీసుకునే అధికారం లేదా అని ప్రశ్నిస్తుంది. శివన్నారాయణ కోపంగా చూడగానే నేను సుమిత్ర గురించి చెప్తున్నాను. దశరథ కోసం ఈ ఇంటి కోసం సుమిత్ర ఎంతో కష్టపడింది. అలాంటి సుమిత్రకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వరా అని అంటుంది. సుమిత్ర ఈ ఇంటి మహాలక్ష్మి. మా నిర్ణయాల్లో తనకూ భాగం ఉంది. నీ కూతురే సీఈఓగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా చెప్పమ్మా? అని సుమిత్రను అడుగుతాడు శివన్నారాయణ. నీ కోరిక అదే అయితే మేమంతా దానికి సరే అంటామని చెప్తాడు శివన్నారాయణ.

66
జ్యోను పెళ్లికూతురిగా చూడాలనుకుంటున్నా

నిర్ణయం సుమిత్ర చేతిలోకి వెళ్లినందుకు జ్యో, పారు సంతోషిస్తారు. చెప్పు మమ్మీ నీ కూతురు భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకునే అవకాశం నీకు వచ్చింది. నేనే సీఈఓగా ఉండాలని చెప్పు అంటుంది జ్యోత్స్న. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సుమిత్ర చెప్పు అంటుంది పారు. నా నిర్ణయాన్ని గౌరవించి నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అంటుంది సుమిత్ర. ఒక తల్లిగా నా కూతురి గురించి ఏం కోరుకుంటున్నానో అదే చెప్పాలనుకుంటున్నాను అంటుంది సుమిత్ర. నా కూతురిని పెళ్లి కూతురిగా చూడాలి అనుకుంటున్నా అని సుమిత్ర చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories