చిరంజీవి తాత పాత్రలు చేయాలి అనే వారికి ఇచ్చి పడేసిన అనిల్ రావిపూడి.. బాబోయ్ అలాంటి ఇలాంటి కౌంటర్ కాదు ఇది

Published : Jan 23, 2026, 08:30 AM IST

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

PREV
15
మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ విజయం 

మెగాస్టార్ చిరంజీవి మరోసారి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో తన సత్తా చాటారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల వరకు వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే వింటేజ్ చిరంజీవిని ఈ చిత్రంలో ప్రెజెంట్ చేయడంతో ఆడియన్స్ తండోపతండాలుగా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇప్పటికీ ఈ చిత్ర వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. 

25
కావాలని చిరంజీవిపై ట్రోలింగ్ 

రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. రిలీజ్ తర్వాత కూడా అనిల్ రావిపూడి ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ ఏజ్ లో చిరంజీవి అంత ఉత్సాహంగా డ్యాన్సులు, ఎనెర్జిటిక్ గా ఫైట్స్ చేస్తుండడంతో ప్రశంసలు దక్కుతున్నాయి. మరి కొందరు మాత్రం చిరంజీవి ఏజ్ కి తగ్గ పాత్రాలు చేయడం లేదని ట్రోల్ చేస్తున్నారు. 

35
వారితో పోల్చుతూ చిరంజీవిని తగ్గించడానికి.. 

అని రావిపూడి తాజా ఇంటర్వ్యూలో చిరంజీవిని ట్రోల్ చేసే వారికి ఇచ్చి పడేశారు. అనిల్ రావిపూడి ట్రోలర్స్ కి ఇచ్చిన కౌంటర్ అలాంటి ఇలాంటి కౌంటర్ ఇవ్వలేదు. అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. చిరంజీవి ఇంకా ఇలాంటి పాత్రలు చేయడం అవసరమా ? మోహన్ లాల్, రజినీకాంత్, అమితాబ్ లాంటి సీనియర్లు ఎలాంటి పాత్రలు చేస్తున్నారో చూడండి. వాళ్ళలా చిరంజీవి ఎందుకు చేయడం లేదు అని కొందరు ప్రశ్నిస్తున్నట్లు యాంకర్ అనిల్ రావిపూడిని అడిగారు. 

45
అవి లేకుండా రజినీకాంత్ సినిమాలని ఊహించుకోగలమా 

దీనికి అనిల్ రావిపూడి బదులిస్తూ.. ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేయడానికి, కావాలని తగ్గించడానికి కొందరు వ్యక్తులు ఇలా మాట్లాడుతుంటారు. ప్రతి నటుడికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. రజినీకాంత్ గురించి మాట్లాడుతున్నారు కదా.. ఆయన సినిమాలని హై స్పీడ్ వాకింగ్ స్టైల్ లేకుండా ఊహించుకోగలమా ? అది రజినీకాంత్ స్టైల్, స్ట్రెంత్. రజనీకాంత్ గారికి తగ్గ సీన్లు ఆయన సినిమాలో ఉండాలి. అదే విధంగా చిరంజీవి గారికి తగ్గ సీన్లు ఆయన సినిమాల్లో ఉండాలి. 

55
అద్భుతమైన లుక్స్ 

 కాకపోతే ఆ సన్నివేశాలు నమ్మదగినవిగా ఉండాలి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నయనతార తో లవ్ సీన్స్ చాలా క్యూట్ గా, నమ్మదగినవిగానే ఉన్నాయి కదా అని అనిల్ రావిపూడి తెలిపారు. మరో విషయం ఏంటంటే ఇంకా చిరంజీవి గారు అద్భుతమైన లుక్స్ మైంటైన్ చేస్తున్నారు. హుక్ స్టెప్ సాంగ్ కి డ్యాన్స్ చేసి ఆయన ఎలాంటి అలసట లేకుండా అలా వెళ్లిపోయారు. ఆయన అంత ఎనెర్జిటిక్ గా ఫిట్ గా ఉన్నప్పుడు.. తాత పాత్రలే చేయాలి, తండ్రి పాత్రలే చేయాలి అని మనం ఎందుకు రుద్దాలి అని అనిల్ రావిపూడి కౌంటర్ ఇచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories