Illu Illalu Pillalu Today Episode Jan 22: విశ్వక్‌తో లేచిపోయి పెళ్లి.. గట్టి నిర్ణయం తీసుకున్న అమూల్య

Published : Jan 22, 2026, 09:57 AM IST

Illu Illalu Pillalu Today Episode Jan 22: అమూల్యను ఎలాగైనా ఇంట్లోంచి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు విశ్వక్. ఆ పెళ్లి విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంటుంది అమూల్య. ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ లో ఏ జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
అమూల్యకు అన్నయ్య గిఫ్టులు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో అమూల్య రాత్రిపూట ఒక్కతే మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తన తండ్రి రామరాజు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో సాగర్, ధీరజ్, చందు, వల్లి, ప్రేమ, నర్మద కలిసి తన పక్కన కూర్చుంటారు. అమూల్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే తమ ప్రాణమే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోందని అంటారు అన్నదమ్ములు. చందు, ధీరజ్, అమూల్యకి గిఫ్టులు కొన్నామని చెబుతారు. సాగర్ మాత్రం ఏమీ కొనలేదని డల్‌గా ఉంటాడు. అప్పుడు ముగ్గురు అన్నదమ్ముల కలిసే గిఫ్ట్‌లు ఇస్తామని వెళ్లి తీసుకురమ్మని వల్లికి చెబుతారు. 

ఈలోపు కామాక్షి అరుచుకుంటూ నాకేమీ గిఫ్ట్ లేవా? చెల్లికేనా? అని గొడవ పడుతూ ఉంటుంది. ఈలోపే తిరుపతి వచ్చి వారికి చెల్లి అంటే ఎంత ప్రేమో.. అక్కన్నా కూడా అంతే ప్రేమ అని అంటాడు. కాకపోతే అక్క మీద చెల్లి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ అని అంటాడు తిరుపతి. ఇక ముగ్గురు అన్నదమ్ములు గిఫ్టులు తీసుకొచ్చి చెల్లె ముందు పెడతారు. సాగర్ కు తెలియకుండా నర్మద కూడా గిఫ్ట్ కొంటుంది. చందు చీర కొంటే, ధీరజ్ నెక్లెస్ కొంటాడు. అవన్నీ అమూల్యకు అందజేస్తారు. ఈలోపు కామాక్షి నాకు కనీసం ఒక్కటైనా ఇవ్వండిరా అని బతిమిలాడుతుంది. వాళ్లు ఏమి ఇవ్వట్లేదని వారి వెంటపడి కొడుతుంది కాసేపు ఈ సీన్ ఫన్నీగా మార్చాడు డైరెక్టర్.

24
మనసు మార్చుకున్న అమూల్య

అమూల్య అన్నదమ్ములను చూసి ఇంతటి ప్రేమ, ఆప్యాయతలను దూరం చేసుకోవాలా ఆ విశ్వక్ కోసం? పూర్తిగా నా కుటుంబానికి దూరం అయిపోవాలా? అని ఆలోచిస్తుంది. తన కుటుంబం తనపై చూపించే ప్రేమను చూసి ఆనందిస్తుంది. అన్నదమ్ములు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని తన గదిలోకి వెళ్తుంది. గదిలో గాభరాగా అన్నిచోట్లా వెతుకుతుంది. ఈ లోపు తల్లిని పిలిచి ‘అమ్మా.. నా ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడ పడిపోయింది’ అని అడుగుతుంది. ఇద్దరూ కలిసి వెతుకుతారు. అమూల్యకే ఆ రింగు దొరుకుతుంది. దాన్ని చూసి ఆనందంతో చూసి వేలికి పెట్టుకుంటుంది. 

అలా అమూల్య ఆనందంగా పెట్టుకోవడం చూసి వేదవతి ‘ఏంటే ఆ ఉంగరాన్ని అంతలా చూసి మురిసిపోతున్నావ్. ఇందాక నేను ఇచ్చినప్పుడేమో నిర్లక్ష్యంగా పడేసావ్. నీ బాధ నాకు అర్థం కావడం లేదు’ అని అంటుంది. దానికి అమూల్య ‘దీని విలువ నాకు ఇప్పుడే అర్థమైంది అమ్మా. ఇందాకటి వరకు ఇది ఉంగరం అనే అనుకున్నాను. ఇది నా అన్నదమ్ముల ఆప్యాయత అని, మా నాన్న పరువు అని, మన ఇంటి మర్యాద అని... ముఖ్యంగా మా అమ్మ ప్రాణం అని నాకు ఇప్పుడే అర్థమైంది. లోకజ్ఞానం తెలియని నేను.. ఆరోజు నీ కడుపులో అడ్డం తిరిగినేమో, కానీ దేవుడులాంటి అమ్మానాన్న మనసు తెలుసుకున్న నేను ఇకమీదట ఎప్పుడూ వాటి మాటకు ఎదురు తిరగడం, వాళ్లకి నలుగురిలో మాట వచ్చే పని ఏదీ చేయను’ అని తల్లిని కౌగిలించుకుంటుంది. దీంతో వేదవతి ఎమోషనల్ అవుతుంది. ‘మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమే. మీ నాన్నే గెలిచారు’ అని అమూల్యను ముద్దాడుతుంది వేదవతి.

34
సేనాపతి ఇంటికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

ఇక్కడ నుంచి సీన్ భద్రావతి ఇంటికి మారుతుంది. సేనాపతి మాట్లాడుతూ ‘ఇప్పుడు పెద్దమ్మ మన ఇంటికి ఎందుకు వస్తోంది’ అని అడుగుతాడు. భద్రావతి ‘ఎందుకో తెలియదు కానీ, ఆవిడ దగ్గర మన ఇంటి విషయాలు ఏవీ మాట్లాడకండి. చాలా గుట్టుగా ఉండండి’ అని చెబుతుంది. ఈ లోపు కారులో పెద్దమ్మ వచ్చి దిగుతుంది. ఆమె ప్రేమ ఎలా ఉందని అడుగుతుంది. కానీ ఎవరూ మాట్లాడకపోయేసరికి.. ‘ఇంటి ముందున్న కూతురుతో కూడా మాట్లాడడం లేదన్నమాట, నాకు అన్ని విషయాలు తెలుసు. మీ అమ్మ ఈ వయసులో తీర్థయాత్రలు చేస్తూ బయట ఉంటుందంటే మీరు ఎంతగా చేయి దాటిపోయారో నాకు అర్థం అవుతుంది. చెబుతా.. అన్ని సెట్ చేశాకే వెళ్తా’ అనే సీరియస్ గా గదిలోకి వెళ్ళిపోతుంది. విశ్వక్ మాట్లాడుతూ ‘అత్తా ఈవిడ ఇక్కడ ఉండగా మనం అనుకున్న పనులు చేయగలమా’ అని అంటాడు. దానికి భద్రావతి దేవుడే దిగి వచ్చినా మనం చేయాలనుకున్నది చేయాల్సిందే అని చెబుతుంది.

44
వల్లిని బెదిరించిన విశ్వక్

ఇక ఇక్కడి నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. వేదవతి పూజ చేసి తన కూతురు పెళ్లి సవ్యంగా జరిగేలా చూడమని కోరుకుంటుంది. అలాగే అమూల్య తన వల్ల తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రాకూడదని కోరుకుంటుంది. నర్మద, ప్రేమ... వల్లిని గమనిస్తూ ఉంటారు. ఈ లోపు నర్మద, ప్రేమ.. వల్లి పక్కన నిల్చుని ఎంతగా దేవుని కోరుతున్నావంటే ఏదో కొంపల ముంచే విషయమే కోరుతున్నావన్నమాట అంటారు. దానికి వల్లి అలాంటిదేమీ లేదని చెబుతుంది. రామరాజు ప్రేమ, ధీరజ్ శుభలేఖలు అచ్చు వేయించడానికి వెళ్ళమని చెబుతాడు. ఆ తర్వాత అమూల్య తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. 

ఈలోపు విశ్వక్ అమూల్యకు ఫోన్ చేస్తాడు. విశ్వక్ ఫోన్ చూడగానే ఎంతో ఆనందపడుతుంది అమూల్య. కానీ తన అన్నయ్యలు, నాన్న గుర్తొచ్చి ఫోను ఎత్తదు. దీంతో విశ్వక్ మళ్లీ చేస్తాడు. అయినా ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో వల్లికి ఫోన్ చేస్తాడు విశ్వక్. ఫోన్ తీసుకెళ్లి అమూల్యకు ఇమ్మని బెదరిస్తాడు విశ్వ. దీంతో వల్లి ఫోన్ పట్టుకొని వెళుతూ ఉంటే వేదవతి ఆమెను పిలుస్తుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories