శర్వానంద్ నటించిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ హిట్ అయ్యింది. శర్వాని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. కానీ ఈ సినిమా కోసం ముందు అనుకున్న హీరో శర్వానంద్ కాదట. మరి ఆ హీరో ఎవరనేది చూస్తే.
శర్వానంద్ చాలా గ్యాప్‌తో `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఆయన చిత్రం మంచి టాక్‌తో రన్ అయ్యింది. డీసెంట్ వసూళ్లని రాబడుతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం మరిన్ని వసూళ్లని కలెక్ట్ చేయబోతుంది. మిగిలిన సినిమాల జోరు తగ్గినా, ఈ చిత్రానికి మాత్రం మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. మొత్తానికి శర్వాకి హిట్ పడింది.
24
`నారీ నారీ నడుమ మురారి` చిత్రానికి నరేష్ అసలైన హీరో
శర్వానంద్ హీరోగా నటించిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఆయన చివరగా `సామజవరగమన` చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. వీకే నరేష్, సిరి హనుమంతుతోపాటు వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సుదర్శన్, సంపత్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇందులో శర్వానంద్‌తోపాటు నరేష్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఈమూవీకి అసలైన హీరో నరేష్. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
34
నారీ నారీ నడుమ మురారి చేయాల్సిన హీరో నాగచైతన్య
`నారీ నారీ నడుమ మురారి` మూవీ ముందు అనుకున్న హీరో శర్వానంద్ కాదట. నాగచైతన్యతో చేయాలనుకున్నారట. ఆయనతో చేసేందుకే దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ స్క్రిప్ట్ రాశారట. కానీ నాగచైతన్యతో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కారణాలు తెలియదు కానీ, చైతూ ఈ మూవీ చేసేందుకు ఆసక్తి చూపించలేదట. దీంతో ఆ తర్వాత ఎవరు అని కొందరి పేర్లు వెతకగా శర్వానంద్ అయితే సూట్ అవుతాడనిపించి, ఆయనకు కథ చెప్పగా, వెంటనే ఓకే చేశాడని, అలా శర్వానంద్ తో ఈ మూవీ సెట్ అయ్యిందని సమాచారం.
శర్వానంద్‌కి అంతకు ముందు హిట్లు లేవు. ఆయనకు సక్సెస్ పది చాలా ఏళ్లు అవుతుంది. `మహానుభావుడు` మూవీ తర్వాత సరైన హిట్ పడలేదు. మధ్యలో `ఒకే ఒక జీవితం` మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. దాదాపు ఏడెనిమిది సినిమాలు డిజప్పాయింట్ చేశాయి. ఈ క్రమంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శర్వానంద్‌కి సాలిడ్ హిట్ పడిందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి కూడా సరైన థియేటర్లు లేక కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. పైగా శర్వానంద్ అనేసరికి బజ్ లేదు. ప్రమోషన్స్ చేయలేదు. ఇవన్నీ సినిమాపై ఎఫెక్ట్ చూపాయి. మంచి థియేటర్లు, మంచి ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా పెద్ద రేంజ్ హిట్ అయ్యేది. అదే సమయంలో నాగ చైతన్య చేస్తే ఈజీగా వంద కోట్ల మూవీ అయ్యేది.