Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గతాన్ని వైరల్ చేసిన బాలు, మళ్లీ గుడి ముందు అడుక్కోనున్న మనోజ్?

Published : Jan 22, 2026, 09:02 AM IST

Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గతం గురించి మీనాకు తెలిసిపోయింది. మీనా కూడా ఇంట్లో అందరికీ చెప్పాలని అనుకుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో టీవీ కంటే ముందుగా తెలుసుకుందాం.. 

PREV
14
Gunde Ninda Gudi Gantalu

బాలు తన కారులో ఓ మహిళలకు డెలివరీ జరిగింది అని చెప్పిన సంగతి తెలిసిందే. అది విని.. ప్రపంచంలో అందరికీ పిల్లలు పుడుతున్నారని.. మన ఇంట్లో మాత్రం ఎవరికీ ఆ ధ్యాస లేదు అని ప్రభావతి నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అయితే.. ఆ బిడ్డను కాపాడిన పుణ్యం ఎక్కడికీ పోదని.. మన ఇంట్లో కూడా పిల్లలు పుడతారని..ముగ్గురికీ ఒకేసారి పుట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని సత్యం అంటాడు. సత్యం అలా అంటున్నప్పుడు మీనా.. రోహిణీ వైపే చూస్తుంది. ‘ ఎవరికి ముందు బిడ్డ పుడితే.. వాళ్లకు మీ అమ్మగారు ఆస్తి రాసి ఇస్తాను అన్నారు’ అని ప్రభావతి అంటే .. ‘ నీ ఏడుపుకు కారణం అదా’ అని సత్యం అంటాడు.‘ నాన్న అన్నట్లు..అన్నయ్య పుణ్యం చేశాడు కాబట్టి..బాలు అన్నయ్యకే ముందు పిల్లలు పుడతారు’ అని రవి అంటే.. ‘ ఏం కాదు.. రోహిణీ పెద్ద కోడలు కాబట్టి.. తనకే ముందు బిడ్డ పుట్టాలి’ అని ప్రభావతి అంటుంది. ‘ మా గురూజీ కలిసొచ్చే కాలం వస్తే.. నడిచొచ్చే కొడుకు పుడతాడు అని చెప్పాడమ్మా’ అని మనోజ్ అంటాడు. అప్పుడు కూడా మీనా రోహిణీనే చూస్తుంది. ‘ ముందు పెళ్లి అయ్యింది.. మీనాకే కదా.. మీనాకే పిల్లలు పుడతారు’ అని శ్రుతి అంటే.. ‘ అసలు లెక్క చూసుకుంటే.. రోహిణీకి ఈపాటికే పిల్లలు పుట్టాలి’ అని ప్రభావతి అంటుంది. ఆ మాటకు మీనా షాకై పడిపోబోతుంది. రోహిణీని చూసి కడుపు మంట అని ప్రభావతి అంటే.. ‘ నాకేమీ కడుపు మంటలేదు..నడిచొచ్చే కొడుకు పుడతారు అన్నారు కదా.. రోహిణీ నడిపించుకుంటూ తీసుకొస్తుందేమో అడగండి’ అని మీనా అంటుంది. ఆమాటకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

24
శ్రుతికి నిజం చెప్పేసిన మీనా

వెంటనే బాలు‘మాకేమి ముందు పిల్లలు పుట్టాలని లేదు.. నా భుజాల మీద బాధ్యత ఉంది. ముందు రూమ్ కట్టుకోవాలి.. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాం’ అని చెబుతాడు. ‘ ఆ రూమ్ కట్టడానికి ఇంకా 50 ఏళ్లు పడుతుందా’ అని ప్రభావతి కౌంటర్ వేస్తే..‘ నీకు కడుపు మంట.. కొడుకు బాగుపడితే చూడలేని తల్లి మా ఇంట్లోనే ఉంది..మాతృమూర్తి’ అని బాలు కౌంటర్ వేస్తాడు. అయినా పిల్లల గురించి ఇప్పుడు ఎందుకు అని రవి, శ్రుతి అంటే.. ‘ఎవరు ఏం అనుకున్నా రోహిణీకే ముందు పిల్లలు పుడతారు’ అని ప్రభావతి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక... మీనా తనకు తెలిసిన నిజం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. బాలు తన వైరల్ వీడియో చూపించడానికి వస్తే.. ఏదేదో మాట్లాడుతుంది. అయితే.. ఏమైంది అని బాలు అడుగుతాడు. కానీ, మీనా సరిగా సమాధానం చెప్పదు.బాలు ఎన్ని రకాలుగా అడిగినా మీనా మాత్రం రోహిణీ గురించి బయటపెట్టదు.దీంతో.. బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మీనా ఇదే విషయం ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు..శ్రుతి.. తన సీరియల్ లో క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ కిందకు వస్తుంది. ‘ పెళ్లికి ముందే బిడ్డను కని.. ఆ విషయం దాచి ఇంకో పెళ్లి చేసుకుంటుందా?’ అని శ్రుతి ఫోన్ లో అనగానే.. అది విని మీనా తన చేతిలో ఉన్న గిన్నె కింద పడేస్తుంది. ఆ శబ్దం విని.. ఫోన్ పెట్టేసి.. శ్రుతి..మీనా దగ్గరకు పరుగులు తీస్తుంది. ఏమైంది అని అడిగితే.. ఏమీ లేదని చెబుతుంది. మీనా ముఖంలో సంతోషం లేదని గమనించిన శ్రుతి... నానా రకాలుగా మాట్లాడి.. మీనా నోట నిజం చెప్పిస్తుంది.‘ రోహిణీ రెండో బిడ్డను కనడానికి హాస్పిటల్ కి వెళ్లింది అంటే.. ముందు బిడ్డ ఉన్నట్లే కదా.. వాళ్ల పెళ్లి మా తర్వాతే జరిగింది.. ఈ మధ్యలో తనకు ప్రెగ్నెన్సీ కూడా రాలేదు.. అంటే..పెళ్లికి ముందే బిడ్డ ఉన్నట్లే కదా’ అని మీనా చెప్పగానే.. ఆ కంగారు శ్రుతిలో మొదలౌతుంది. ఈ విషయాన్ని డైరెక్ట్ గా వెళ్లి రోహిణీ నే అడుగుదాం అని శ్రుతి అంటే.. ‘ రోహిణీ చాలా తెలివైంది.. చాలా అందంగా అబద్ధాలు చెప్పగలదు.. మొన్న హాస్పిటల్ కి వెళ్లింది అని నేను చెప్పగానే.. చాలా పెద్ద గొడవ చేసింది.. నాదే తప్పు చేసి.. అత్తయ్యతో తిట్టించింది..ఇప్పుడు ఈ విషయం అడిగితే.. ఇంకా పెద్ద రచ్చ చేస్తుంది..తాను తెలివిగా తప్పించుకుంటుంది’ అని మీనా అంటుంది. మరి ఏం చేద్దాం అని శ్రుతి అడిగితే.. ఎవరికీ చెప్పకూడదు.. మనమే సీక్రెట్ గా ఉంచాలి అని అంటుంది.

34
బాలు చెవిలో ఊదేసిన రవి..

ఎవరికీ చెప్పకూడదు అని మీనా గట్టిగా చెప్పినా సరే.. శ్రుతి వెళ్లి..ఈ విషయాన్ని రవి చెవిలో ఊదేస్తుంది. రవి మొదట నమ్మడు. కానీ.. ఈ విషయం చెప్పింది.. మీనా అనే సరికి నమ్మేస్తాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని రవి దగ్గర శ్రుతి మాట తీసుకొని వెళ్లిపోతుంది. ఇక.. నిజం తెలుసుకున్న తర్వాత నోరు ఆగాక... రవి వెళ్లి.. బాలుకి చెప్పేస్తాడు. అది విన్న తర్వాత.. బాలు రియాక్షన్ చాలా ఫన్నీగా ఉంటుంది.

‘ రోహిణీ వదిన ముందే తల్లి అయితే.. ఆ బిడ్డను ఏం చేసింది?’ అని రవి అంటే.. ‘ కుంతీ దేవిలా పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసిందా? దేవకి లా యశోధ ఇంట్లో పెంచుతుందా?’ అని బాలు అంటాడు. ‘ ఇదంతా మనోజ్ అన్నయ్యకు తెలియదు కదా?’ అని రవి అంటే.. ‘ ఈ విషయం తెలిస్తే మనోజ్ సర్దుకుపోయే రకం కాదు.. అసలు పార్లరమ్మ ఈ నిజానికి ఎవరికీ తెలియకుండా ఎలా దాచింది?’ అని బాలు అంటాడు. అసలు శ్రుతి చెప్పింది నిజమేనా? అని బాలు అంటే శ్రుతికి నిజం చెప్పింది మీనా నే అని రవి అసలు విషయం బయటపెడతాడు.‘ అసలు ఈ నిజం తెలిస్తే లక్షలు మింగినోడు.. ఈ నిజాన్ని కూడా మింగేస్తాడా లేక.. కాపురం నాశనం చేసుకుంటాడా? వెళ్లి పార్క్ లో పడుకుంటాడా, ఫర్నీచర్ షాప్ వదిలేసి.. గుడి ముందు వెళ్లి అడుక్కుంటాడా? ఈ నిజం తెలిస్తే నాన్న ఏమైపోతాడు..? లక్షావతి ఏమైపోతుంది?’ అని బాలు తెగ కంగారు పడతాడు.. ‘ అనవసరంగా ఈ విషయం నీకు చెప్పాను.. ఇంట్లో వైరల్ చేయవు కదా’ అని... భయపడిన రవి.. బాలు దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. ఈ నిజాన్ని నేను ఎలా దాచుకోవాలి అని కంగారు పడిన బాలు.. వెళ్లి వాళ్ల నాన్న సత్యం కి నిజం చెప్పేస్తాడు.

44
రోహిణీ ముందే తల్లి అయ్యిందా?

బాలు చెప్పిన విషయాన్ని విని.. సత్యం షాకౌతాడు. రోహిణీ ఇంతక ముందే తల్లి అయ్యిందా? నేను నమ్మలేకపోతున్నాను అని సత్యం అంటే.. ‘ నేను ముందు నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాను.. అమ్మకు తెలీకుండా ఇల్లు తాకట్టు పెట్టించింది.. ఆ డబ్బుతో పార్లర్ పెట్టించింది.. దానికి అమ్మ పేరు పెట్టి.. కొద్ది రోజుల తర్వాత అమ్మ పేరు పీకి వేరే పేరు పెట్టుకుంది.. అదేంటి అని అడిగితే.. ఏవేవో కాకమ్మ కథలు చెప్పింది.. ఇప్పుడు ఇంత పెద్ద నిజం ఎవరికీ తెలియకుండా దాచి పెట్టింది.. తను పెద్ద ఫ్రాడ్ నాన్న..ఏదో తప్పు చేస్తుంది’ అని బాలు అంటాడు. ‘ మన ఇంటి ఆడపిల్ల గురించి అలా మాట్లాడటం తప్పురా’ అని సత్యం నచ్చచెబుతాడు. కానీ బాలు వదలడు.. పార్లరమ్మ ఏదో దాచిపెడుతోంది అని బాలు అంటాడు. పార్లరమ్మ ఫ్రెండ్ ని నిలదీస్తే.. నిజం బయటపడుతుందని బాలు అంటే.. మన ఇంటి అమ్మాయి గురించి వేరే వాళ్లను అడగడం పద్దతి కాదు అని సత్యం ఆపేస్తాడు. ఏం చేయాలి అనే నిర్ణయాన్ని సత్యం కి వదిలేసి.. బాలు వెళ్లిపోతాడు.

ఇక.. సత్యం వెళ్లి.. ప్రభావతికి చెబుతాడు. ప్రభావతి ఆ మాట విని షాక్ అవుతుంది. బాలు చెప్పింది నిజం కాదని.. వాళ్లకు మనోజ్, రోహిణీ అంటే పడదు అందుకే అలా చెప్పి ఉంటాడు అని ప్రభావతి అంటుంది. కానీ.. సత్యం ఊరుకోడు. నిప్పులేనిదే పొగరాదు.. ఇందులో ఎంతో కొంత నిజం ఉందని నాకు కూడా అనిపిస్తుంది అని సత్యం అనడంతో ప్రభావతి ఆగిపోతుంది. కమింగప్ లో.. రోహిణీని నిలదీస్తుంది. మరి. రోహిణీ నిజం చెబుతుందా? అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం...

Read more Photos on
click me!

Recommended Stories