Illu Illalu Pillalu Today Episode Jan 14: శ్రీవల్లికి విశ్వక్ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ ఆపడం కోసం శ్రీవల్లిని విశ్వక్ ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు ? ఆ తర్వాత శ్రీవల్లి ఏం చేసింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ బుధవారం జనవరి 14న ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంగేజ్మెంట్ రింగ్ కోసం ధీరజ్, ప్రేమ ఇద్దరూ గోల్డ్ షాప్ కి వెళతారు. బైక్ పై వెళుతున్నంత సేపు, షాప్ లో ఉన్నంత సేపు ఇద్దరి మధ్య చిలిపి గొడవలు జరుగుతూనే ఉంటాయి. గోల్డ్ షాప్ లో కూడా ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తూ ఉంటుంది.
24
రింగ్ కోసం నాటకాలు ఆడిన ప్రేమ
ధీరజ్ ఒక రింగ్ ని తీసుకుని శాంపిల్ గా ప్రేమ వేలికి పెడతాడు. దీనితో ప్రేమ నిజంగానే ప్రేమగా ఫీల్ అవుతుంది. తిరిగి వేలి నుంచి ఆ ఉంగరాన్ని బయటకి తీయడానికి ఇష్టపడదు. దీనితో తన వేలి నుంచి ఉంగరం బయటకి రానట్లు, బిగుసుకుపోయినట్లు నటిస్తుంది. షాప్ ఓనర్ కి కూడా తన ఉద్దేశాన్ని సైగ చేసి చెబుతుంది. దీనితో షాప్ ఓనర్ కూడా ఆ ఉంగరం ఇక రావడం కష్టం అని చెబుతాడు. దీనితో ధీరజ్ తప్పక దానిని కొంటాడు.
34
శ్రీవల్లికి విశ్వక్ బ్లాక్ మెయిల్
ఇంతలో శ్రీవల్లికి విశ్వక్ ఫోన్ చేస్తాడు. విశ్వక్ నుంచి కాల్ రాగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఆ ఇంట్లో శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయటపెడతా అని విశ్వక్.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ ఆపాలనేది విశ్వక్ ప్లాన్. అందుకు శ్రీవల్లి భయపడుతూనే అంగీకరిస్తుంది.
ఆ తర్వాత శ్రీవల్లి తన తల్లి భాగ్యం కు( మిర్చి మాధవి) ఫోన్ చేసి విశ్వక్ ఫోన్ చేసినట్లు చెబుతుంది. తన సమస్య వివరిస్తుంది. దీనితో మిర్చి మాధవి కూడా ఆ నిశ్చితార్థం ఆపేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఫోటోలు పెళ్లి వాళ్ళ కంటపడేలా చేయాలి అని అనుకుంటుంది. ఎంగేజ్మెంట్ కి తన భర్తతో కలిసి బయలుదేరుతుంది. ఇంతలో ప్రేమ నగలు అలంకరించుకుని రెడీ కావడం ధీరజ్ చూస్తాడు. ఆ నగలు తీసేయమని ప్రేమపై కోపంగా అరుస్తాడు. ఆ నగల వల్లే తనకి సమస్యలు మొదలయ్యాయి అని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.