రామ్ చరణ్ కి స్కూల్లో మార్కులు తక్కువ రావడానికి కారణమైన మరో హీరో ఎవరో తెలుసా?

Published : Jan 14, 2026, 07:29 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలను వెనక్కి నెట్టి.. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు.అయితే చరణ్ చదువుకునే రోజుల్లో మాత్రం ఓ హీరో వల్ల ఆయనకు మార్కులు తక్కువగా వచ్చాయట, హైట్ కూడా పెరగలేకపోయాడట. ఇంతకీ ఎవరా హీరో? 

PREV
15
మెగా వారసుడిగా ఇండస్ట్రీని ఏలుతున్నహీరో..

చిరంజీవి ఎంతో కష్టపడి.. మెగా ఇమేజ్ ను క్రియేట్ చేశాడు. అందులోకి వరుసగా వారసులు వచ్చి.. మెగాస్టార్ స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నారు. కేవలం వారసత్వం మీదనే ఆధారపడకుండా తమ టాలెంట్ తో హీరోలుగా ఎదిగి చూపించారు. చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు స్పెషల్ గా అభిమానులను కూడా సాధించారు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ హీరోలను కూడా దాటుకుని.. పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. కానీ తన స్కూల్ డేస్ లో మాత్రం ఓ హీరో వల్ల తాను ఎదగలేకపోయాను అని అన్నారు రామ్ చరణ్.

25
స్కూల్ డేస్ ను గుర్తు తెచ్చుకున్న చరణ్..

గతంలో ఓ సందర్భంలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన స్కూల్ డేస్ ను గుర్తు తెచ్చుకుని.. తన హైట్, చదువు, ఫుడ్ గురించి మాట్లాడుతూ.. అందులోకి మరో హీరోని కూడా లాగాడు. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తి కరమైన విషయాలను చరణ్ అందరితో షేర్ చేసుకున్నాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన హైట్ తక్కువగా ఉండడానికి కారణం మరో హీరో రానా అని సరదాగా వ్యాఖ్యానించారు. రానా నన్ను స్కూల్ డేస్ లో అసలు చదువుకోనిచ్చేవాడు కాదు అని అన్నారు.

35
రామ్ చరణ్ మాట్లాడుతూ..

రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను స్కూల్లో ఉన్నప్పుడు సరిగ్గా మార్కలు వచ్చేవి కాదువ.. క్లాస్ లు కూడా సరిగ్గా వినలేకపోయేవాడిని.. ఎందుకంటే క్లాస్ లో నా ఎదుగుగా రానా కూర్చుని ఉండేవాడు. వాడు ఎదురుగా కూర్చుంటే బోర్డ్ ఏం కనిపిస్తుంది. అప్పుడే వాడు అంత హైట్ ఉండేవాడు. నాకేమో మా మామ పోలిక రాకూడదు.. నేను హైట్ అవ్వాలని అమ్మ.. రకరాల కూరగాయలు..మంచి పోషకాలు ఉండేలా లంచ్ బాక్స్ రెడీ చేసేది.. రానాకేమో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి చాలా పెద్ద క్యారేజ్ వచ్చేది.. అందులో సగం కూడా ఉండేది కాదు నా క్యారియర్. వాడు అంత పెద్ద క్యారేజి తినేసి.. అరే చరణ్ నీ బాక్స్ లో ఏముందిరా అని నావైపు చూసేవాడు. '' అని రామ్ చరణ్ సరదాగా మాట్లాడిన వీడియో ఈమధ్య వైరల్ అయ్యింది.

45
రామ్ చరణ్ - రానా స్నేహం..

రానా రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్.. 8వ తరగతి నుంచి వారు కలిసి చదువుకున్నారు. కలిసి తిరిగేవారు. రానా బాగా అల్లరి చేసేవాడు.. చరణ్ తో కలిసి బయట తిరిగేవారట కూడా. ప్రస్తుతం ఇద్దరు ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్నారు. చరణ్ పాన్ ఇండియా హీరోగా వెలుగు వెలుగుతుంటే.. రానా మాత్రం మంచి కథలు సెలెక్ట్ చేసుకుని.. డిపరెంట్ క్యారెక్టర్స్ ను ట్రై చేస్తున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే.. కొన్ని సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు రానా.

55
రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.. మెగా హీరో. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఈ ఏడాది సమ్మర్ లో రాబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన లో రామ్ చరణ్ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories