Chiranjeevi: డైరెక్టర్‌ కోసం కొరియోగ్రాఫర్‌గా మారిన చిరంజీవి.. `మన శంకర వర ప్రసాద్‌ గారు`లో రహస్యాలు లీక్‌

Published : Jan 14, 2026, 07:19 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి బెస్ట్ డాన్సర్‌ అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కొరియోగ్రాఫర్‌గా మారిపోయారు. ఓ దర్శకుడి కోసం ఆయన డాన్స్ మాస్టర్‌గా టర్న్ తీసుకోవడం విశేషం. ఆ కథేంటంటే? 

PREV
14
బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో `మన శంకర వరప్రసాద్ గారు` మూవీ

మెగాస్టార్‌ చిరంజీవి ఈ సంక్రాంతికి హిట్‌ అందుకున్నాడు. మూడేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్‌ కీలక పాత్రలో గెస్ట్ గా మెరిశారు. సుస్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. ఈ నెల 12న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇప్పుడు బ్లాక్‌ బస్టర్ టాక్‌తో రన్‌ అవుతుంది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో బ్లాక్‌ బస్టర్‌ మీట్‌ పేరుతో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు.

24
400కోట్లు దాటుతుందని `మన శంకర వరప్రసాద్ గారు` నిర్మాత కామెంట్‌

ఈ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడిని అందరు ప్రశంసించారు. అద్భుతమైన దర్శకుడు అంటూ వెల్లడించారు. చిరంజీవిని కొనియాడారు. సినిమా వేరే స్థాయిలో వెళ్తుందని, కలెక్షన్ల పరంగా ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో తెలియదంటున్నారు. నిర్మాత సాహు గారపాటి మాత్రం నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్లని ఆశిస్తున్నట్టు తెలిపారు. సినిమా కోసం చిరంజీవి ప్రాణం పెట్టారని తెలిపారు. ఈ క్రమంలో ఈ మూవీతో చిరు టెక్నీషియన్ గా మారిన విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ విషయాన్ని పంచుకున్నారు.

34
`మన శంకర వరప్రసాద్ గారు` మూవీ అనిల్‌ రావిపూడి డాన్స్

సినిమాలో క్లైమాక్స్ లో చిరంజీవి, వెంకటేష్‌లతో సాంగ్‌ ఉంటుంది. ఇందులో చిరు, వెంకీ ఇరగదీశారు. మాస్‌ ఆడియెన్స్ చేత థియేటర్లలో డాన్సులు వేయిస్తున్నారు. అయితే ఈ పాటలో దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా కాసేపు కనిపించారు. ఈ ఇద్దరు బిగ్‌ స్టార్స్ తో తెరని పంచుకోవాలనేది తన కోరిక అని, అందుకే ఈ పాటలో తాను కనిపించినట్టు తెలిపారు. కనిపించడమే కాదు, డాన్సులు కూడా చేశాడు. ఇద్దరి సినిమాల పాటలకు ఆయన స్టెప్పులేయడం విశేషం.

44
చిరంజీవి కొరియోగ్రఫీ

అయితే తాను ఈ పాటలో డాన్స్ చేయాలని భావించినప్పుడు చిరంజీవి, వెంకటేష్‌ ఒక్క లుక్‌ ఇలా చూశారట. ఆ తర్వాత అనిల్‌ రావిపూడికి చిరంజీవినే కొరియోగ్రఫీ చేశారట. ఎలా స్టెప్పులేయాలో నేర్పించాడట. స్టెప్‌ సరిగా రాకపోతే వేసి చూపించాడట. తన సినిమాలో, పైగా తన పాత పాటకి స్టెప్పులంటే పర్‌ఫెక్షన్‌గా ఉండాలని చెప్పి అనిల్‌ కోసం కొరియోగ్రఫీగా మారిపోయారట. ఈ విషయాన్ని అనిల్‌ పంచుకున్నారు. అయితే ఇది తనకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌ మెంట్‌ అన్నారు. అంతేకాదు సినిమాకి హిట్‌ టాక్‌ వచ్చినప్పుడు ఆయన్ని కలిస్తే ఎంతగానో అభినందించారట. ముఖాన్ని పట్టుకుని క్యూట్‌గా ఇలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారని, అదే పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నట్టు తెలిపారు అనిల్‌ రావిపూడి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories