
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి తన తల్లి భాగ్యానికి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. నర్మద వల్లిని పొగిడిందని చెప్పగానే భాగ్యానికి అనుమానం వస్తుంది. నర్మద, అమూల్య గురించి ఇన్ డైరెక్ట్ గా నిన్ను అడిగిందని సలహాలు ఎందుకు ఇచ్చావు అని వల్లిని తిడుతుంది భాగ్యం. వల్లి ఫోన్ పెట్టేసి నర్మద ఎక్కడుందో వెతుక్కుంటూ వస్తుంది. నర్మద ఎదురుగా వచ్చి వల్లి ‘థాంక్స్ అక్కా.. నువ్వు ఇచ్చిన సలహాలు వల్ల నిజానిజాలు బయటపడ్డాయి’ అని అంటుంది. వల్లి టెన్షన్ చూసి ‘అమూల్య ప్రేమలో నీ హస్తం ఏమైనా ఉందా’ అని అడుగుతుంది. వల్లి తనదేం లేదని ఏదో నాటకాలు ఆడుతూ చెబుతుంది. వల్లి అమూల్య దగ్గరికి వచ్చి ‘ఎందుకమ్మా అలా ఉన్నావు’ అని అడుగుతుంది. అప్పుడు అమూల్య ‘మనసు బరువు తగ్గి సంతోషంగా ఉన్నాను, నర్మద వదినకి అన్ని విషయాలు చెప్పేశా. అన్ని సర్దుకుంటాయని నర్మద వదిన చెప్పింది. అందుకే నాకు హ్యాపీగా ఉంది’ అంటుంది అమూల్య. అలాగే నర్మదకు ఏ ఏ విషయాలు చెప్పిందో అవన్నీ వల్లికి చెప్పేస్తుంది. దీంతో వల్లి భయంతో వణికిపోతుంది.
నర్మద.. ప్రేమను వెతుక్కుంటూ వస్తుంది. ప్రేమ బయట నిల్చుని జరిగింది తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే నర్మద ‘విన్నావు కదా ప్రేమ.. నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు. మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అనుకున్నావ్. అమూల్య గురించి నాకు తెలుసు. తను అమాయకురాలు. అందుకే ఆలోచించు అని అన్నాను’ అని అంటుంది. ‘మా అన్నయ్య మాటలు నమ్మి మిమ్మల్ని అందరిని బాధపెట్టాను. మా అన్నగాడు చెప్పింది నిజం అనుకుని మావయ్య గారిని ఇంట్లో వాళ్ళని ఎదిరించి మాట్లాడాను’ అంటూ ఏడుస్తూనే ఉంటుంది ప్రేమ.
ఈ లోపు విశ్వక్ బండి మీద ఇంటికి వస్తాడు. ఇంట్లోకి వెళుతుంటే ప్రేమ పిలుస్తుంది. నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్లి ‘ప్రేమించమని అమూల్య నీ వెంటపడిందా?’ అని అడుగుతుంది. దాంతో విశ్వక్ ఆల్రెడీ చెప్పాను కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. దానికి ప్రేమ ‘అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అమూల్య ఫస్ట్ నిన్ను ప్రేమించిందా? ఇందులో నీ తప్పేమీ లేదా?’ అని అడుగుతుంది. అప్పుడు విశ్వక్ మళ్ళీ అదే డ్రామా ఆడతాడు. దీంతో ప్రేమ లాగిపెట్టి చెంపపై కొడుతుంది. భద్రావతి, ప్రేమ తల్లి, సేనాపతి అందరూ అక్కడికి వస్తారు. ప్రేమ వరుసపెట్టి విశ్వక్ చెంపమీద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. అడ్డొచ్చిన తండ్రిని కూడా కసిరిపడేస్తుంది. ఇదంతా వల్లి చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ కంగారును నర్మద గమనిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్లందరినీ పిలుచుకునిరా అని వల్లికి చెబుతుంది.
మరోపక్క ప్రేమ విశ్వక్ షర్ట్ ను పట్టుకొని ఇంట్లోంచి బయటికి లాక్కొస్తుంది. ఈ లోపు రెండు కుటుంబాలు నడిరోడ్డు మీదకు వచ్చి నిలుచుంటారు. ప్రేమ చాలా సీరియస్ అవుతూ ‘ఏంట్రా? ఏం చెప్పావు రా? అమూల్యే నిన్ను ప్రేమించిందా? నువ్వు ఆమెను కావాలని ప్రేమించలేదా? నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెబితే నిజమని నమ్మాను. మా అన్నయ్య తప్పేమీ లేదని అందర్నీ ఎదిరించి నీ పక్కన నిలబడ్డాను కదరా. ఎందుకు ఇంతగా మోసం చేసావ్. ఆడపిల్ల జీవితమంటే నీకు నవ్వులాటగా ఉందా? నీ మాటలు నిజమేనని నమ్మి తనదే తప్పని మాట్లాడాను. మా అత్తమామలు కూతుర్ని పద్ధతికి మారుపేరులా పెంచారు’ అని తిడుతూనే ఉంటుంది ప్రేమ.
‘చెల్లెలికి అబద్ధం చెప్పి చెల్లెల్ని అడ్డుపెట్టుకొని ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? ఇలా చేయడానికి సిగ్గు అనిపించలేదా?’ అంటుంది. తర్వాత వేదవతి దగ్గరకు వెళ్లి ‘ఎందుకత్తా ఇలా చేస్తున్నావ్.. నన్ను తిరిగి మన ఇంటికి వచ్చేలా చేయడం కోసమా? ఇన్ని రోజులు చెప్పలేదు.. ఇప్పుడు చెబుతున్నాను వినండి.. ఇది నా కుటుంబం. ధీరజ్ నా ప్రాణం. నన్ను ధీరజ్ నుంచి ఎంత విడగొట్టాలని మీరు ప్రయత్నిస్తే నేను అంతగా నా భర్తను ప్రేమిస్తాను. ఒకవేళ నన్ను ధీరజ్ కు దూరం చేయాలని ప్రయత్నిస్తే నేను నా ప్రాణాలు వదిలేస్తాను’ అని గట్టిగా చెబుతుంది ప్రేమ.
విశ్వక్ కు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. ‘నువ్వు నా కుటుంబం జోలికి వచ్చినా, అమూల్య జోలికి వచ్చినా అన్నయ్యవి అని కూడా చూడను.. చంపేస్తాను’ అని అంటుంది. తరువాత అందరూ ఎవరి ఇళ్లల్లోకి వారు వెళ్లిపోతారు. ప్రేమ.. నర్మద దగ్గరికి వెళ్లి ‘నా తప్పు నేను తెలుసుకునేలా చేసావ్ అక్కా.. థాంక్స్’ అని చెబుతుంది. ప్రేమ, నర్మద కూడా ఇంట్లోకి వెళ్లి పోతారు. రోడ్డు మీద వల్లి మాత్రమే మిగిలిపోతుంది. ఎప్పటిలాగే కుటుంబమంతా కలిసిపోయిందని, ఆనందంగా ఉన్నారని ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చాక రామరాజుతో ప్రేమ మాట్లాడుతుంది. ‘మామయ్య నేను పొరపాటు పడ్డాను. ఆరోజు మా అన్నయ్య మాటల్ని, వాడు పెట్టుకున్న కన్నీళ్ళని నిజమని నమ్మాను. అందుకే వాడు ఏ తప్పు చేయలేదని, అమూల్య వాడిని ప్రేమించిందని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. మిమ్మల్ని అందరిని చాలా బాధపెట్టాను. ఒకరకంగా ఆరోజు అంత పెద్ద గొడవ జరగడానికి నేనే కారణమయ్యాను. నేను ఎంతగా బాధపెట్టాను తెలుసుకున్నాను’ అని చెబుతోంది. ప్రేమ ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది