Illu Illalu Pillalu Today Episode Feb 9: రామరాజు ఇంట్లో మరో కుంపటి, సాగర్ చేసిన పిచ్చి పని

Published : Feb 09, 2026, 09:55 AM IST

Illu Illalu Pillalu Today Episode Feb 9: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో సాగర్ వనజ డబ్బులు వాడేస్తాడు. ఆ విషయం తెలియక రామరాజు 20 లక్షలు వనజకు ఇవ్వమని చెబుతాడు. దాంతో సాగర్ గాభరా పడతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
సాగర్ తెచ్చిన తలనొప్పి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటాడు. రామరాజు సాగర్ ను పిలిచి వనజకు ఇవ్వాల్సిన 20 లక్షల గురించి అడుగుతాడు. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసావా? అని ప్రశ్నిస్తాడు.దానికి సాగర్ తడబడుతూ సమాధానం చెబుతాడు.డిపాజిట్ చేశానని అబద్ధం చెబుతాడు.ఈ లోపు వేదవతి మీ నాన్న ఇప్పట్లో రైస్ మిల్లుకు రారు.నువ్వే పూర్తిగా దాని బాధ్యతలు చూసుకోవాలని చెబుతోంది.దాంతో సాగర్ కంగారు పడతాడు.డబ్బులు ఇచ్చి కొనుక్కున్న గవర్నమెంట్ ఉద్యోగంలో సోమవారం జాయిన్ అవ్వాలన్న విషయం గుర్తు చేసుకుంటాడు. ఏం చెప్పాలో తెలియక సరే నాన్న అనేసి వెళ్ళిపోతాడు. ఆ కంగారును నర్మద కనిపెట్టేస్తుంది. ప్యాంటు వెనుక పాకెట్లో కవర్ కనిపిస్తుంది.నర్మదకు అది ఏంటా అని తెలుసుకోవాలనుకుంటుంది.

ఇక్కడ నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది.అమూల్య తాళి చూపించిన విషయము,తన తండ్రి గుండెపోటుతో పడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు.ఒక్క రోజులోనే అటు అమూల్య జీవితం,ఇంటిపరిస్థితులు తలకిందులు అయిపోయాయి అని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ప్రేమ గదిలోకి వస్తుంది. గదిలో ధీరజ్ ఒక మూల కూర్చున్న సంగతి చూసుకోదు. ప్రేమ తన పోలీస్ హాల్ టికెట్ ను ఎక్కడ దాయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అదంతా ధీరజ్ గమనిస్తూ ఉంటాడు. ధీరజ్ వచ్చే ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు ప్రేమను.

24
ప్రేమ పరీక్ష రాయల్సిందే

ధీరజ్ మాట్లాడుతూ ప్రేమతో ‘ఇందాకటి నుంచి ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. ఏంటది?’ అని దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఎస్ఐ ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చిందన్న సంగతి ధీరజ్ తెలుసుకుంటాడు. దీన్ని ఎందుకంత టెన్షన్ పడుతూ దాచిపెట్టడం ఇది సంతోషకరమైన విషయమే కదా అని అంటాడు. ప్రేమ మాట్లాడుతూ ‘ఇప్పుడు అంత అవసరం లేదు. దీన్ని చింపేస్తాను. నేను ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి హాల్ టికెట్ అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలు చాలు. ఇప్పుడు నేను, నా ఉద్యోగం కొత్త సమస్యగా మారకూడదని’ ప్రేమ చెబుతోంది. ఇన్నాళ్లు కష్టపడి చదివి ఇప్పుడు ఎగ్జామ్ రాయనని ఎందుకంటున్నావ్ అని అడుగుతాడు ధీరజ్. 

దానికి ప్రేమ ‘అమూల్య విషయంలో మావయ్య గారి ఎంత బాధ పడుతున్నారో చూసావు కదా. చావు చివరిదాకా వెళ్లొచ్చారు. నేను ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి వీలు లేదని అప్పట్లోనే మామయ్య గారు తేల్చి చెప్పారు. ఇప్పుడు తెలిస్తే ఇంకా బాధపడతారు’ అని వివరిస్తుంది. ధీరజ్ మాత్రం ప్రేమకు నచ్చచెప్పేందుకు చాలా ప్రయత్నిస్తాడు. దీనికోసం లైఫ్ లాంగ్ ఇష్టాల్ని వదిలేస్తావా అని అడుగుతాడు ఎగ్జామ్ రాయాల్సిందేనని, ఎవరికి ఎలాంటి సమస్య, బాధ రాకుండా నేను చూసుకుంటాను.. ఇక ఈ విషయం గురించి నువ్వు టెన్షన్ పడకు. బాగా చదువు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి మొదటి పైన ముద్దు పెడతాడు. దాంతో ప్రేమ చాలా సంతోషిస్తుంది.

ఇక్కడినుంచి సీన్ సాగర్ దగ్గరికి మారుతుంది. ఆఫర్ లెటర్ చేతిలో పట్టుకొని తిరుగుతూ.. వనజ ఇచ్చిన 20 లక్షలు తిరిగి ఇచ్చేయాలని నాన్న చెబుతున్న మాటలు గుర్తొచ్చి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ టెన్షన్ నర్మద చూస్తుంది. సాగర్ ఆఫర్ లెటర్ ను దాస్తాడు. ఆ విషయం చూసి నర్మద అడుగుతుంది. అప్పుడు ఆఫర్ లెటర్ బయటికి తీసి ‘నర్మద.. ఇది నా గవర్నమెంట్ జాబ్ ఆఫర్ లెటర్’ అని చెబుతాడు. దాంతో నర్మద చాలా ఆనందపడుతుంది. నాన్నగారు నేను జాబ్ చేయడానికి ఒప్పుకుంటారో లేదో టెన్షన్ గా ఉందని చెబుతాడు సాగర్. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పకూడదని సాగర్ చెబుతాడు. వనజ 20 లక్షలు ఇచ్చేయమన్నారు... అది కూడా ఇచ్చేయాల్సిందేనని నర్మద అంటుంది.

34
రామరాజు అర్థరాత్రి లేచి

వేదవతి నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో అమూల్యను విశ్వ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని హఠాత్తుగా లేస్తుంది. పక్కన చూస్తే రామరాజు కనిపించడు. రామరాజును వెతుక్కుంటూ బయటికి వస్తుంది. వేదవతి రామరాజు మాత్రం సేనాపతి ఇంటి వైపు చూస్తూ ఉండిపోతాడు. తన కూతురు అక్కడ ఎలా ఉందో అని బెంగపెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది వేదవతి. దానికి రామరాజు ఆ లైట్ వెలుగుతున్న గదిలో ఉన్నది అమూల్య కదా, అది తిన్నదో లేదో అని అంటాడు. దానికి వేదవతి మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు, అది బాగానే ఉంటుంది లెండి, ఇష్టపూర్వకంగానే మహారాణిలా ఆ ఇంటికి వెళ్ళింది.. హాయిగా నిద్రపోయి ఉంటుంది అని అంటుంది వేదవతి. దాంతో రామరాజు ‘అది మన ముద్దుల కూతురే దాన్ని ఎంత కష్టపడి కన్నావో మర్చిపోయావా? దాన్ని చూసి మనం ఎంత మురిసిపోయామో.. అది ఇంకా చిన్నపిల్ల అవ్వడం వల్ల దాన్ని అందరం గారాబం చేసాం’ అని అంటాడు రామరాజు. 

వేదవతి మాత్రం అమూల్యపై కోపాన్ని చూపిస్తుంది. దాని గురించి మాట్లాడకండి అని అసహ్యించుకుంటుంది. ‘ నా మీద పగ తీర్చుకోవడానికి నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయం అమూల్యకు అర్థం కాలేదా? అది ఎలా పెళ్లి చేసుకుంది’ అని బాధపడతాడు రామరాజు. అది నరకంలో ఎలా బతుకుతుందో అని బాధపడతాడు. మరోపక్క అమూల్య గదిలో నిద్రపోకుండా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. వేదవతి ఇక అమూల్య గురించి మీరు ఆలోచిస్తే నాతో మాట్లాడకండి అని గట్టిగా చెబుతుంది.

44
అక్కాచెల్లెళ్లు అమూల్యను చూస్తూ

ఇక్కడినుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద ఉదయం లేచి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. ఈ లోపు ప్రేమ కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి ముగ్గు వేస్తూ ఉంటారు. నర్మద మాట్లాడుతూ సాగర్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న సంగతి చెబుతుంది. దాంతో ప్రేమ ఆనందపడుతుంది. కానీ మామయ్య గారికి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో.. గొడవలు జరుగుతాయి ఏమో అని భయంగా ఉంది.. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని చెబుతుంది నర్మద. ప్రేమ కూడా ఎస్ఐ ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చిన సంగతి చెబుతుంది. ‘నా జాబ్ విషయంలో ఇంట్లో అప్పట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా.. ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే గొడవ జరుగుతుంది ఏమోనని నేను ఎగ్జామ్ రాయనని చెబుతున్నా.. కానీ ధీరజ్ మాత్రం ఒప్పుకోవడం లేదు’ అని వివరిస్తుంది. ఇక అమూల్య గేట్ నుంచి వీరిద్దరిని చూస్తూ ఉంటుంది. వీరు కూడా సంతోషంగా చూస్తారు. దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories