
ఫిబ్రవరి రెండో వారం OTT ప్రేక్షకులకు అసలైన వినోదాల విందు తీసుకువస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు మలయాళీ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.
అనగనగా ఒక రాజు
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2026
నవీన్ పోలిశెట్టి, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కోహ్రా – సీజన్ 2 (Kohrra Season 2)
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2026
పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన క్రిటికల్‌గా ప్రశంసలు అందుకున్న క్రైమ్ నోయిర్ సిరీస్ కోహ్రా రెండో సీజన్ మరింత డార్క్‌గా తిరిగివచ్చింది. అసిస్టెంట్ ఎస్‌ఐ అమర్‌పాల్ గరుండి కొత్త పోలీస్ స్టేషన్‌లో ఓ భయానక హత్య కేసును దర్యాప్తు చేస్తాడు.
మోటార్‌వ్యాలీ (Motorvalley)
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 10, 2026
ఇటలీ GT రేసింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే హై-స్పీడ్ డ్రామా. కుటుంబ వారసత్వం, రిస్క్, అహంకారం మధ్య జరిగే పోరాటమే కథ.
మన శంకర వర ప్రసాద్ గారు
ఎక్కడ చూడాలి: ZEE5
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2026
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీలో వింటేజ్ మెగాస్టార్ ని ప్రెజెంట్ చేశారు. నయనతార హీరోయిన్. విక్టరీ వెంకటేష్ చివర్లో గెస్ట్ రోల్ లో సందడి చేశారు. ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయితే చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
భానుప్రియ భూతర్ హోటల్ (Bhanupriya Bhooter Hotel)
ఎక్కడ చూడాలి: ZEE5
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026
భూతాల అల్లరితో నిండిన బెంగాలీ హారర్ కామెడీ. నవ్వులు, భయాలు, సోషల్ సెటైర్ కలిసి సాగే వినోదం.
పాతిరాత్రి (Paathirathri)
ఎక్కడ చూడాలి: ZEE5
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026
ఒకే రాత్రిలో జరిగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్. పోలీస్ వ్యవస్థలోని నైతిక సంక్షోభాలను ప్రశ్నించే కథ.
బేబీ గర్ల్ (Baby Girl)
ఎక్కడ చూడాలి: Sony LIV
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12, 2026
ఆసుపత్రిలో శిశువు మాయమవ్వడంతో మొదలయ్యే మలయాళ మెడికల్ థ్రిల్లర్. ఉత్కంఠభరిత కథనం.
రెడ్ ఐ – సీజన్ 2 (Red Eye Season 2)
ఎక్కడ చూడాలి: Sony LIV
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 15, 2026
లండన్‌లోని US ఎంబసీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే హై-స్టేక్స్ ఇంటర్నేషనల్ థ్రిల్లర్.
ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites)
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026
ఎడ్ & లొరైన్ వారెన్ కథకు ముగింపు పలికే భయానక హారర్ ఫైనల్.
ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (Predator: Badlands)
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12, 2026
సర్వైవల్, సైన్స్ ఫిక్షన్, భావోద్వేగాల కలయికగా రూపొందిన కొత్త ప్రెడేటర్ అధ్యాయం.
ది బర్బ్స్ (The ’Burbs)
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 9, 2026
సురక్షితంగా కనిపించే కాలనీలో దాగున్న చీకటి రహస్యాల కథ.
మాయాబింబం (Maayabimbum)
ఎక్కడ చూడాలి: Sun NXT
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026
ప్రేమ నుంచి అతివాదానికి దారితీసే భావోద్వేగాలను చూపించే తమిళ డ్రామా.
సూర్య: పవర్ ఆఫ్ లవ్ (Surya: Power of Love)
ఎక్కడ చూడాలి: Sun NXT
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026
కన్నడ యాక్షన్ రొమాన్స్. అనాథ యువకుడి పోరాటం, ప్రేమ, కుటుంబ రహస్యాల కథ.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
ఎక్కడ చూడాలి: ETV Win
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12, 2026
గ్రామీణ నేపథ్యంలో సాగే డార్క్ క్రైమ్ కామెడీ. సంప్రదాయం వెనుక దాగున్న నేరాల కథ.