
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ఇడ్లీ బాబాయి, భాగ్యం కలిసి సంతోషంగా టిఫిన్ తింటూ ఉంటారు. అక్కడికి వల్లి వచ్చీ ఇద్దరినీ తిడుతుంది. ఎక్కడ అమూల్య నా పేరు చెప్పేస్తుందో అని భయపడుతున్నానని అంటుంది. భాగ్యం నచ్చజెప్పాక.. కూర్చుని తల్లితో పాటు టిఫిన్ తింటుంది. వీరిని నర్మద చూస్తుంది. ఆ విషయం బల్లికి తెలిసి టేబుల్ కింద దాక్కుంటుంది. నర్మద.. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ దగ్గరికి వస్తుంది. వల్లి దాక్కోవడం కూడా నర్మదా కనిపెట్టేస్తుంది. మీ పని బాగుంది చక్కగా తింటున్నారు అని అంటుంది నర్మద. దానికి భాగ్యం, ఇడ్లీ బాబాయికి షుగర్ ఉందని చెబుతుంది. అయితే తినండి అని చెప్పి అక్కడే కుర్చీలో కూర్చుంటుంది. బయటికి రాకుండా వల్లి ఎంత సేపు ఉంటుందో చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది నర్మద.
ఈలోపు వల్లికి ఎక్కిళ్ళు రావడం మొదలవుతాయి. గ్లాసులో నీళ్లు వేసి నర్మద టేబుల్ కిందకి ఇస్తుంది. వల్లి వాళ్ళ అమ్మ ఇచ్చిందనుకొని తీసుకొని తాగేస్తుంది. తర్వాత టేబుల్ కింద నుంచి లేచి బయటికి వస్తుంది. కానీ వెనక నర్మద ఉన్న సంగతి చూసుకోకుండా ఏదేదో వాగేస్తుంది. ఈ లోపు నర్మద.. భాగ్యం, ఇడ్లీ బాబాయి, వల్లీలను చూస్తూ అమూల్య పెళ్లికి.. మీకు ఏదైనా సంబంధం ఉందా? మీ టెన్షన్ చూస్తుంటే నాకు ఏదో అనుమానం వస్తుంది అని అంటుంది. దానికి భాగ్యం మాకు ఏ పాపం తెలీదు అని చెబుతుంది. ‘ఒకవేళ అమూల్య పెళ్లి విషయంలో మీ ప్రమేయం ఉందని తెలియాలి. అప్పుడు మీకు మామూలుగా ఉండదు’ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నర్మదకు మన మీద అనుమానం వచ్చేసింది కాబట్టి మనం అమూల్య కాలు లేదా భద్రావతి కాలు పట్టుకొని మన పేరు బయటికి రాకుండా బతిమిలాడుకోవాలి పదండి వెళ్దాం అని బయలుదేరుతారు వల్లీ, భాగ్యం ఇడ్లీ బాబాయ్
ఈ లోపు ప్రేమ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చి నర్మదను పిలుస్తుంది. ‘చందు బావ చాలా కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళాడు, ఏమవుతుందోనని చాలా టెన్షన్ గా ఉందని చెబుతుంది. ప్రేమ, ధీరజ్ కూడా చందుతో వెళ్ళాడని, ధీరజ్ ఇకపై నాతో మాట్లాడడు, నన్ను కూడా వదిలేస్తాడు’ అంటుంది ప్రేమ. ‘అమూల్య అలా చేయడం వల్లే కదా.. మామయ్యకి ఇలా అయింది. ఈ విషయం తెలిస్తే ధీరజ్ ఇంకా నన్ను క్షమించడు అక్కా. చాలా టెన్షన్ గా ఉంది’ అని అంటుంది. దాంతో నర్మద ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు’ అని అంటుంది.
‘నీతో చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది. నేను ఒక పిచ్చి పని చేశాను’ అంటూ అమూల్యకు తాళి మెడలో వేసుకుని రమ్మని తానే సలహా ఇచ్చినట్టు మొత్తం జరిగిందంతా నర్మదకు చెప్పేస్తుంది. దీంతో నర్మద చాలా కోపంగా ‘ఎంత పని చేసావ్. ఎందుకిలా చేశావ్’ అని అడుగుతుంది దానికి ప్రేమ ‘అమూల్య ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను అంటుంది. మరో పక్క మావయ్య గారు పరువు పోతుందేమోనని భయంతో చేశా’ అని మొత్తం వివరిస్తుంది. ‘అప్పుడు ధీరజ్ పెళ్లి, నా పెళ్లి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే జరిగిందని.. అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదని.. అదే అనుకొని ఐడియా ఇచ్చాను’ అని చెబుతుంది. ‘ఇప్పుడు కూడా చిన్న చిన్న గొడవలతో ఆగిపోతాయి అనుకున్నాను. ఇంతవరకు వస్తుందనుకోలేదు’ అని వివరిస్తుంది. నర్మద మాట్లాడుతూ ‘బాధపడకు నువ్వు చెప్పేది వింటుంటే ఇది కూడా కరెక్టే అనిపిస్తోంది’ అని సపోర్ట్ ఇస్తుంది.
నర్మద మాట్లాడుతూ అసలు మనకు తెలియాల్సిన విషయం మన ఎవ్వరికీ తెలియకుండా అమూల్య వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ విషయం కనుక్కున్నావా? అని ప్రేమని అడుగుతుంది. దానికి ప్రేమ అమూల్య కంగారుగా మాట్లాడడంతో నేను ఆ విషయం అడగలేదని చెబుతుంది. అమూల్ విశ్వక్ దగ్గరికి ఎలా వెళ్లిందో కచ్చితంగా తెలుసుకుంటాను అని నర్మద అంటుంది.
ఇక్కడ నుంచి సీన్ చందు దగ్గరికి మారుతుంది. చందు చాలా కోపంగా సేనాపతి ఇంటికి వస్తాడు. అమూల్య బయటకి రా అని గట్టిగట్టిగా అరుస్తాడు. దాంతో విశ్వక్ కిందకు వచ్చి చందుతో గొడవ పడతాడు. సేనాపతి ఇద్దరినీ విడదీస్తాడు. ఈలోపు అమూల్య అక్కడికి వస్తుంది. చందు అమూల్యను లాగి పెట్టి చెంప పై కొడతాడు. ‘నాన్న నీకు ఏం తక్కువ చేశాడే, నువ్వు అందరికంటే చిన్నదానివని మా కన్నా ఎక్కువ ప్రేమ పంచాడే నీకు నాన్న. నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచితే నువ్వు ఆయన గుండె ఆగిపోయినంత పని చేశావు కదా. నిన్ను కన్న పాపానికి నాన్నని హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య పడేసావు కదా’ అంటాడు చందు. దాంతో అమూల్య షాక్ అవుతుంది. నాన్న హాస్పిటల్ లో ఉన్నారా అంటూ ఏడుస్తుంది. అప్పుడు చందు నువ్వు చేసిన ఘనకార్యానికి గుండెపోటు వచ్చింది అని చెబుతాడు.
దాంతో అమూల్య ‘నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? నాన్నకి పర్వాలేదు కదా’ అని ఏడుస్తూ అడుగుతుంది అమూల్య. కానీ చందు ‘నాన్న మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా’ అంటూ అమూల్య మెడ పట్టుకుంటాడు. ధీరజ్ అక్కడికి వస్తాడు. చందుని అమూల్య నుంచి దూరంగా తీసుకెళ్తాడు. ధీరజ్ మాట్లాడుతూ మా నాన్నని చావు బతుకుల మధ్య పడేసిన వాళ్ళు అయిన వాళ్లయినా కూడా సహించను అని చెప్పి చందుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.
అన్నయ్యల వెనకే అమూల్య వెళ్లేందుకు ప్రయత్నిస్తే విశ్వక్ అడ్డుకుంటాడు. అయినా కూడా అమూల్య విడిపించుకుని తన తండ్రిని చూసేందుకు వెళుతుంది. భద్రావతి ‘రామరాజు ప్రాణం ఎప్పుడైనా పోయేట్టు ఉంది. ఈ క్షణంలో మనం ఆనందించాలి. అమూల్యని వెళ్ళనీ’ అని చెబుతుంది. దాంతో పెద్దమ్మ వాళ్ళిద్దరిని తిడుతుంది.
ఇక్కడి నుంచి సీను ఆస్పత్రికి మారుతుంది. ఐసీయూలో రామరాజును చూసి వేదవతి కన్నీరు పెట్టుకుంటుంది. ఈ లోపు అమూల్య కూడా ఆసుపత్రికి చేరుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో వల్లి బండారం బయట పెట్టేస్తుంది అమూల్య. రాత్రికి రాత్రి విశ్వక్ తో మాట్లాడడానికి ఎందుకు వెళ్ళావని నర్మదా గట్టిగా అడుగుతుంది. వల్లి వదిన తీసుకెళ్లిందని అమూల్య చెప్పేస్తుంది. అప్పుడే విశ్వక్ కిడ్నాప్ చేసినట్టు వివరిస్తుంది. నర్మదకు విపరీతంగా కోపం వస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.