Gunde Ninda Gudi Gantalu: రోహిణీకి ఎదురు తిరిగిన సుగుణమ్మ, ఇక బాలు కొడుకుగా చింటూ

Published : Feb 04, 2026, 09:19 AM IST

Gunde Ninda Gudi Gantalu: చింటూని దత్తత తీసుకోవాలని బాలు, మీనా అనుకుంటారు. ఇదే విషయం మాట్లాడటానికి సుగుణమ్మ ఇంటికి వెళతారు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం...

PREV
14
Gunde Ninda Gudi Gantalu

సుగుణమ్మ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. ఆమెను.. హాస్పిటల్ లో పనిచేసే నర్సు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే..బాలు, మీనా వస్తారు. ఏం జరిగిందమ్మా అని అడుగుతారు. ‘ మైల్డ్ స్ట్రోక్ వచ్చింది... అప్పుడప్పుడు లో బీపీ వచ్చి పడిపోతున్నారు.. అందుకే నేను చూసుకుంటున్నాను’ అని ఆ నర్స్ చెబుతుంది. ‘ అయ్యో మాకు తెలీదమ్మా.. మీకు ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పాం కదా, ఎందుకు చెప్పలేదు? అయినా.. ఇలాంటి పరిస్థితిలో కూడా మీ కూతురు రాలేదా?’ అని బాలు, మీనా అడుగుతారు. ‘ ఈ నర్స్ ని నన్ను చూసుకోవడానికి నా కూతురే పెట్టింది..’ అని సుగుణమ్మ చెబుతుంది. తర్వాత చింటూ గురించి బాలు అడుగుతాడు. చింటూతో వీళ్లు మాట్లాడినట్లు తెలిస్తే.. రోహిణీ కోప్పడుతుందని భయపడి..చింటూని చుట్టాల ఇంటికి పంపినట్లు అబద్ధం చెబుతుంది.

ఇక.. సుగుణమ్మ కి ఒంట్లో బాగోకపోయినా కూతురు రాలేదని బాలుకి కోపం వస్తుంది. ‘ ఇలాంటి మనిషి మా ఇంట్లో ఉంటే.. ఎప్పుడో బయటకు గెంటేసేవాడిని..నేను మాట్లాడతాను అని నెంబర్ ఇవ్వమంటే మీరు ఇ్వవరు’ అని బాలు అంటాడు. నా కూతురు రోహిణీ అని తెలిసిన రోజు..మనోజ్ కంటే ముందు బాలునే ఇంట్లో నుంచి గెంటేస్తాడేమో అని సుగుణమ్మ మనసులోనే అనుకుంటుంది. బయటకు మాత్రం... ‘ అందరూ నీలాగా, మీనా లాగా స్వచ్ఛమైన మనసుతో ఉండరు. ఈ రోజుల్లో ఎవరి అవసరాలు వాళ్లు చూసుకుంటున్నారు.. నా కూతురు మారదు. తల్లిని నేను చెబితేనే వినదు. ఇక.. మీరు చెబితే వింటుందా? ప్రతిసారీ.. మీరు దాని నెంబర్ అడుగుతున్నారు.. నాకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. వదిలేయండి బాలు.. కనీసం ఈ మాత్రం అయినా పట్టించుకుంటోంది.. మీరు జోక్యం చేసుకుంటే..అస్సలు పట్టించుకోదు’ అని సుగుణమ్మ అంటుంది.

‘ అదేంటమ్మా అలా అంటారు.. చింటూ గురించే మా బాధ’ అని మీనా అంటే.. ‘ మీకు ఇలా ఉంది.. చింటూని ఎవరు ఇంట్లోనే ఉంచారు వాడి భవిష్యత్తు ఏంటి?’ అని బాలు అడుగుతాడు. ‘ ఏం లేదమ్మా.. ఒకసారి చింటూ కారణంగా నాకు ప్రాణ గండం తప్పింది.. అప్పటి నుంచి మాకు చింటూ అంటే ఇష్టం కలిగింది..మీకు అభ్యంతరం లేకపోతే.. చింటూని మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం’ అని మీనా చెబుతుంది. ‘ చింటూ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి.. తండ్రి లేడు.. తల్లి ఉన్నా లేనట్లే... అదే మేం దత్తత తీసుకుంటే.. అమ్మానాన్న ప్రేమ దక్కుతుంది. వాడి చదువు, భవిష్యత్తు అన్నీ దొరుకుతాయి..చిన్నతనంలో వాడికి దూరమైన అన్నీ దొరుకుతాయి’ అని బాలు చెబుతాడు. ఆ మాటలకు సుగుణమ్మ చాలా సంతోషిస్తుంది. కానీ.. రోహిణీకి చెబితే ఏమౌతుందో అని భయపడుతుంది.కానీ.. చింటూని దత్తత ఇవ్వాలని మనసులోనే అనుకుంటుంది. కానీ బయటకు చెప్పదు.

24
కూతురికి ఎదురు తిరిగిన సుగుణమ్మ..

‘మీకు ఇంత జరిగినా డబ్బులు పంపించి చేతులు దులుపుకుంది మీ కూతురు. అందుకే.. చింటూని మేం చూసుకుంటాం.. మిమ్మల్ని మా బామ్మ దగ్గర ఉంచుతాం..’ అని బాలు చెబుతాడు.‘ ఒకసారి ఆలోచించండి అమ్మా.. ఈయన చిన్నప్పటి నుంచి తల్ల ప్రేమని నోచుకోలేదు.. ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పరిస్థితి చింటూ కి రావద్దని కోరుకుంటున్నాం. అలాగే.. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చింటూని చూసుకోవచ్చు’ అని మీనా అంటుంది. ‘ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.. దేవుడు పంపించినట్లు మీరిద్దరూ వచ్చారు. నా తర్వాత.. చింటూ పరిస్థితి ఏంటా అని భయపడేదాన్ని.. దానికి పరిష్కారం మీ రూపంలో కనపడుతోంది. కానీ, నేను కన్న కూతురు మీదే నాకు అధికారం లేదు.. అలాంటిది దాని కొడుకుని దత్తత ఇచ్చే హక్కు నాకు ఉంటుందా? ఒకసారి మాట్లాడి చూస్తాను’ అని చెబుతుంది. సరే అని చెప్పి.. చింటూ కోసం తెచ్చిన స్వీట్లు ఇచ్చి.. బాలు, మీనా వెనక్కి వెళ్లిపోతారు.

రోహిణీకి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. ‘ బాలు, మీనా వచ్చారమ్మా.. కానీ.. చింటూని పక్కింటికి పంపించేశాను.. నువ్వు చెప్పినట్లే.. వాళ్లకు నేను ఏమీ చెప్పలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ.. ఒక మాట అన్నారు. చింటూకి అమ్మ లేదు కదా.. మేం దత్తత తీసుకుంటాం అన్నారు’ అని సుగుణమ్మ చెబుతుంది. ‘ అడుగుతారని తెలుసు. వాళ్లు అందుకే అక్కడికి వచ్చారు అని నాకు తెలుసు. నువ్వు అయితే వాళ్లను తిట్టి పంపేశావు కదా’ అని రోహిణీ అంటే.. ‘ నేను ఎందుకు తిడతాను అమ్మా.. వాళ్లు మంచి ఉద్దేశంతోనే అడిగారు కదా’ అని సుగుణమ్మ అంటుంది. ‘ వాళ్ల ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ.. నా కొడుకుని దత్తత తీసుకుంటాను అంటే నేను ఒప్పుకోను అని నీకు తెలుసు కదా’ అని రోహిణీ అంటుంది. ‘ కానీ.. వాళ్లు చింటూ పై చాలా ప్రేమ చూపిస్తున్నారు.. వాళ్లతో ఉంటే చింటూ భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తోంది’ అని సుగుణమ్మ అంటే.. రోహిణీ సీరియస్ అవుతుంది. ‘ చూస్తుంటే నువ్వే వెళ్లి.. చింటూని వాళ్లకు ఇచ్చేసేలా ఉన్నావ్ ’ అని తిడుతుంది. ‘నిజంగానే అదే చేస్తాను’ అని సుగుణమ్మ బదులిస్తుంది. ‘ వాడు నా కొడుకు.. నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావ్?’ అని రోహిణీ కోపంగా అడిగితే..‘ వాడిని నేను పెంచాను.. నాకు కాకపోతే. వాడి మీద ఇంకెవరికి హక్కు ఉంటుంది? ఇంకా చెప్పాలంటే.. నీ కొడుకు అని నేను చెప్పేదాకా ఎవరికీ తెలీదు’ అని సుగుణమ్మ షాకిస్తుంది. రోహిణీ కోపంతో ఊగిపోతుంది. నా కొడుకు నీకు భారం అయిపోయాడు.. అందుకే వదిలించుకోవాలని అనుకుంటున్నావ్ అని రోహిణీ సీరియస్ అవుతుంది. కానీ.. సుగుణమ్మ నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. ‘ నువ్వు మాటలు చెబుతావు.. కానీ ఏదీ చేయవు.. బాలు వాళ్లు చింటూని దత్తత తీసుకుంటే.. నీ కళ్ల ముందే పెరుగుతాడు.. అలా అయినా సంతోషించు’ అని సుగుణమ్మ అంటుంది. రోహిణీ మాత్రం వినదు.. అందరి ముందు వాడు నన్ను అమ్మ అని పిలిస్తే.. నా పరిస్థితి ఏంటి? వాళ్లకు చింటూని ఇవ్వను అని చెప్పు అని గట్టిగా చెబుతుంది.

34
చింటూ దత్తత ఆపడానికి రోహిణీ ప్రయత్నం..

ప్రభావతి గదిలో కూర్చొని ఉంటే.. రోహిణీ వస్తుంది. ‘ ఏంటి సంగతి..?’ అని అడుగుతుంది. ‘ చింటూని బాలు, మీనా దత్తత తెచ్చుకుంటారంట’ అని రోహిణీ తన అత్తతో చెబుతుంది. ‘ వద్దు అని ముందే చెప్పాం కదా.. మళ్లీ ఏంటి?’ అని ప్రభావతి అంటుంది. ‘ అదే నాకూ అర్థం కావడం లేదు.. ఆల్రెడీ బాబు వాళ్ల అమ్మమ్మతో మాట్లాడారంట’ అని ప్రభావతికి ఎక్కిస్తుంది. ‘ ఎవరిని పడితే వాళ్లను తీసుకురావడానికి ఇదేమైన సత్రమా?’ అని ప్రభావతి అంటుంది. ఆ మాటకు రోహిణీ కోపంగా అరుస్తుంది. ఎందుకు అలా అరిచావ్? అని ప్రభావతి అంటే.. పిల్లాడు ఏం చేశాడు అత్తయ్య అని కవర్ చేస్తుంది. ‘ వాడిని వాళ్ల అమ్మ వదిలేయడం వల్లే కదా .. ఎలా వదిలేసిందో ఏమో’ అని ప్రభావతి అంటుంది. ‘వాళ్ల అమ్మ ఎందుకు వదిలేసిందో మనకు తెలీదు కదా అత్తయ్య.. మనం మాత్రం దత్తత తీసుకోవద్దని గట్టిగా చెప్పాలి’ అని రోహిణీ ప్రభావతికి ఎక్కించాలని చూస్తుంది. కానీ.. ప్రభావతి పెద్దగా పట్టించుకోదు . లైట్ తీసుకుంటుంది. తెస్తే తేనీ అని అంటుంది.‘ వాడిని తీసుకువచ్చాక.. వాడిని అడ్డం పెట్టుకొని.. ఈ ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాను.. రోడ్డున పడతారు’ అని ప్రభావతి అంటుంది. ‘ వామ్మో.. అదే జరిగితే చింటూ కూడా రోడ్డున పడతాడు’ అని రోహిణీ బయపడుతుంది.ప్రభావతిని నమ్ముకుంటే.. కష్టం అని.. వేరే మార్గం ఆలోచించాలి అని అనుకుంటుంది.

44
కొడుకు విషయంలో నిర్ణయం తీసుకున్న రోహిణీ..

రోహిణీ తన ఫ్రెండ్ విద్యతో కలిసి.. ఓ స్కూల్ కి వెళ్తుంది.ఇయర్ మధ్యలో స్కూల్ మార్చడం ఎందుకు అని విద్య అడిగితే.. బాలు, మీనా దత్తత గురించి, ప్రభావతి ప్లాన్ గురించి మొత్తం చెబుతుంది. చింటూనీ, అమ్మని సీటికీ తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను అని రోహిణీ చెబుతుంది. అయితే.. ఆలోచించి నిర్ణయం తీసుకోమని విద్య చెబుతుంది. అయితే.. చింటూని నువ్వే దత్తత తీసుకోవచ్చు కదా అని విద్య ఐడియా ఇస్తుంది. మనోజ్,ప్రభావతి ఒప్పుకోరు అని రోహిణీ అంటుంది. ఇక.. స్కూల్ కి వెళ్లి.. వివరాలు మొత్తం రోహిణీ కనుక్కుంటుంది. ఎంత ఖర్చు అయినా ఈ స్కూల్లోనే చేర్చాలని రోహిణీ ఫిక్స్ అవుతుంది. ఇదే విషయం చెప్పడానికి వాళ్ల అమ్మకి ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని.. ఇక్కడికి తీసుకువస్తాను.. స్కూల్ కూడా చూశాను అని చెబుతుంది. ఆ మాటలకు సుగుణమ్మ సంతోషిస్తుంది.

బాలు, మీనా బయటకు వెళ్లి.. ఇంటికి వస్తారు. దత్తత విషయంలో చింటూ వాళ్ల అమ్మమ్మ ఎందుకు అంతలా ఆలోచిస్తుందని బాలు అడుగుతాడు.తల్లి లాగా పెంచింది కదా.. అందుకే అంతలా ఆలోచిస్తుందని..ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుందని.. మీనా పాజిటివ్ గా మాట్లాడుతుంది. అయితే.. ఎవరైనా.. తన కడుపులో బిడ్డ పుట్టాలని కలలు కంటుంది కానీ.. నువ్వు దత్తత ఒప్పుకోవడం గ్రేట్ అని బాలు.. మీనాని మెచ్చుకుంటాడు. ఇక.. తర్వాత.. అత్తయ్య కి లంచ్ బాక్స్ తీసుకువెళ్లాలని.. తనని డ్రాప్ చేయమని మీనా అడుగుతుంది. బాలు సరే అంటాడు.ఇక.. తర్వాత.. మీనా చేసిన వంట చాలా రుచిగా ఉందని.. శ్రుతి లొట్టలేసుకుంటూ తింటుంది. అయితే.. కోడళ్లు ఇద్దరూ.. ప్రభావతిని బురిడీ కొట్టించారని.. సత్యం హ్యాపీగా ఫీలౌతాడు.

కమింగప్ లో.. రోహిణీ గతం గురించి మాకు మొత్తం తెలుసు అంటూ.. ఎవరో మనోజ్ కి లెటర్ ఇస్తారు. అది తెలుసుకొని రోహిణీ మరింత భయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories