Illu Illalu Pillalu Today Episode Dec 27: పెళ్లికి ముందే లేచిపోయావంటూ ప్రేమను నానా తిట్లు తిట్టిన వేదవతి

Published : Dec 27, 2025, 08:51 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 27: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో రామరాజు చాలా ఆవేదనగా మాట్లాడుతాడు. ప్రేమ అందరికీ సారీ చెబుతుంది. ఇక వేదవతి ప్రేమను పెళ్లికి ముందే లేచిపోయావ్ అంటూ తిడుతుంది. ఇయ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడండి. 

PREV
14
ఒంటరిగా మారిన ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు చాలా బాధగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. అతని చుట్టూ అందరూ నిల్చుని మౌనంగా ఉంటారు. ఈ లోపు ప్రేమ అక్కడికి వచ్చి ముందుగా పెద్దోడికి సారీ చెబుతుంది. కానీ పెద్దోడు అవసరం లేదని కోపంగా అంటాడు. ఆ తర్వాత సాగర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. సాగర్ కూడా ఆమె చెప్పింది వినడానికి ఇష్టపడడు. ఇక రామరాజు దగ్గరికి వెళ్లి తాను అలా మాట్లాడడం తప్పేనని చెబుతుంది ప్రేమ. దానికి రామరాజు ‘నువ్వెందుకు క్షమాపణ చెబుతున్నావు. నువ్వేం తప్పు చేయలేదు. తప్పంతా నేనే చేశాను. నువ్వు, మీ నాన్న వాళ్ళు అన్నది నిజమే... ఆడపిల్లను సరిగా పెంచడం చేతకాని తండ్రిని నేను. కూతురికి గుణగణాలు నేర్పించలేని ఒక అసమర్థ తండ్రిని నేను. ఈ విషయం నువ్వు మీ వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు’ అని చాలా బాధపడతాడు. ప్రేమ తను చెప్పేది వినమని ఎంత బతిమిలాడినా వినిపించుకోడు. మరోపక్క వేదవతికి చాలా కోపం వస్తుంది. ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.

24
ప్రేమకు గట్టిగా ఇచ్చేసిన వేదవతి

ప్రేమ వేదవతి దగ్గరకి వచ్చి ‘అత్తా’ అని పిలుస్తుంది. దాంతో వేదవతి ఒక్కసారిగా ‘ఎవరికే నీకు అత్తా? నన్ను అలా పిలవకు.. నీ నోటి నుంచి నన్ను అలా పిలవకు. అలా పిలిచే ప్రేమను, అర్హతను నువ్వు కోల్పోయావు. ఇది కోపం కాదు.. నా బాధ. భరించలేని గుండె కోత. ఇందాక నువ్వు చేసింది చిన్న విషయం అనుకుంటున్నావా? కేవలం మీ అన్నయ్యని వెనకేసుకుని రావడం అనుకుంటున్నావా? మా కుటుంబాన్ని రోడ్డున నిలబెట్టావు. నువ్వు మా పెంపకాన్ని వేలెత్తి చూపేలా చేసావు. నువ్వు ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్ల తండ్రి పెంపకాన్ని, ఆడపిల్ల మీద తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు చంపేశావు. మా కూతురు ఏంటో మాకు తెలుసు. మా కూతురును ఎలా పెంచామో, ఎంత పద్ధతిగా పెంచామో నాకు తెలుసు. వాడే నా కూతురికి ఏదో మందు పెట్టాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. లేకపోతే నా కూతురు నాకు చెప్పకుండా గుమ్మం కూడా దాటదు. దానంతట అదే ప్రేమిస్తుందా? దాన్ని కావాలనే ప్రేమ అనే ఉచ్చు లోకి లాగాడు. అంతే తప్ప నాకు తెలియదా నా కూతురి గురించి’ అని వేదవతి గట్టిగా అరుస్తుంది.

34
నువ్వు లేచిపోయావ్

‘కూతురుని పెంచడం చేతకానిది మాకు కాదు. మీకు, మీ నాన్నకు. కూతురుని పెంచడం చేతకానిది నాకు కాదు, మీ వాళ్లకు. నిన్ను పెంచడం చేత కాక పోవడం వల్లే నువ్వు ఇలా లేచిపోయి’ అని ఆపేస్తుంది. దీంతో ప్రేమ చాలా బాధపడుతుంది. ధీరజ్ తో పాటు అందరూ షాక్ అవుతారు. ప్రేమ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఈ గొడవ అంతా చూసి వల్లి చాలా ఆనందపడుతుంది. ఇదంతా చూసి అమూల్య ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వల్లి దొంగలాగా దుప్పటి కప్పుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఆమె కోసం భాగ్యం, ఇడ్లీ బాబాయ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో జరిగిన గొడవలన్నీ తల్లిదండ్రులకు చెప్పి ఆనందంతో పొంగిపోతుంది వల్లి. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూడా ఆనందపడతారు. భాగ్యం ఇచ్చిన ఐడియా వల్ల ఇన్ని గొడవలు జరిగాయని వల్లి తల్లిని చాలా మెచ్చుకుంటుంది. భాగ్యం మాట్లాడుతూ నర్మద, ప్రేమలతో ఆడుకోవడానికి, నువ్వు ఇంట్లో పెద్ద కోడలుగా చక్రం తిప్పడానికి ఇదే సమయం ఇక రెచ్చిపో అని అంటుంది.

44
ప్రేమను తిట్టిన ధీరజ్

ఇక్కడ నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ధీరజ్ గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. ప్రేమ కూడా పక్కన కూర్చుని ఏడుస్తుంది. ‘అత్త అలా ఎలా నన్ను అంటుంది. చాలా బాధగా ఉంది. అత్త అలా మాట్లాడుతుందని కలలో కూడా అనుకోలేదు. నన్ను అమ్మలా అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ నేను లేచిపోయానని అనడం తట్టుకోలేకపోతున్నాను.ఆరోజు మేనకోడలి ప్రాణం గురించి, భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించిన అత్త ఈరోజు ఇలా ఎలా మాట్లాడింది. ప్రాణం పోతున్నంత బాధగా ఉంది’ అని తన బాధను చెప్పుకుంటుంది. వెంటనే కోపంగా రియాక్ట్ అవుతాడు ధీరజ్. తన భుజంపై వాలిన ప్రేమను తోసేసి చెయ్యి వదులు అని చెబుతాడు. ‘కనీసం నువ్వయినా నా బాధను అర్థం చేసుకొని.. కాస్త భరోసా ఇస్తావ్ అనుకుంటే నువ్వు కూడా ఇలాగే కోపంగా ఉన్నావు’ అని అంటుంది ప్రేమ. 

దానికి ధీరజ్ ‘ఆపు. నటించింది చాలు ఆపు. అక్కడ అలా మాట్లాడావు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావు? నీకు సిగ్గు అనిపించడం లేదా? ఇందాక రోడ్డుమీద మేము ఎవరిమో నీకు తెలియనట్టు, నీకు మాకు ఏ సంబంధం లేనట్టు మీ వాళ్లకు సపోర్ట్ చేసి మాట్లాడావ్. మీ అన్నయ్యను మంచోడు, మహానుభావుడు అని పొగిడావ్. కేవలం మా చెల్లిది మాత్రమే తప్పని చెప్పావు. మీ వాళ్ళు మా నాన్న పెంపకాన్ని వేలెత్తి చూపించేలా చేసావ్. ఇందాక మీ నాన్న ఏమన్నాడు.. మా నాన్నకి ఆడపిల్లని పెంచడం తెలియదంటాడా? ఆ మాటకి మా అమ్మానాన్న గుండె పగిలిపోయేలా ఏడ్చారు. నువ్వు ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉండి చూస్తున్నావు కదా. మా చెల్లెల్ని మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా పెంచారో నీకు తెలియదా? మరి మా చెల్లెలు గురించి తెలిసి కూడా తన తప్పు చేసిందని ఎలా మాట్లాడగలిగావు. నీ జీవితాన్ని కాపాడిన మా అమ్మకు మంచి గుణపాఠం నేర్పించావు. నీ కూతురు పెళ్ళికి ముందే ఎవరితోనో లేచిపోయిందని నేను మీ నాన్నతో అని ఉంటే ఎలా ఉండేది’ అని అంటాడు ధీరజ్. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories