హిరోయిన్ల బట్టల విషయంలో శివాజీ రాజేసిన మంటలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ విషయంలో బిగ్ బాస్ సెన్సేషన్ దివ్వెల మాధురి కూడా చేరింది. అనూహ్యంగా ఆమె శివాజీకి సపోర్ట్ చేస్తూ.. అనసూయకు ఇచ్చిపడేసింది. ఇంతకీ మాధురి ఏమంటుందంటే?
హీరోయిన్లు బట్టలపై టాలీవుడ్ నటుడు శివాజీ రీసెంట్ గా చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ పై మాట్లాడుతూ.. శివాజీ వాడిన రెండు పదాలు పెద్ద దుమారమే రేపాయి. ఆడవారు నిండుగా బట్టలు వేసుకుంటేనే గౌరవం ఉంటుందని, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల వారు తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. సినిమా అనేది ఒక ప్రొఫెషన్ కాబట్టి అక్కడ వేరేలా ఉండొచ్చని చెప్పిన ఆయన, కనీసం పబ్లిక్ ఫంక్షన్లు లేదా బయటకు వచ్చినప్పుడు అయినా మర్యాదగా బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆయన వాడిన రెండు పదాలు సంచలనంగామారాయి. అయితే తాను మాట్లాడిన విషయంలో తప్పులేదని... వాడిన పదాలు తప్పు కాబట్టి సారి చెపుతున్నా అని శివాజీ అన్నారు.
25
రచ్చ చేస్తోన్న అనసూయ, చిన్మయి..
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ, గాయని చిన్మయి శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వారు కూడా కాస్త ఘాటు పదాలే వాడుతూ.. ఇది తమ శరీరం అని, తాము ఎలా దుస్తులు ధరించాలన్నది మహిళల స్వేచ్ఛ, ఎలాంటి బట్టలు వేసుకోవాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని వారు స్పష్టం చేశారు. అవసరమైతే పురుషులే తమ ఆలోచనలను మార్చుకోవాలని.. మీ క్యారెక్టర మంచిదైతే.. మా బట్టలపై పడి ఏడవాల్సిన పని లేదంటూ.. సోషల్ మీడియాలో వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు కూడా స్పందించారు. కానీ సామాన్యుల నుంచి మాత్రం శివాజీకి ఎక్కువగా సపోర్ట్ లభిస్తోంది.
35
శివాజీకి సపోర్ట్ గా అనసూయపై ట్రోలింగ్..
ఈ వివాదంలో సినీ ఇండస్ట్రీ నుంచి శివాజీపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, సామాన్య ప్రజల నుంచి శివాజీకి భారీగా సపోర్ట్ లభిస్తోంది. ఆయన చెప్పిన మాటల్లో తప్పేమీ లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అంతే కాదు ఇండస్ట్రీ నుంచి కరాటే కళ్యాణి లాంటి వారు కూడా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో అనసూయ శివాజీపై మాట్లాడిన కొన్ని మాటలకు .. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో అనసూయ కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తోంది.
ఇదే సమయంలో తాజాగా ఈ అంశంపై దివ్వెల మాధురి కూడా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, శివాజీ వాడిన పదాలు తప్పని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశం మాత్రం సరైనదేనని అన్నారు. . ఆ విషయంపై శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, కాబట్టి అక్కడితో ఆ అంశాన్ని ముగించాలని అన్నారు. అయితే అనసూయ అనవసరంగా అతి చేస్తోందని. అసలు ఇంత రచ్చ చేయాల్సి అవసరం లేదంటోంది దివ్వెల మాధురి. స్త్రీకి చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని, కానీ నేటి తరం హీరోయిన్లు మితిమీరిన స్కిన్ షో చేస్తున్నారని ఆమె అన్నారు. ఎవరి ఇష్టం వాళ్లదే అనుకుంటే అలా చేయమని చెప్పవచ్చని, అయితే ఈ విషయంలో అనసూయ ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు.
55
అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ నాకు నచ్చదు..
అనసూయ చాలా ఎక్కువ మాట్లాడుతోంది అని అన్నారు దివ్వెల మాధురి. ''ఆమె వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. మళ్లీ అటువంటి ఆవిడ సనాతన దర్మం గురించి మాట్లాడుతుంటే.. మరీ కామెడీగా ఉంది.. ఈ విషయంలో అనసూయను సపోర్ట్ చేసేవారు ట్రోల్ చేసినా.. నేను అస్సలు లెక్క చేయను. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ట్రోలింగ్ నే నేను ఫేస్ చేశాను. ఇది పెద్ద విషయం కాదు. ఇప్పటికైనా ఆమె ఆపితేనే మంచిది అని మాధురి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.