ఇక్కడ నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద.. విశ్వ, అమూల్య బండి మీద వెళుతూ ఉంటే వారిని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. అమూల్యను విశ్వా గుడికి తీసుకొస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అమూల్య అడుగుతుంది. ‘మన ప్రేమ విషయం మీ అన్నయ్యలకు తెలిసిపోయింది. ఈ విషయ మీ నాన్నకు తెలిస్తే మీ వాళ్ళు మనల్ని విడదీస్తారు. అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి’ అని చెబుతాడు విశ్వక్. నర్మద కూడా ఈ లోపు అదే గుడికి చేరుకుంటుంది. అమూల్య ‘మా నాన్నకు చెప్పకుండా మా వాళ్ళ అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకోను’ అని చెబుతుంది. అమూల్యను పెళ్లి కోసం చాలా బతిమిలాడతాడు విశ్వ. కానీ అమూల్య ఒప్పుకోదు. ఇదంతా నర్మద చూస్తుంది. వెంటనే గట్టిగా అరుస్తుంది. దాంతో విశ్వక్, అమూల్య ఇద్దరూ షాక్ అవుతారు. నర్మదా కోపంతో విశ్వ చెంప పగలగొడుతుంది. ఈలోపు ప్రేమ అక్కడికి వస్తుంది. మా అన్నయ్యని కొడితే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో నర్మద చాలా షాక్ అవుతుంది.
ఈ లోపు అక్కడికి ధీరజ్, సాగర్ కూడా వస్తారు. నర్మద మాట్లాడు ‘మీ అన్నయ్య అమూల్యని ట్రాప్ చేశాడు, అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా’ అని అంటుంది నర్మద. అయినా సరే ప్రేమ వినదు. అక్కడికి సాగర్, ధీరజ్ కూడా రావడంతో విశ్వ భయపడతాడు. పెద్దోడు కూడా వచ్చి సాగర్, ధీరజ్ విశ్వపై చేయి చేసుకోకుండా అడ్డుకుంటాడు. విశ్వక్ ను చంపేస్తామని సాగర్, ధీరజ్ బెదిరిస్తారు. పెద్దోడు మాట్లాడుతూ నాకు వారిద్దరి ప్రేమ విషయం ముందే తెలుసని చెబుతాడు. ముగ్గురు అన్నదమ్ములు కాసేపు తోపులాట చేసుకుంటారు. ఇదంతా చూసి విశ్వ చాలా ఆనందిస్తాడు.