టాలీవుడ్ నటుడు శివాజీ రాజేసిన మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అనసూయ ఈ విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తోంది. తాజాగా మరోసారి ఆమె శివాజీపై మండిపడింది. ఇంతకీ ఆమెఏమంటోందంటే?
హీరోయిన్లు వేసుకునే బట్టలు నిండుగా ఉండాలి అని రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా.. అందులో కొందరు శివాజీని విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈక్రమంలో స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రస్ అనసూయ శివాజీపై చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శివాజీపై అనసూయ మండిపడ్డారు. ఆతరువాత అనసూయ స్పందనపై శివాజీ మరోసారి స్పందించారు. వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అనసూయ రుణం తీర్చుకుంటానంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
25
ఘాటుగా స్పందించిన అనసూయ..
శివాజీ కామెంట్స్ తో మరోసారి అనసూయ స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. అనసూయ మాట్లాడుతూ.. నా శ్రేయోభిలాషులు కొందరు వీడియోలు షేర్ చేశారు.. వాటిని చూసిన తర్వాత కొన్ని విషయాలు గుర్తొచ్చాయి.. “అతి వినయం దూర్త లక్షణం” అనే మాటను నేను జీవితంలో నేర్చుకున్నాను నా ఇంట్లో పెద్దలు నాకు అదే నేర్పించారు. కొంతమంది అమ్మ, తల్లి అంటూ మాట్లాడేవారు చాలా డేంజర్.. రీసెంట్ గా కొన్ని వీడియోలు చూసినప్పుడు అదే అనిపించిందని'' అనసూయ అన్నారు.
35
విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు..
అనసూయ మాట్టాడుతూ.. నేను రీసెంట్ గా ఒక స్టోర్ లాంచ్‌కు వెళ్లినప్పుడు అక్కడ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మాత్రమే స్పందించాను.. శివాజీకి ఆయన అభిప్రాయం ఉందని, నాకు నా అభిప్రాయం ఉందని, అందుకే నేను మాట్లాడాను.. ప్రెస్ మీట్‌లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు.. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి.. అయినప్పటికీ కొందరు ఫేక్ ఫెమినిస్టులు అంటూ మాట్లాడుతున్నారు. ఫెమినిజం అంటే అందరూ సమానంగా ఉండాలనేదే అందులో ఫేక్ ఫెమినిజం ఉండదు.. అబ్బాయిలు కూడా ఫెమినిస్టులుగా ఉండొచ్చు. అని అనసూయ స్పంష్టం చేశారు.
ఈ సందర్బంగా మరికొన్ని ఘాటు కామెంట్లు చేసిన అనసూయ.. '' ఆడవారి బట్టల గురించి మాట్లాడడం చేతగానితనానికి నిదర్శనం.. తమపై తమకు నియంత్రణ లేనప్పుడు ఇతరులపై ఆ నియంత్రణను రుద్దే ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా హీరోయిన్‌నే, ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన అనుభవం ఉంది..“మీకు నేను బట్టలు ఎలా వేసుకోవాలో చెబుతున్నానా? మీరు మాత్రం మాకు ఎలా వేసుకోవాలో చెబుతున్నారు. మేము చిన్న పిల్లలం కాదు. చాలా వినమ్రతతో నా అభిప్రాయం చెపుతున్నా.. నేను కూడా ఒక మహిళేనని, గ్లామరస్‌గా ఉండాలనుకునే హక్కు నాకూ ఉంటుంది'' అని అనసూయ అన్నారు.
55
మీ నిజస్వరూపం అదే..
అనసూయ మాట్లాడుతూ... కామెంట్లు చేసి సారీ చెప్పడం సరిపోదని, ఆ టోన్ లోనే మీ నిజస్వరూపం బయటకు కనిపిస్తోంది. నిజంగా ధైర్యం ఉంటే మగవాళ్ల ప్రవర్తనపై ప్రశ్నించాలి.. అంతే కానీ అది చేత కాక.. హీరోయిన్లపై ఎందుకు పడతారు. ఆడవాళ్లు అలా బట్టలు వేసుకోవద్దని ఎక్కడైనా రాసి ఉందా..? బట్టలు కాదు, క్యారెక్టరే ముఖ్యం.. అది ఉంటే సమస్యలు రావు అని అనసూయ స్పష్టం చేశారు.