ఇళయరాజా కేవలం గంటన్నర సమయంలో ఏకంగా ఏడు పాటలకు ట్యూన్స్ కట్టి సంగీత ప్రపంచంలో ఒక కొత్త రికార్డు సృష్టించారు. మూడు దశాబ్దాలు దాటినా ఈ పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి.
1993లో విడుదలైన 'అరణ్మనై కిళి' సినిమా నటుడు, దర్శకుడు రాజ్‌కిరణ్ కెరీర్‌లో చాలా ముఖ్యమైనది. కుటుంబ బంధాలు, ప్రేమ, పల్లెటూరి వాతావరణం చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంగీతమే పెద్ద బలం. ఇళయరాజా స్వరపరిచిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్.
ఈ పాటలు పుట్టిన విధానం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా కథ, పాటల సందర్భాలు విన్న వెంటనే ఇళయరాజా కేవలం గంటన్నరలోనే ఏడు పాటలకు ట్యూన్స్ కట్టేశారట.
26
90 నిమిషాల్లో 7 పాటలకు ట్యూన్స్
'అరణ్మనై కిళి' కోసం ఇళయరాజా కేవలం 90 నిమిషాల్లో 7 పాటలకు ట్యూన్స్ కట్టారని చిత్ర యూనిట్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. సాధారణంగా ఒక సినిమా పాటలకు ట్యూన్స్ కట్టడానికి చాలా రోజులు లేదా వారాలు పడుతుంది. కానీ ఇళయరాజా తన టాలెంట్ తో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
రాజ్‌కిరణ్ కథలోని సందర్భాలను వివరిస్తుండగానే, ఇళయరాజా వెంటనే ప్రతి సీన్‌కు తగిన ట్యూన్స్‌ను తన హార్మోనియంపై వాయించడం మొదలుపెట్టారట. ఆ వేగం చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారని చెబుతారు.
36
ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్..
సినిమా కథ మొత్తం విన్న తర్వాత, ప్రతి పాట ఏ ఎమోషన్‌ను పలికించాలో ఇళయరాజా కొన్ని నిమిషాల్లోనే అర్థం చేసుకున్నారు. ప్రేమ, విరహం, కుటుంబ బంధం, పల్లెటూరి నేపథ్యం లాంటి విభిన్న ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ రెడీ చేశారు. ఆయన హార్మోనియం నుంచి వచ్చిన మొదటి స్వరాలే, ఆ తర్వాత తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన పాటలుగా మారాయి. ఆ ట్యూన్స్‌కు తగ్గట్టుగా పాటల రచయితలు కూడా వేగంగా సాహిత్యాన్ని అందించారు.
ఈ సినిమాలోని పాటలు ఒక్కొక్కటి ఒక ఆణిముత్యం. 'అడి పూంగుయిలే' పాటను మనో, మిన్మిని పాడారు. వాలి రాసిన ఈ పాట పల్లెటూరి ప్రేమను అందంగా చూపిస్తుంది. 'రాసావే ఉన్నై విడ' పాటను ఎస్. జానకి తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రేమ విరహ వేదనను తెలిపే ఈ పాట తమిళంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సాడ్ సాంగ్స్‌గా నిలిచింది.
'వాన్మదియే వాన్మదియే' కూడా జానకి పాడిన మరో మెలోడీ. 'ఎన్ తాయెనుమ్ కోయిలై' పాటను ఇళయరాజా స్వయంగా పాడారు. పొన్నడియాన్ రాసిన ఈ పాట తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. 'అమ్మన్ కోవిల్ ఎల్లామే' పాటను స్వర్ణలత, మిన్మిని పాడారు. ముత్తులింగం రాసిన ఈ పాట పండగ వాతావరణాన్ని గుర్తుచేస్తుంది.
ఇక 'నాటు వ రోజా' పాటను పి. సుశీల పాడారు. పిరైసూడన్ రాసిన ఈ పాట అప్పట్లో పెద్ద హిట్. 'రాత్రియిల్ పాడుమ్ పాటను అరుణ్‌మొళి, మలేషియా వాసుదేవన్, మిన్మిని కలిసి పాడారు. వాలి రాసిన ఈ పాట ఆడియన్స్ ను అలరించింది.
56
ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్
'అరణ్మనై కిళి' సినిమా పాటలు సంగీతం, సాహిత్యం, గానం అద్భుతంగా కుదిరిన ఆల్బమ్. వాలి, ముత్తులింగం, పొన్నడియాన్, పిరైసూడన్ వంటి గొప్ప రచయితల సాహిత్యం, ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్‌తో కలిసి ఈ ఆల్బమ్‌ను టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చాయి. కేవలం గంటన్నరలో పుట్టిన ఈ ఏడు ట్యూన్స్, మూడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే 'అరణ్మనై కిళి' పాటలు కేవలం సినిమా పాటలు కాదు, సినిమా సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.
66
30 ఏళ్లకు పైగా ప్రేక్షకుల మనసుల్లో..
ఆ పాటల గొప్పతనం ఏమిటంటే, అవి కేవలం సినిమా పాటలుగా మిగిలిపోకుండా ప్రజల జీవితంలో భాగమైపోయాయి. వాలి, ముత్తులింగం, పొన్నడియాన్, పిరైసూడన్ వంటి కవుల సాహిత్యం, ఇళయరాజా అద్భుతమైన సంగీతంతో కలిసి ఈ ఆల్బమ్‌ను ఒక సంగీత నిధిగా మార్చాయి. ఇప్పటికీ ఈ పాటలు అక్కడ సంగీత కచేరీలలో వినిపిస్తూనే ఉంటాయి. కేవలం 90 నిమిషాల్లో పుట్టి, 30 ఏళ్లకు పైగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఇలాంటి ఆల్బమ్స్ చాలా అరుదు.