Dhanush Vs CM Vijay: ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? విజయ్ కి పోటీ ఇస్తాడా? తండ్రి కస్తూరి రాజా క్లారిటీ!

Published : Jun 02, 2026, 09:50 AM IST

తమిళ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతోందా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సీఎం అవ్వగా.. ఆయనకు పోటీగా మరో స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారా?  ఈ విషయంపై ఆయన తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు  సంచలనం రేపుతున్నాయి.

PREV
15
రెండు వార్తలు వైరల్..
తమిళ స్టార్, పాన్-ఇండియా నటుడు ధనుష్ గురించి కోలీవుడ్‌లో రెండు ముఖ్యమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి ఆయన 55వ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ కాగా, మరొకటి ఆయన రాజకీయ ప్రవేశంపై తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు.
25
ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా?

చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో దర్శకుడు కస్తూరి రాజాను, 'పోయెస్ గార్డెన్‌లో నివసించే నటుడు ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?' అని అడిగారు. దానికి ఆయన, 'ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. నా కొడుకులు, మనవళ్లు కూడా రావచ్చు. చెన్నైలో అత్యంత పవర్‌ఫుల్ ప్లేస్ గోపాలపురం. కళైంజ్ఞర్ కరుణానిధి జీవించిన ఆ ప్రదేశం నుంచే వెలుగు వచ్చింది. భవిష్యత్తులో ధనుష్ కొడుకులు కూడా సినిమాల్లోకి రావచ్చు  అన్నారు.  

35
ధనుష్ 55లో చేరిన మలయాళ నటుడు!
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో ధనుష్ 55వ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ధనుష్ 'వుండర్‌బార్ ఫిల్మ్స్', 'ఆర్ టేక్ స్టూడియోస్' సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు, ఇటీవల తమిళంలో విడుదలైన 'కరుప్పు' చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న సీనియర్ మలయాళ నటుడు ఇంద్రన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. త్వరలోనే ఆయనపై సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
45
ధనుష్ అసలు పేరు ఏంటి?

ధనుష్ తండ్రి మాట్లాడుతూ..  ప్రస్తుతం నా కూతురి కొడుకు పవిష్ నటిస్తున్నాడు'.  ధనుష్ పేరు వెనుక ఉన్న గర్వం అంతా ఇంతా కాదు అన్నాడు. ఇక  'ధనుష్ అసలు పేరు వెంకటేశ ప్రభు. సినిమా కోసం ధనుష్ అని మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఎయిర్‌పోర్టుల్లో, ఇతర చోట్ల అతన్ని 'ధనుష్ కె రాజా' అని పిలుస్తున్నారు. నా పేరుతో కలిపి అతని పేరు వినడం నాకు చాలా గర్వంగా ఉంది' అని చెప్పారు.

55
విజయ్ తో పోటీ ఉంటుందా?

ఇక ధనుష్ తండ్రి మాటలతో స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మాజీ మామ రజినీకాంత్ వెనకడుగు వేయడంతో.. ధనుష్ పక్కాగా పొలిటికల్ గాఎంట్రీ ఇస్తాడని టాక్. విజయ్ కి పోటీగా అజిత్ ను రంగంలోకి దింపాలని చూసింది అన్నాడీఎంకే. కానీ అది కుదరలేదని టాక్. ఇక ఇప్పుడు ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories