కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి

Published : Jun 09, 2026, 01:19 PM IST

కృష్ణ రియల్‌ ఎస్టేట్‌లో డబ్బులు పెడితే ఇప్పుడు సగం చెన్నై, సగం హైదరాబాద్‌ ఆయనదే అయ్యేదని తెలిపారు ప్రముఖ నిర్మాత అంకమ్మ రావు. పలు సంచలన విషయాలు వెల్లడించారు. 

PREV
15
టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ

సూపర్‌స్టార్‌ కృష్ణ టాలీవుడ్‌లో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అనేదానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగానూ డేరింగ్‌తో ముందుకెళ్లారు. అనేక విజయాలు సాధించారు. భోళా మనసుకి కేరాఫ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ. సినిమాకి సంబంధించిన అనేక కొత్త ట్రెండ్స్ ని సృష్టించారు. కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. అదే సమయంలో ప్రొడక్షన్‌ పరంగానూ విప్లవాత్మక మార్పులు చేశారు. ప్రొడక్షన్‌లో మొదటిసారి నాన్‌వెజ్‌ పెట్టింది కూడా కృష్ణనే కావడం విశేషం. కృష్ణ గొప్పతనానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

25
కృష్ణ సరికొత్త రికార్డ్

ఇదిలా ఉంటే సూపర్‌ స్టార్‌ కృష్ణకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన తలచుకుంటే శోభన్‌బాబుని మించిన కోటీశ్వరుడు అయ్యేవాడట. వేల కోట్లకు కాదు, లక్షల కోట్లు సంపాదించేవారట. తాజాగా ప్రముఖ నిర్మాత ముప్పా అంకమ్మా రావు.. కృష్ణ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయలేనన్ని సినిమాలు చేశాడని తెలిపారు. హీరోగా కృష్ణ 350కిపైగా సినిమాలు చేశాడని తెలిపారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదని చెప్పొచ్చు. కృష్ణ ఒక్క ఏడాది 18 సినిమాలు చేసిన విషయం తెలిసిందే. 15కిపైగా సినిమాలు చాలా ఏళ్లపాటు చేయడం విశేషం.

35
సగం చెన్నై, సగం హైదరాబాద్‌ కృష్ణదే

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కృష్ణ తాను చేసిన సినిమాలకు పారితోషికం ద్వారా వచ్చిన డబ్బుని రియల్‌ ఎస్టేట్‌మీద పెడితే సగం చెన్నై, సగం హైదరాబాద్‌ కృష్ణ గారిదే అయ్యేది. అంతగా సంపాదించారు అని చెప్పారు. అయితే తాను సంపాదించినదంతా మళ్లీ ఆయన సినిమాల్లోనే ఖర్చు చేశారని తెలిపారు. ప్రొడక్షన్‌ స్థాపించి సినిమాలు చేశారని, మళ్లీ ఇండస్ట్రీకే తన డబ్బుని ఇచ్చాడని వెల్లడించారు. అంతేకాదు కృష్ణతో సినిమా చేసిన నిర్మాత నష్టపోతే, ఆ నిర్మాతని అంతటితో వదిలేయకుండా.. నెక్ట్స్ సినిమాకి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా చేసిపెట్టేవాడని వెల్లడించాడు.

45
నిర్మాతల బాగు చూసిన కృష్ణ

అంతేకాదు తనతో చేసిన సినిమాలు ఆడకపోతే నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం వెనక్కి ఇచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయని వెల్లడించారు. ఇలా కృష్ణగారు ఎప్పుడూ డబ్బుని లెక్కచేయలేదని, నిర్మాతలు బాగుండాలని చూసుకున్నారని తెలిపారు. సినిమాల ప్రొడక్షన్‌ పరంగా అందరు బాగుండేలా చూసుకునేవారని వెల్లడించారు.  ఈ సందర్బంగా `అల్లూరి సీతారామరాజు` సినిమా షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న సంఘటనని పంచుకుంటూ.. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో దర్శకుడికి ఆరోగ్యం బాగాలేకపోతే.. కృష్ణనే డైరెక్ట్ చేశాడని, కానీ పేరు మాత్రం దర్శకుడిదే వేశారని చెప్పారు. అది కృష్ణగారి గొప్ప, మంచి మనసుకి నిదర్శనమని వెల్లడించారు.

55
శోభన్‌ బాబుని మించి వేల కోట్లు కృష్ణ సొంతం

సోగ్గాడు శోభన్‌బాబు.. తాను సంపాదించిన డబ్బులు ప్రతి రూపాయి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టారు. చెన్నైలో భారీగా ఆస్తులు కొన్నారు.  తెలుగు, తమిళంలోనే అత్యంత సంపన్నమైన హీరోగా ఆయనకు పేరుంది. ఇప్పుడు ఆయన కొడుకు కేవలం ఆయా ఆస్తులను మెయింటేన్‌ చేయడానికి సరిపోతుందట. ఇప్పుడు వాటి విలువ వేల కోట్లు ఉంటాయని అంటుంటారు. అదే కృష్ణ తన పారితోషికాన్ని ఇలా రియల్‌ ఎస్టేట్‌లో పెడితే, ఆయన  శోభన్‌ బాబుని మించిన ఆస్తులు కొనేవారని అంటుంటారు. వేల కోట్లకు కాదు, లక్షల కోట్లకు అధిపతి అయ్యేవారు. ఇప్పుడు ఆ లక్షల కోట్లకు మహేష్‌ బాబు వారసులుగా ఉండేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories