Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్

Published : Jun 09, 2026, 12:09 PM ISTUpdated : Jun 09, 2026, 12:16 PM IST

రామ్‌ చరణ్‌ నటించిన పెద్ది సినిమాపై అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. చరణ్‌ నటన చూస్తుంటే తనకు గర్వంగా ఉందట. సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

PREV
14
థియేటర్లలో సందడి చేస్తోన్న పెద్ది మూవీ

రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ మూవీ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. తమ ఊరికి, తమకి గుర్తింపు లేకపోవడంతో ఆ గుర్తింపు కోసం పెద్ది క్రీడని ఎంచుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే ఈ చిత్ర కథ. ఇన్‌స్పైర్‌ చేసే కథాంశంతో రూపొందిన ఈ మూవీకి మేకింగ్‌ పరంగా కొన్ని విమర్శలు వచ్చినా, వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది.

24
రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై అల్లు అర్జున్‌ ప్రశంసలు

సినిమాకి క్రిటికల్‌గా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొడుకుని చూసి గర్వంగా ఉందని చిరంజీవి కామెంట్‌ చేశారు. చాలా మంది మేకర్స్, సెలబ్రిటీలు సినిమాని, రామ్‌ చరణ్‌ నటనని ప్రశంసించారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌ స్పందించారు. పెద్ది సినిమా చూసిన ఆయన.. మూవీ గురించి, రామ్‌ చరణ్‌ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశంసలు కురిపించారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్‌ అంటూ ఆయన కామెంట్‌ చేయడం విశేషం. ఈ మేరకు అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

34
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్‌

ఇంతకి అల్లు అర్జున్‌ ఏం చెప్పాడంటే.. `నిన్న రాత్రి పెద్ది సినిమా చూశాను. నా ప్రియమైన రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. పటిష్టమైన, సహజమైన నటన, అసాధారణమైన బాడీ ట్రాన్ఫర్మేషన్‌, గ్రేస్‌ఫుల్‌ డాన్స్, ఇలా ప్రతి విషయంలోనూ ఆయన అద్భుతంగా రాణించారు. నిన్ను చూసి గర్వపడుతున్నాను బ్రదర్‌. నీకు దక్కుతున్న ప్రశంసలన్నీ పూర్తిగా అర్హమైనవే. జగపతిబాబు, ఇతర నటీనటులందరూ కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. హీరోయిన్‌ జాన్వీ కపూర్‌కి నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు కూడా అభినందనలు. అందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ, చరణ్‌ని అత్యున్నత స్థానంలో నిలిపిన ఈ చిత్ర సారథి బుచ్చిబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. మొత్తం చిత్ర బృందానికి అభినందనలు` అని తెలిపారు అల్లు అర్జున్‌. 

44
అల్లు అర్జున్‌ ట్వీట్‌తో మెగా అభిమానులు ఖుషీ

అల్లు అర్జున్‌ ట్వీట్‌తో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ మధ్య చాలా రోజులుగా కాంపిటీషన్‌ నడుస్తోంది. దీనితోపాటు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కొంత గ్యాప్‌ నడుస్తుందనే వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించడం విశేషం. ఇది వీరి మధ్య మంచి రిలేషన్‌కి ప్రతిబింబంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక పెద్ది మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.249కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించగా, రూ.315కోట్లు రాబట్టినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories