ప్రభాస్ కి ఒకే ఏడాది 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. అల్లు అర్జున్, వెంకటేష్ చిత్రాలకు పోటీగా వెళ్లడంతో నెగిటివ్ రిజల్ట్ తప్పలేదు. ఆ సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కానీ గతంలో ప్రభాస్ కూడా టాలీవుడ్ హీరోలతో పోటీ పడాల్సి వచ్చేది. స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం, బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం అనేది సహజం. ప్రభాస్ కి గతంలో ఒకే ఏడాది డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
25
భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ మూవీ
ప్రభాస్ కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రాల్లో యోగి ఒకటి. ఆ టైంలో డైరెక్టర్ వివి వినాయక్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ డైరెక్టర్. పైగా బన్నీ, లక్ష్మీ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో వివి వినాయక్, ప్రభాస్ కాంబోలో యోగి చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరోతో వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డుల మోత ఖాయం అని అంతా భావించారు.
35
ప్రభాస్ సినిమాపై దేశముదురు దెబ్బ
భారీ అంచనాల నడుమ యోగి చిత్రం 2007 సంక్రాంతికి రిలీజ్ అయింది. నయనతార ఈ చిత్రం లో హీరోయిన్. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రెండు రోజుల గ్యాప్ లో అల్లు అర్జున్, పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన దేశముదురు రిలీజ్ అయింది. యూత్ ఫుల్ లవ్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దేశముదురు మంచి టాక్ సొంతం చేసుకుంది. దీనితో దేశముదురు చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోయాయి. ఫలితంగా యోగి బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది.
అదే ఏడాది కొన్ని నెలల వ్యవధిలోనే ప్రభాస్ కి మరో షాక్ తప్పలేదు. యోగి చిత్రంతో హెవీ ఎమోషనల్ కథతో వచ్చిన ప్రభాస్.. ఈసారి యూత్ లక్ష్యంగా కాలేజ్ డ్రామాతో వచ్చారు. ఆ చిత్రమే మున్నా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది.
55
ఈసారి వెంకటేష్ కి పోటీగా వెళ్లి ..
మున్నా చిత్రంలో సాంగ్స్ బాగా హిట్టయ్యాయి. దీనితో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. 2007 మే 2న ఈ చిత్రం విడుదలైంది. అప్పటికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఇలియానా మున్నా చిత్రంలో నటించింది. విడుదలైన తొలి షో నుంచే మున్నా చిత్రానికి ఫ్లాప్ టాక్ మొదలైంది. ఈ చిత్రానికి వారం ముందు వెంకటేష్, త్రిష ల ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మున్నా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వెంకటేష్ జోరు ముందు నిలబడలేకపోయింది.