renu desai
Renu Desai: రేణు దేశాయ్ `బద్రి` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటించింది. ఆ తర్వాత `జానీ` సినిమాలో పవన్‌తో మరోసారి కలిసి నటించింది. దీనికి పవనే దర్శకుడు. ఈ మూవీ ఆడలేదు. కానీ పవన్, రేణు దేశాయ్‌ల ప్రేమ సక్సెస్ అయ్యింది. ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
renu desai
సుమారు ఇరవై ఏళ్ల తర్వాత రెండేళ్ల క్రితం రవితేజ హీరోగా నటించిన `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటించారు రేణు దేశాయ్. ఆ మూవీ ఆడలేదు. మళ్లీ ఆమె మరే సినిమాకి ఒప్పుకోలేదు.
మరి సినిమాలు చేయకపోవడంపై, ఇరవైఏళ్ల తర్వాత వెండితెరపై తనని తాను చూసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్‌ని చెబుతూ వాహ్ అనిపించిందన్నారు రేణు దేశాయ్. ఇన్నాళ్లు బిగ్ స్క్రీన్‌ని మిస్ అయిన ఫీలింగ్ కలిగిందన్నారు. మళ్లీ నటించాలని ఉందని వెల్లడించారు.
pawan kalyan, Renu Desai
`నాకు నటించాలని ఉంది, కానీ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఆధ్యని ఒంటరిగా వదిలేసి రావాల్సి వస్తుంది. దీంతో ఆమె ఏం చేస్తుంది? ఏం చదువుతుంది? ఏం చూస్తుందనే టెన్షన్ ఉంటుంది. వర్క్ మీద కంటే ఆధ్య మీదనే దృష్టి ఉంటుంది, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నాను.
ఆధ్య పెద్దగైతే, తన పనులు తాను చేసుకుని, ఇండిపెండెంట్‌గా ఎదిగేంత వరకు ఆమెకి తోడుగానే ఉండాలి, అప్పటి వరకు మరేపని చేయలేన`ని తెలిపారు. తనకు ఇంట్లో సపోర్ట్ గా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఆధ్యని చూసుకోవడానికి అమ్మా నాన్న లేరు, బ్రదర్స్ సిస్టర్స్ లేరు, ఇతర ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏదైనా ఒంటరిగానే డీల్ చేసుకోవాలని తెలిపారు.