ఒక్క చేత్తో హై స్పీడ్ కారును ఆపేశాడు
Jaat Highlights: సన్నీ డియోల్ హీరోగా నటించిన `జాట్` చిత్రం హిందీ ఆడియెన్స్ కి మంచి యాక్షన్ ఫీస్ట్ ని ఇస్తుంది. సన్నీ డియోల్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఎలివేషన్లు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని హైలైట్స్, ముఖ్యంగా యాక్షన్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. 'జాట్'లో సన్నీ డియోల్ ఒక దాబాలో ఇడ్లీ తింటుంటే రౌడీలు వచ్చి ఇడ్లీ పడేస్తారు. అప్పుడు సన్నీ డియోల్ వాళ్లని కొట్టి కారును ఆపేస్తాడు.
సిగరెట్ ఎగరేసి రజనీకాంత్ ను గుర్తు చేశాడు
సన్నీ డియోల్ రౌడీలను కొడుతూ సిగరెట్ గాల్లోకి ఎగరేస్తాడు. అది మళ్లీ అతని చేతికే వస్తుంది. ఈ సీన్ చూస్తే రజనీకాంత్ గుర్తుకు రాక మానరు.
ఆఫీసులో ఒక్క చేత్తో ఫ్యాన్ పీకేశాడు
సన్నీ డియోల్ ఒక ప్రభుత్వ ఆఫీసులో రౌడీలతో గొడవ పడతాడు. వాళ్లని చితక్కొడుతూ ఒక చేత్తో ఫ్యాన్ పీకేస్తాడు. ఈ సీన్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ కి అరాచకం అనిపించేలా ఉంటుంది.
మనిషిని ఎత్తి పుషప్స్ తీశాడు
సన్నీ డియోల్ జైలులో ఉన్నప్పుడు ఖైదీలు అతనిపై దాడి చేస్తారు. అప్పుడు సన్నీ వాళ్లని కొడుతూ ఒక మనిషిని ఎత్తి పుషప్స్ తీస్తాడు. ఇది పిచ్చ క్రేజీగా ఉంది.
సంకెళ్లు ఉన్నా స్తంభం పడగొట్టాడు
పోలీస్ స్టేషన్ సీన్లో ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ సన్నీ డియోల్ ను సంకెళ్లతో కట్టేసి కొడతాడు. అప్పుడు సన్నీ స్తంభం పడగొడతాడు. ఈ సీన్‌కి థియేటర్లో విజిల్సే విజిల్స్. ఫ్యాన్స్ అరుపులు వేరే లెవల్.