Mega Heroes Ghibli Look: చిరు, బన్నీ, చరణ్‌ ఏంటి ఇలా ఉన్నారు, వైష్ణవ్‌ తేజ్‌ అమ్మాయి, గిబ్లీ పెద్ద కామెడీ

Mega Heroes Ghibli Look: టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) మనిషిలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. మనిషి పనిని చాలా ఈజీ చేస్తుంది. అందులో భాగంగా గిబ్లీ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. మనిషి ఫోటోలను పెయింటింగ్‌ తరహాలో చూపించే ఈ కొత్త ట్రెండ్‌ సోషల్‌ మీడియాని, ప్రపంచాన్ని ఊపేస్తుంది. సినిమా సెలబ్రిటీలు కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు. సరదాగా తమ ఫోటోలను పంచుకుంటున్నారు. 

mega heroes Ghibli photos Chiranjeevi ram charan allu arjun crazy look vaishnav tej missing in telugu arj
mega heroes ghibli photo

Mega Heroes Ghibli Look: గిబ్లీ ట్రెండ్‌ అంతటా వైరల్‌గా మారింది. ఇది చాలా క్రేజీగానూ ఉంది. చాలా వరకు తమ ఫోటోలను ఇలా గిబ్లీలోకి మార్చుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు,

క్రికెటర్ల ఫోటోల గిబ్లీ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో మన మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల గిబ్లీ లుక్‌ ఎలా ఉందో ఏషియానెట్‌ న్యూస్‌ తెలుగు ప్రయత్నించింది. ఆ లుక్‌ ఎలా ఉందో చూడండి. 

mega heroes Ghibli photos Chiranjeevi ram charan allu arjun crazy look vaishnav tej missing in telugu arj
mega heroes

మెగా హీరోలు గతంలో అంతా కలిసి ఫోటో దిగారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ లేరు. కానీ చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, అలాగే మెగా డాటర్‌ నిహారిక కూడా ఉన్నారు. ఈ ఫోటో అప్పట్లో బాగా వైరల్‌ అయ్యింది. మరి ఈ ఫోటోని గిబ్లీ లుక్‌లోకి మార్చి చూసినప్పుడు వచ్చిన రిజల్ట్ క్రేజీగా ఉంది. 
 


mega heroes ghibli photo

ఛాట్‌ జీపీటీ ద్వారా గిబ్లీ లోకి ఈ మెగా హీరోల ఫోటోని కన్వర్ట్ చేయగా, అది విచిత్రంగా చూపించింది. అసలు రియాలిటీకి దగ్గరగా లేదు. చిరంజీవి, అల్లు అర్జున్‌, నిహారిక కాస్త బెటర్ గా ఉన్నారు. ఇక రామ్‌ చరణ్‌ని మాత్రం చాలా క్రేజీగా చూపించింది.

అలాగే అల్లు శిరీష్‌ని కూడా కామెడీగా చూపించింది. నాగబాబు ఓ కొత్త వ్యక్తిలా కనిపించారు. సాయి ధరమ్‌ తేజ్‌ సైతం గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. ఇక వైష్ణవ్‌ తేజ్‌ ని మాత్రం మిస్‌ చేసింది.  
 

mega heroes ghibli photo

ఇక కొత్తగా ట్రెండింగ్‌లోకి వచ్చిన గ్రోక్‌ బెటా యాప్‌ ద్వారా ఇదే మెగా హీరోల ఫోటోలను గిబ్లీ చేయగా, ఇది మరింత క్రేజీగా చూపించింది. ఇది రెండు ఫోటోలను విడుదల చేసింది. మొత్తంగా కార్టూన్‌ ఫోటోల్లాగా చూపించింది.

చాట్‌ జీపీటీ ద్వారా అయిన కాస్త బెటర్‌. కానీ గ్రోక్ మాత్రం ఏమాత్రం రియాలిటీకి దగ్గరగా లేదు. చాలా కొత్తగా ఫన్నీగా చూపించింది. ఇది మెగా ఫ్యాన్స్ కి డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇవ్వబోతుందని చెప్పొచ్చు. 

read  more: మార్క్ శంకర్‌ హెల్త్ అప్‌ డేట్‌.. ఎన్టీఆర్ ట్వీట్‌కి స్పందించిన పవన్‌, ఏం చెప్పాడంటే

also read: హరికృష్ణ చేసిన పనికి దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో కొడుకుని చితకబాదిన తండ్రి
 

Latest Videos

vuukle one pixel image
click me!