పుష్ప 2 తర్వాత టాలీవుడ్ ఫోకస్ మొత్తం గేమ్ ఛేంజర్ వైపు మళ్లింది. దేవర చిత్రం పాన్ ఇండియా టెస్టులో పాస్ మార్కులతో బయటపడింది. ఇక పుష్ప 2 అయితే ఇండియా బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అంతలా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి అని ? పాన్ ఇండియా పరీక్షలో రాంచరణ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనే డిస్కషన్ మొదలైంది.
పాన్ ఇండియా చిత్రానికి ఉండవలసిన బజ్ ఇంతవరకు గేమ్ ఛేంజర్ కి ఏర్పడలేదు. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రం శంకర్ పాత చిత్రాల్లో ఉండే మెసేజ్, పొలిటికల్ టచ్ తో ఉండబోతోంది. రాంచరణ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. ఐఏఎస్ అధికారి రామ్ నందన్ గా.. ప్రజా నాయకుడు అప్పన్నగా తండ్రి కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారు.
మగధీర చిత్రంలో కాలభైరవ పాత్ర, రంగస్థలంలో చిట్టిబాబు, ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్రలు చరణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న పాత్ర కూడా అలాంటిదే అని అంటున్నారు. మరి శంకర్ గతంలో లాగా తన సత్తా చూపించాడో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.