సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారం గురించి మొహమాటం లేకుండా వాస్తవాలు బయటపెట్టారు. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. మేము చిన్న తనంలో ఉన్నప్పుడు సినిమాలు 100 రోజులు, 200 రోజులు నడిచేవి.
ఆ బడ్జెట్ ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోలు స్వయంగా థియేటర్స్ కి వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, విజయోత్సవాలు ఇలా ప్రమోషన్స్ పెరిగిపోయాయి. ఇక సంధ్య థియేటర్ కేసులో ఏం జరిగిందంటే.. థియేటర్ యాజమాన్యం పోలీసులకు కేవలం లెటర్ మాత్రమే రాశారు. కానీ అల్లు అర్జున్ లాంటి మాస్ హీరో వస్తున్నప్పుడు యాజమాన్యం స్వయంగా థియేటర్ కి వచ్చి అనుమతి తీసుకోవాలి అని పోలీసులు చెబుతున్నారు.
దానివల్ల ఎంత మంది పోలీసులని పంపాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పోలీసులకు తెలుస్తుంది. అలా చేయలేదనేది పోలీసులు చెబుతున్న మాట. ఉద్దేశ పూర్వకంగా ఒక వ్యక్తి మరణానికి కారణం అయితే మర్డర్ కిందికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఒక సంఘటన జరగవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా జాగ్రత్తలు తీసుకోరు. అలాంటివి మర్డర్ కిందికి రావు. ఇప్పుడు అల్లు అర్జున్ పై పెట్టిన కేసు అదే అని లక్ష్మీ నారాయణ అన్నారు. గతంలో సల్మాన్ ఖాన్ పై హిట్ అండ్ రన్ కేసులో 'కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్' కేసుని నమోదు చేసారు.
ఇప్పుడు అల్లు అర్జున్ పై నమోదైన కేసు కూడా అదే. సెలబ్రిటీల వరకు వచ్చే సరికి సెక్షన్లు మారిపోతున్నాయి అని లక్ష్మి నారాయణ సెటైర్లు వేశారు. అయితే అల్లు అర్జున్ విషయంలో ఇలాంటి కేసు వర్తించదు అని చాలా మంది వాదిస్తున్నారు. ఎందుకంటే తొక్కిసలాట అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఉత్సవాల్లో, పుష్కరాల్లో ఇలా అనేక సందర్భాల్లో తొక్కిసలాట జరిగి మనుషులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సందర్భాల్లో థియేటర్ యాజమాన్యాలు బాధ్యతగా ఉండాలి. పోలీసులకు లెటర్ రాసి సరిపెట్టుకోకూడదు. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు.