ఉపేంద్ర ‘UI మూవీ’ రివ్యూ

Published : Dec 20, 2024, 02:18 PM ISTUpdated : Dec 20, 2024, 02:20 PM IST

ఉపేంద్రకు దర్శకుడుగా ఒకప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన సినిమాలు తెలుగునాట కూడా బాగా ఆడాయి. అయితే నటుడిగా సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా గ్యాప్ ఇచ్చారు. దాదాపు 9 ఏళ్ళ తర్వాత ఈ యూఐ సినిమాతో వచ్చాడు.

PREV
17
ఉపేంద్ర ‘UI మూవీ’ రివ్యూ
Upendra, UI The Movie, Telugu review



ఉపేంద్రకు దర్శకుడుగా ఒకప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన సినిమాలు తెలుగునాట కూడా బాగా ఆడాయి.   దర్శకుడిగా A, shh, సూపర్, ఉపేంద్ర, ఉప్పి 2, రక్తకన్నీరు లాంటి సినిమాలు తీసి ఓ జనరేషన్ కు తెగ నచ్చేసాడు.

అయితే నటుడిగా సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా గ్యాప్ ఇచ్చారు. దాదాపు 9 ఏళ్ళ తర్వాత ఈ యూఐ సినిమాతో వచ్చాడు. సాధారణంగా ఉపేంద్ర సినిమాల్లో చాలా వరకు సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనలను చూపిస్తూ సొసైటీ మీద సెటైర్స్ వేస్తూ ఉంటాడు. ఈ సినిమాలోనూ అదే జరిగిందా... అసల ఈ సినిమా కథేంటి...తెలుగులో వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

27


స్టోరీ లైన్

ఉపేంద్ర అనే డైరక్టర్  తీసిన‌ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదే సమయంలో వివాదం సృష్టిస్తుంది. ‘UI మూవీ’ అనే టైటిల్ తో వచ్చిన సినిమా చూసిన జ‌నాలు పిచ్చెక్కిపోతారు. ‘ఫోక‌స్‌’ దొరికిందని కొందరు ఆనందంతో గంతులు వేస్తూంటారు. ఇలాంటి పరిస్దితుల్లో ఓ రివ్యూ రైటర్ (మురళి శర్మ)కు ఈ సినిమాకు ఏ రివ్యూ రాయాలో అర్దం కాదు. దాంతో ఈ సినిమాని బాగా పరిశీలించాలని ఆలోచిస్తూ, మళ్లీ మళ్లీ ఆ సినిమానే చూస్తూ తిరుగుతూంటాడు. ఇలా కాదు అని ఉపేంద్రని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఇంటి దగ్గర ఉపేంద్ర రాసి పడేసిన ఓ స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ స్క్రిప్ట్ ని అతని ఊహల్లోంచి మనకు సినిమాగా ఆవిష్కారం అవుతుంది. 
 

37


ఆ స్క్రిప్టులో  సత్య(ఉపేంద్ర), కల్కి(ఉపేంద్ర) ఇద్దరు కొద్ది నిముషాల తేడాలో పుట్టిన అన్నదమ్ములు. అయితే ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు. సత్య   మంచితనంతో ప్రపంచాన్ని మార్చేయాలనుకుంటాడు.   కల్కి(ఉపేంద్ర) రివర్స్ లో  తన తల్లిని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవాలని, అలాంటి  సమాజాన్ని నామ రూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తూంటాడు.

అందుకు అడ్డురాకుండా తన సొంత సోదరుడు సత్యని బంధిస్తాడు కల్కి. అప్పుడు ఏం జరుగుతుంది. సత్య బయిటకు వచ్చాడా, కల్కి ఈ లోగా ఏం చేసాడు. రివ్యూ రైటర్ కు ఏం కంక్లూజన్ దొరికింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 

47


ఎలా ఉంది

 ‘మీరు తెలివైన వాళ్ల‌యితే ఇప్పుడే బ‌య‌ట‌కు వెళ్లిపోండి. మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి’ అంటూ సినిమా ప్రారంభంలో  ఓ కార్డ్ వేస్తుంది. అది చూసి కంగారు పడేలోగా వెంటనే ‘తెలివైన వాళ్లు మూర్ఖుల్లా క‌నిపిస్తార‌ని, మూర్ఖులు తెలివైన వాళ్ల‌లా న‌టిస్తార‌ని’ ఇంకో రూల్ పాస్ చేస్తాడు. మనం సినిమా చూద్దామని ఫిక్సై ఉంటాము కాబట్టి ..తెలివి లేదనుకుని కూర్చుంటాము. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఉపేంద్ర మనని తెలివి లేనివాళ్లు గా ప్రూవ్ చేద్దామనే ప్రయత్నం చేస్తూంటాడు.

మొదట వేసిన కార్డ్ లో ఉన్న తెలివి మళ్లీ ఎక్కడా సినిమా కనపడదు. తెరపై ఏదో కనపడుతూంటుంది. మనం చూస్తుంటుంది. నిద్రపోతూంటాము. మెలుకవ వస్తుంది. కథ ఎక్కడికి వెళ్లదు. అక్కడక్కడే తిరుగుతుంది. మళ్లీ ఇందులో కథ లేదు కదా తిరగమేంటి అనొచ్చు.అదీ ఓ రకమైన కధా గందరగోళం. ఉపేంద్ర కు ఈ సినిమా చూసే వాళ్లకు అర్దం కాదేమో పిచ్చి పడుతుందేమో అనిపించినట్లుంది. అదీ సింబాలిక్ గా ఇదే సినిమా థియేటర్ లో చూసి బయిటకు వచ్చి పిచ్చ పిచ్చగా బిహేవ్ చేసే జనాలను చూపిస్తాడు. 

57


ఓ టైమ్ లో ఏంటి పొరపాటున వేరే సినిమాకు వచ్చేసామా అనే సందేహం వస్తూంటుంది. అప్పుడు ఉపేంద్ర కనపడగానే రిలాక్స్ అవుతాము..లేదు లేదు..అదే సినిమా చూస్తున్నాం అనుకుంటాము. ఉపేంద్ర తన తెలివి, తనలోని డిప్రెషన్, సప్రెషన్, హైపర్  అంతా ఒకే సినిమాలో కుప్పగా పోసేసారు.

ఉపేంద్ర ఉద్దేశ్యం ఈ సినిమా గురించి జనం వింతగా మాట్లాడుకోవాలి అని అయ్యిండవచ్చు. అదేతే జరిగింది..ఏంటి ఉపేంద్ర బుర్ర ఏమన్నా ఖరాబు అయ్యిందా అనే సందేహం వస్తుంది. అయితే ఇలాంటి కంగిరిబింగిరి గందరగోళం లో కూడా కథ వెతుక్కుని అర్దు చేసుకునే వాళ్లు ఉంటే వాళ్లను ఉపేంద్ర పిలిచి ఇందులో కథేంటని అడగచ్చు. ఎందుకంటే ఇందులో కథేంటన్నది ఆయనకు కూడా అర్దం కాకపోయి ఉండవచ్చు.
 

67


టెక్నికల్ గా ...

సినిమాలో చెప్పుకోదగనది..కొన్ని సీన్స్ లో హైలెట్ అయిన సినిమాటోగ్రఫీ. ఇక  బ్యాక్ గ్రౌండ్ చాలా హెవీగా అనిపిస్తుంది. పాటలు జస్ట్ ఓకే .  ట్రోల్ సాంగ్ మాత్రమే గుర్తుంటుంది.  ఉపేంద్ర కాస్ట్యూమ్స్ కొత్తగా  ఉన్నాయి.  యూఐ స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు కష్టపడి కొత్తగా రాసుకున్నాడు కానీ అర్దం కావటానికి చూసేవాడికి పదేళ్లు పట్టేలా ఉంది. డైరెక్షన్ పరంగా కూడా ఉపేంద్ర కొత్తగా ఈ తరంతో పోటి పడలేకపోయారు. కానీ కొన్ని షాట్స్ ఆయన మాత్రమే తీయగలరు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 
నటీనటుల్లో ... ఉపేంద్ర ఎప్పటిలాగే కొత్తగా చేసారు వాయిస్ నుంచి గెటప్,లుక్ అన్ని మార్చేసారు. కొద్దిపాటి నెగిటివ్ పాత్రలో రవిశంకర్ కనిపించారు. ఇందులో ఉపేంద్రే హీరో, విలన్ కాబట్టి తెర మొత్తం ఆయనే ఉంటారు. మురళి శర్మ ఎంతో సేపు లేరు. చెప్పుకోవటానికి ఏమీ లేదు.

77
South Indian Films Releasing in 2025


ఫైనల్ థాట్

తీసేవారికి మాత్రమే కాకుండా చూసేవాళ్లకు తెలివి ఉండాలనేది ఉపేంద్ర మొదటి సినిమా A నుంచి పెట్టుకున్న నియమం. ఆ సినిమా కూడా బుద్దిమంతులకు మాత్రమే అని వేస్తారు. అయితే వాటిల్లో ఓ కథ, ట్విస్ట్ లు, కొన్ని సెటైర్స్ ఉంటాయి. అయితే ఈ సినిమా వాటన్నిటిని దాటేసింది. అయినా ఉపేంద్ర అభిమానిని చూస్తాను అనుకుంటే వాళ్లకు నచ్చవచ్చు.
Rating: 2

---సూర్య ప్రకాష్ జోశ్యుల

click me!

Recommended Stories