భార్యకు భరణంగా 380 కోట్లు చెల్లించిన స్టార్ హీరో, ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా?

Published : Sep 14, 2025, 12:22 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు , పెళ్లిల్లు , విడాకులు కామన్ గా జరిగేవే. ప్రస్తుత కాలంలో వాటిని ఎవరు పట్టించుకోవడంలేదు. కాని ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు ఏజంటవో తెలుసా? 

PREV
16
అత్యంత ఖరీదైన విడాకులు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ప్రేమలో పడి, వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వివాహ బంధం ఎక్కువకాలం నిలవని సందర్భాలు కూడా ఎక్కువే. కొంతమంది సెలబ్రిటీలు వివాహ బంధం నుంచి బయట పడతూ కోర్టుల ఆశ్రయించారు. ఈ సందర్భంగా భర్తలు మాజీ భార్యలకు భారీగా భరణం చెల్లించారు. ఈక్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకుల వివరాలు ఎవరివి? ఎక్కువ భరణం చెల్లించిన హీరో ఎవరు?

26
హృతిక్ రోషన్ – సుసానే ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముందుగా తన బాల్య స్నేహితురాలు సుసానే ఖాన్ ను వివాహం చేసుకున్నారు. దాదాపు 13 సంవత్సరాల పాటు వీరి బంధం ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా కొనసాగింది. కానీ, 2014లో మనస్పర్ధలు రావడంతో ఈ జంట విడిపోయింది. విడాకుల సమయంలో సుస్సానె 400 కోట్లు డిమాండ్ చేయగా, హృతిక్ 380 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాడు. ఇప్పటి వరకు ఇది బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన విడాకులు వీరివే. అయితే ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

36
ఆమిర్ ఖాన్ – రీనా దత్తా

బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో 2002లో విడాకులు తీసుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం, రీనాకు ఆమిర్ దాదాపు 50 కోట్ల భరణం చెల్లించాడు. అనంతరం ఆయన కిరణ్ రావును వివాహం చేసుకున్నా, ఆమెతోనూ ఇటీవల విడిపోయారు. ప్రస్తుతం మరో నటితో అమీర్ ఖాన్ డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం.

46
సైఫ్ అలీ ఖాన్ – అమృత సింగ్

ప్రస్తుతం కరీనా కపూర్ తో మారీడ్ లైప్ ను ఎంజాయ్ చేస్తున్న సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్, ముందుగా 13 ఏళ్ల పాటు అమృత సింగ్‌తో వివాహ బంధంలో ఉన్నారు. 2004లో వీరి విడాకులు జరిగాయి. అప్పుడు సైఫ్, అమృతకు 5 కోట్ల వరకు భరణం ఇచ్చారు. అంతేకాకుండా, తన కుమారుడు ఇబ్రహీం 18 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పోషణ ఖర్చులకూ ప్రతీ నెల 1 లక్ష చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.

56
మలైకా ఆరోరా – అర్బాజ్ ఖాన్

బాలీవుడ్ హీరోయిన్ మలైకా ఆరోరా, సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ 2017లో విడిపోయారు. విడాకుల సమయంలో మలైకా కనీసం 10 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. చివరికి అర్బాజ్ ఆమెకు 15 కోట్లు చెల్లించాడని తెలుస్తోంది. ఇక ఆతరువాత తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైక డేటింగ్ చేసింది. రీసెంట్ గా వీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.

66
కరిష్మా కపూర్ – సంజయ్ కపూర్

ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, వారి బంధం ఆరంభం నుంచే సమస్యలతో నిండిపోయింది. 2014లో ఈజంట అధికారికంగా విడిపోయారు. కోర్టులో రెండు సంవత్సరాల పాటు కేసు నడిచిన అనంతరం, 2016లో విడాకులు పొందారు. సంజయ్ కపూర్ కరిష్మాకు 70 కోట్ల భరణం చెల్లించాడు. రీసెంట్ గా సంజయ్ కపూర్ హార్ట్ ఎటాక్ తో మరణించారు. వీళ్లే కాదు సమంత, నాగచైతన్య, ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ లాంటి స్టార్స్ కూడా విడాకులు తీసుకుని విడిపోయిన వారిలో ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories