పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ అత్తని ప్రేమించి చివరికి బాలయ్య హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు ?

Published : Sep 14, 2025, 10:11 AM IST

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం అత్త పాత్రలో నటించిన నదియా అప్పట్లో ఓ తెలుగు హీరోతో ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. చివరికి ఆ హీరో బాలయ్య హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ అతనెవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
నటి నదియా లవ్ ఎఫైర్

చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య అనేక రూమర్స్ వినిపిస్తుంటాయి. కొన్ని రూమర్స్ నిజమవుతుంటాయి కూడా. హీరోలని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించిన నదియా 80, 90 దశకాలలో హీరోయిన్ గా పలు భాషల్లో రాణించారు. అప్పట్లో ఓ హీరోతో ఆమె లవ్ ఎఫైర్ సాగించినట్లు రూమర్స్ ఉన్నాయి.

25
హీరోగా, విలన్ గా రాణించిన సురేష్

ప్రముఖ నటుడు సురేష్ గురించి పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేష్ అనేక చిత్రాల్లో నటించారు. సురేష్ శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగారు. ఆయన కుటుంబం మొత్తం శ్రీకాళహస్తికి చెందిన వారే. సురేష్ తెలుగులో హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. విలన్ గా కూడా చేశారు. సౌందర్య, జగపతి బాబు దొంగాట చిత్రాల్లో సురేష్.. సౌందర్య బావగా, విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అమ్మోరు, ఆమ్మో ఒకటో తారీఖు లాంటి చిత్రాల్లో కూడా సురేష్ నటించారు.

35
నదియా, సురేష్ రిలేషన్ పై రూమర్స్

సురేష్ తో కలిసి ఎక్కువ సినిమా చేసిన హీరోయిన్ నదియా. దాదాపు 8 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో అప్పట్లో సురేష్ లవర్ బాయ్ గా ఉండేవారు. సురేష్, నదియా ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ వీరి రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగలేదు.

45
చివరికి బాలయ్య హీరోయిన్ తో పెళ్లి

చివరికి సురేష్ 1990లో అనిత రెడ్డి అనే హీరోయిన్ ని వివాహం చేసుకున్నారు. అనిత రెడ్డి బాలకృష్ణ బాబాయ్ అబ్బాయి అనే చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. శ్రీవారి శోభనం అనే చిత్రంలో కూడా నటించింది. సురేష్, అనిత లకు కొడుకు జన్మించాడు. ఆ తర్వాత ఐదేళ్లకి వీరిద్దరూ విడిపోయారు. అనిత మరో వ్యక్తిని వివాహం చేసుకుని యుఎస్ లో సెటిల్ అయ్యారు. తన మాజీ భార్యతో ఇప్పటికీ తాను ఫ్రెండ్లిగా, ఆప్యాయంగా ఉంటానని సురేష్ తెలిపారు. తామిద్దరం విడిపోయినందుకు ఎలాంటి బాధ లేదని సురేష్ అన్నారు. మా ఇద్దరికీ చాలా చిన్న ఏజ్ లో వివాహం జరిగింది.

55
నదియా గురించి ఇలా..

అంతగా మెచ్యూరిటీ లేదు. అందు వల్ల విడిపోయినట్లు సురేష్ తెలిపారు. అనిత సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి చాలా మంచివారు అని సురేష్ అన్నారు. నటి నదియాతో లవ్ ఎఫైర్ గురించి కూడా సురేష్ ఓపెన్ అయ్యారు. అప్పట్లో నదియా నేను ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. నదియాకి శిరీష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవారు. నా పేరు సురేష్ కావడంతో అంతా నన్నే అనుకున్నారు. మా మధ్య మంచి రిలేషన్ ఉంది కానీ ప్రేమ లేదు. చివరికి నదియా శిరీష్ ని వివాహం చేసుకున్నట్లు సురేష్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories