అప్పట్లోనే చిరు ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక కారు ఉండేదని చిరు చెప్పుకొచ్చారు. దానికి ఆయన చెప్పిన కారణం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 'జూబ్లీహిల్స్ పట్టణానికి దూరంగా ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అందుకే ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయి' అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఒకప్పుడు జూబ్లీహిల్స్ ఎంత దూరంగా విసిరేసినట్లు ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రూ. 11 కోట్ల విలువైన రోల్స్ రాయల్స్ కారును ఉపయోగిస్తున్న చిరుకు ఒకప్పుడు మాత్రం ల్యాండ్ క్రూజర్ చాలా ఇష్టం ఉండేదంటా. అత్యంత భద్రత ఉండే ఎస్‌యూవీ కారు కావడంతో దానికి ఆయన మొగ్గు చూపారంటా.
తెలిసిన ఓ స్నేహితుడు ల్యాండ్ క్రూయిజ్‌ను కొనుగోలు చేస్తే కొన్ని రోజులు వాడుకొని ఇస్తానని ఆ కారును తీసుకున్నారంటా చిరు. అప్పట్లోనే ఈ కారులో ఎన్నో రకాల భద్రతా ఫీచర్లు ఉండేవి. ఎల్‌ఈడీ డ్యాష్ బోర్డ్, బ్యాక్ కెమెరా వంటి ఫీచర్స్ ఉండేవి. జీవితంలో ల్యాండ్ క్రూయిజ్ కచ్చితంగా కొంటానని ఆ సమయంలో చిరు తెలిపారు. ఇప్పుడు అలాంటివి 100 కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు.