ఒక్కడు, పోకిరి, మురారి కాదు, కృష్ణంరాజుకి బాగా ఇష్టమైన మహేష్ మూవీ.. రెబల్స్ కి మాత్రమే నచ్చే చిత్రం అది

Published : Feb 23, 2025, 08:23 AM IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. వెండితెరపై రెబల్ యాటిట్యూడ్ ప్రదర్శించి రెబల్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు.

PREV
15
ఒక్కడు, పోకిరి, మురారి కాదు, కృష్ణంరాజుకి బాగా ఇష్టమైన మహేష్ మూవీ.. రెబల్స్ కి మాత్రమే నచ్చే చిత్రం అది
Mahesh Babu, Krishnam Raju

రెబల్ స్టార్ కృష్ణంరాజు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. వెండితెరపై రెబల్ యాటిట్యూడ్ ప్రదర్శించి రెబల్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. కృష్ణంరాజు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలు అంటే కృష్ణవేణి, అమరదీపం, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు లాంటి చిత్రాలు ఉంటాయి. కృష్ణంరాజు అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటించారు. 

 

25

సూపర్ స్టార్ కృష్ణతో అనేక చిత్రాల్లో నటించారు. కృష్ణ కుటుంబంతో కృష్ణంరాజుకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన వారసుడిగా ప్రభాస్ ని కృష్ణంరాజు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కృష్ణంరాజు కొత్త తరం హీరోల సినిమాలు కూడా చూసేవారు. 

 

35

మహేష్ బాబు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ చిత్రాల్లో తనకి ఇష్టమైన మూవీ ఏంటో చెప్పారు. మహేష్ బాబు పోకిరి, మురారి, ఒక్కడు లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. కానీ కృష్ణంరాజుకు బిజినెస్ మాన్ చిత్రం అంటే చాలా ఇష్టం అట. అది దర్శకుడు సమాజంపై తనకున్న అభిప్రాయాన్ని రెబల్ గా చూపించిన చిత్రం. బిజినెస్ మాన్ లో మహేష్ బాబు నటన కృష్ణంరాజుకి చాలా నేచురల్ గా అనిపించిందట. 

 

45

మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, పెర్ఫామెన్స్ ఒక ఫ్లో లో సాగిపోతుంది. సినిమా చాలా బాగా నచ్చింది అని కృష్ణంరాజు అన్నారు. దర్శకుడు, రచయిత ఒక్కరే అయితే అడ్వాంటేజ్ అదే అని కృష్ణంరాజు అన్నారు. అది కంప్లీట్ హీరోయిజం బేస్డ్ మూవీ అని అన్నారు. బిజినెస్ మాన్ చిత్రం మంచి హిట్ అయింది. అయితే ఆ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ కంటే మాస్, రెబల్ చిత్రాలు ఇష్టపడే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. 

 

55
Mahesh Babu

బిజినెస్ మాన్ చిత్రంలో మహేష్ బాబు పాత్ర నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉంటుంది. ముంబై మాఫియా నేపథ్యంలో పూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 

 

Read more Photos on
click me!

Recommended Stories