రావు రమేష్, అన్షు అంబానీ మధ్య వచ్చే సన్నివేశంలో ఆ డైలాగ్ ఉంటుంది. ఖుషి చిత్రంలోని పవన్ కళ్యాణ్, భూమిక సన్నివేశాన్ని మజాకా చిత్రంలో ఫన్నీగా రీ క్రియేట్ చేశారు. అన్షు అంబానీ నడుము చూసి రావు రమేష్ షేక్ అవుతుంటాడు. సందీప్ కిషన్ ఏమైంది నాన్నా అని అడుగుతాడు. 'పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడి ఉంటారు ఇప్పుడు అర్థం అవుతోంది' అని రావు రమేష్ అంటాడు. కానీ ఈ డైలాగ్ ని సెన్సార్ వాళ్ళు తొలగించారట. ఉండుంటే మాత్రం థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది అనే టాక్ వినిపిస్తోంది.