ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?

Published : Sep 05, 2026, 07:20 AM IST

ANR: అక్కినేని నాగేశ్వరరావు (ANR) హీరోగా సినిమాలు చేయడమే కాకుండా.. వ్యాపారవేత్తగా, స్టూడియో అధినేతగా, నిర్మాతగా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు. ఒకానొక హీరో, ఏఎన్నార్ అందించిన ఫస్ట్ రెమ్యునరేషన్‌తో ఎలా కోట్లు సంపాదించారో తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?

PREV
15
అక్కినేని నీడలో ఎదిగిన నటులు..

ఏఎన్నార్ అంటే.. టాలీవుడ్ తొలితరం నటుడు మాత్రమే కాదు, ఎంతోమందికి ఆదర్శం.. ఎందరినో నిలబెట్టిన ఒక గొప్ప వ్యవస్థ. హీరోగా సినిమాలు చేసి ఊరుకోకుండా ఆయన నిర్మాతగా మారారు. చెన్నై నుంచి అందరికంటే ముందే హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ స్టూడియో నిర్మించి, ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆయన స్థాపించిన 'అన్నపూర్ణ స్టూడియోస్' బ్యానర్ ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఖాళీ చేతులతో వచ్చి, ఆ తర్వాత కోటీశ్వరులైన వారు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలో ఏఎన్నార్ చేతుల మీదుగా మొదటి రెమ్యునరేషన్ తీసుకుని కోట్లు సంపాదించాడు హీరో శివాజీ. తన జీవితంలో జరిగిన ఈ అద్భుతం గురించి ఒక ఈవెంట్‌లో ఆయన వివరించారు.

25
శివాజీకి వరుస ఆఫర్లు..

'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నటుడు శివాజీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అటు వెబ్ సిరీస్‌లు, ఇటు సినిమాలు రెండింటిలోనూ బిజీగా మారారు. ఈ క్రమంలో ఆయన నటించిన తాజా చిత్రం 'లెనిన్'. ఈ సినిమాలో మంచి పాత్ర పోషించిన శివాజీ, సినిమా విజయోత్సవ సభలో (Success Meet) చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధం, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాముఖ్యత, తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనల గురించి పంచుకున్నారు.

35
ఏఎన్నార్ ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్

నాగార్జునను తన ‘గాడ్ ఫాదర్’గా అభివర్ణించిన శివాజీ, అక్కినేని కుటుంబంతో, అన్నపూర్ణ కాంపౌండ్‌తో తనకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

శివాజీ మాట్లాడుతూ.. "నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని.. పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చాను. అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించిన సినిమాతోనే నా జీవితం ప్రారంభమైంది. నా మొదటి సినిమాకు ఏఎన్నార్ గారి చేతుల మీదుగా పారితోషికం అందుకున్నాను. ఆ సినిమాకు నాకు రూ. 1,25,000 (లక్షపాతిక వేల రూపాయలు) ఇచ్చారు. అది నా జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఆ డబ్బుతోనే మా ఊరి దగ్గర 5 ఎకరాల 35 సెంట్ల భూమిని కొనుగోలు చేశాను. మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆ భూమి కొనుగోలే పునాదిగా మారింది" అని తెలిపారు. ఆ భూమి విలువ ప్రస్తుతం వందల కోట్లు పలుకుతుండటం విశేషం.

45
అఖిల్ పడిన కష్టం గురించి..

శివాజీ కొనసాగిస్తూ.. "నేను ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్‌లో కూడా చెప్పాను. నాగార్జున గారు ఎంతమంది నూతన దర్శకులను, నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారో నేను నా కళ్లారా చూశాను. 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రం నుంచి నాగార్జునగారితో నాకు పరిచయం ఉంది. 'లెనిన్' చిత్రం ద్వారా తన కుమారుడు అఖిల్‌కు మంచి విజయాన్ని అందించాలని నాగార్జున పడిన తపన అసాధారణమైనది" అని అన్నారు.

అలాగే అఖిల్ శ్రమను ప్రశంసిస్తూ.. ఒక క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడం కోసం ఏళ్ల తరబడి ఎలాంటి సాధన చేస్తుందో, అఖిల్ కూడా దాదాపు ఏడాదిన్నర కాలం పాటు అంకితభావంతో శ్రమించారని కొనియాడారు.

55
3 తరాల అక్కినేని హీరోలతో పనిచేసే భాగ్యం

మనిషికి కేవలం డబ్బే కాకుండా జీవితంలో సాధించే విజయమే ముఖ్యమని, ఈ సినిమా విజయం వెనుక అన్నపూర్ణ కాంపౌండ్ శ్రమ ఎంతో ఉందని శివాజీ తెలిపారు. నిన్నటి తరం (ANR) నుంచి నేటి తరం (అఖిల్) వరకు 3 తరాల అక్కినేని హీరోలతో పనిచేసే భాగ్యం తనకు దక్కిందని, అక్కినేని కుటుంబంతో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. 'లెనిన్' చిత్రం ఘనవిజయం సాధించడం పట్ల ఆయన తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories