హాట్‌స్టార్‌లో ఈ వీకెండ్‌లో చూడదగ్గ టాప్ 10 సినిమాలు, సిరీస్‌లు

Published : Aug 23, 2025, 08:55 PM IST

వారాంతపు వినోదం కోసం జియో హాట్‌స్టార్ టాప్ 10 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందిస్తోంది. రొమాన్స్, క్రైమ్, యాక్షన్ నుండి పిల్లల కార్టూన్ల వరకు అన్నీ ఉన్నాయి. ఐఎండీబీ జాబితాలో టాప్‌లో ఉన్నవేంటో చూద్దాం.    

PREV
110
`సలకార్` వెబ్‌ సిరీస్‌
సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సలకార్'లో మౌని రాయ్, ముకేష్ రిషి, సూర్య శర్మ నటించారు. ఈ సిరీస్‌లో 5 ఎపిసోడ్‌లు ఉన్నాయి. దీనికి IMDbలో 5.8 రేటింగ్ ఉంది. జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంది.
DID YOU KNOW ?
ట్రెండింగ్‌లో మయసభ
సోనీలివ్‌లో `మయసభ` సిరీస్‌ తెలుగులో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో అదిపినిశెట్టి, చైతన్య రావులు హీరోలుగా నటించగా, దేవాకట్టా దర్శకత్వం వహించారు.
210
స్పెషల్ ఆప్స్ 2

ఈ జాబితాలో 'స్పెషల్ ఆప్స్ 2' రెండవ స్థానంలో ఉంది. ఈ సిరీస్‌కు IMDbలో 8.6 రేటింగ్ ఉంది. ఇది యాక్షన్, డ్రామాగా సాగుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జీయో హాట్‌ స్టార్‌లో ఇది ట్రెండింగ్‌లో ఉంది.

310
లవెంచర్

రొమాన్స్, డ్రామా 'లవెంచర్- ప్యార్ కా వన్వాస్' మూడవ స్థానంలో ఉంది. ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. జియో హాట్‌ స్టార్‌లో ఇది కూడా ట్రెండింగ్‌లో ఉంది.

410
క్రిమినల్ జస్టిస్

క్రైమ్-లీగల్ డ్రామా సిరీస్ 'క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్'కి IMDbలో 7.6 రేటింగ్ ఉంది. క్రైమ్, ఎమోషన్, లా ఇష్టపడేవారికి ఇది చక్కని ఎంపిక. హాట్‌ స్టార్‌లో ఇది చాలా రోజులు టాప్‌లో ఉంది. ఇందులో పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. 

510
డోరెమాన్

కార్టూన్‌ సిరీస్‌ 'డోరెమాన్' హాట్‌స్టార్‌ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఈ కార్టూన్ షో పిల్లలకు బాగా నచ్చుతుంది. దీనికి IMDbలో 8.2 రేటింగ్ ఉంది. 

610
సర్జమీన్

మిస్టరీ థ్రిల్లర్ 'సర్జమీన్'లో పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాకి IMDbలో 4 రేటింగ్ ఉంది. హాట్‌ స్టార్‌ ఈ సిరీస్‌ ఆరవ స్థానంలో ఉంది.

710
గేమ్ ఆఫ్ థ్రోన్స్

హాలీవుడ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కి హాట్‌ స్టార్‌ జాబితాలో ఏడవ స్థానం. దీనికి IMDbలో 9.2 రేటింగ్ ఉంది.

810
డీమన్ స్లేయర్
సూపర్‌హిట్ యానిమేటెడ్ సిరీస్ 'డీమన్ స్లేయర్'కి ఎనిమిదవ స్థానం. దీనికి IMDbలో 8.6 రేటింగ్ ఉంది.
910
షిన్‌చాన్

విశేష ప్రజాదరణ పొందిన జపనీస్ కార్టూన్ 'షిన్‌చాన్'ని కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతోంది. ఇది తొమ్మిదో స్థానంలో ఉంది. దీని IMDb రేటింగ్ 8.4.

1010
ద రేజ్

సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ 'ద రేజ్' కూడా హాట్‌ స్టార్‌ జాబితాలో పదో  స్థానంలో ఉంది. దీనికి IMDbలో 6 రేటింగ్ ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories