బెడ్‌పై క్యాన్సర్‌తో పోరాడుతున్న అమ్మని వదిలేసి బిగ్‌ బాస్‌ షోపై మోజు.. ఝలక్‌ ఇచ్చిన నవదీప్‌

Published : Aug 23, 2025, 08:09 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 అగ్నిపరీక్ష లో భాగంగా కొందరి కంటెస్టెంట్ల ఫ్యామిలీ స్టోరీస్‌ చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. ఓ అమ్మాయికి నవదీప్‌ వేసిన పంచ్‌ అదిరిపోయింది. 

PREV
15
రసవత్తరంగా `బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష`

`బిగ్ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌ మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పుడు కామన్‌ మ్యాన్‌ నుంచి కంటెస్టెంట్లని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది. అందుకోసం `అగ్నిపరీక్ష` పేరుతో మిని షోని నిర్వహిస్తున్నారు. ఇది ఆగస్ట్ 22 నుంచి డిస్ట్రీ హాట్‌ స్టార్‌లో రోజూ గంట ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఇందులో దాదాపు 45 మంది సామాన్య ప్రజలను టెస్ట్ చేస్తున్నారు. వివిధ పరీక్షలు పెట్టి,  వాళ్లు ఎంత వరకు బిగ్‌ బాస్‌ హౌజ్‌కి ఫిట్‌ అవుతారో తేల్చబోతున్నారు. వీరిలో నుంచి ఐదుగురుని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. వీరిని ఫిల్టర్‌ చేసే బాధ్యత నవదీప్‌, బిందుమాధవి, అభిజిత్‌ తీసుకున్నారు. ఈ ముగ్గురు జడ్జ్ లుగా ఈ `అగ్నిపరీక్ష` షోని నిర్వహిస్తున్నారు. ఇది ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది.

DID YOU KNOW ?
బిగ్‌ బాస్‌ తెలుగు9 ఓపెనింగ్‌
బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ప్రారంభానికి కొన్ని రోజులే ఉన్నాయి. ఇది సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
25
అక్క కోసం తమ్ముడి పోరాటం

ఇదిలా దీనికి సంబంధించిన ప్రోమోస్‌ వస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్‌ కోసం పోటీపడుతున్న వారి బ్యాక్‌గ్రౌండ్లు చూస్తుంటే గుండెని బరువెక్కించేలా ఉన్నాయి. ఎల్లో డ్రెస్‌లో టెడ్డీ బేర్‌లా వచ్చిన ఓ వ్యక్తి తన అక్కకి వచ్చిన జబ్బు గురించి చెప్పారు. నయం లేని ఎస్‌ఎల్‌ఏ వ్యాధి వచ్చిందని, ఆమెని కాపాడుకోవడం కోసం తాను ఎన్నో పనులు చేస్తున్నట్టు తెలిపారు. తన కుటుంబం కోసం ఈ షోకి రావాలనుకుంటున్నట్టు తెలిపారు.

35
అమ్మ కథ చెప్పి గుండె బరువెక్కించిన కుర్రాడు

మరో కుర్రాడు వచ్చాడు. అతన్ని చూసి ఇప్పుడే స్కూల్‌ నుంచి వచ్చినట్టు ఉందని శ్రీముఖి సెటైర్లు వేయడం హైలైట్‌గా నిలిచింది. అతను తన అమ్మ ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మగా నమ్ముతానని తెలిపారు. వాళ్ల డాడి చనిపోయాక ఎమోషనల్‌ సపోర్ట్ లేదని, తమకు బెటర్‌ లైఫ్‌ఇవ్వడం కోసం అమ్మ సాయంత్రం 5 వరకు జాబ్‌ చేస్తూ, ఆ తర్వాత 6-11 వరకు ఒక బండివద్ద పనిచేస్తారని తెలిపారు. ఆయన చెప్పిన విషయాలు జడ్జ్ లను కూడా ఎమోషనల్‌కి గురి చేశాయి. దీంతో వారంతా లేచి క్లాప్స్ కొట్టారు.

45
కొందరు మగాళ్ల చేత వేధింపులకు గురైన అమ్మాయి

ఆ తర్వాత ఒక లేడీ కాఫీ కప్‌తో జడ్జ్ ల ముందుకు వచ్చింది. తనని కొంత మంది అబ్బాయిలు వేధింపులకు గురి చేశారని తెలిపింది. అమ్మాయిలు ఎమోషనల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారో, మెంటల్లీ అంతే స్ట్రాంగ్ అని చెప్పింది. అయితే ఫిజికల్‌ గానూ అంతే స్ట్రాంగ్‌ గా లేకపోతే ఎవరూ ప్రొటెక్ట్ చేయరని చెప్పి అందరిని ఆలోచింప చేసింది.

55
అమ్మ క్యాన్సర్‌తో బెడ్‌పై.. నవదీప్‌ షాకింగ్‌ కౌంటర్‌

అనంతరం మరో అమ్మాయి జిబ్‌ బాడీతో వచ్చింది. కామన్‌ మ్యాన్స్ లక్షల మందిలో ఉన్నారు కదా, వారిని కాదని మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని నవదీప్‌ అడగ్గా, తాను పుషప్స్ తీస్తానని చెప్పింది. ఆ పుషప్స్ చేస్తుండగా, ఇది నార్మల్‌గా అందరు చేస్తారు, ఇంకా బెటర్‌గా చేయాలని ఆశిస్తున్నానని బిందుమాధవి అనడంతో ఆమెకి దిమ్మతిరిగిపోయింది. అనంతరం ఆమె తన ఫ్యామిలీ గురించి చెప్పింది. తన అమ్మకి క్యాన్సర్‌ అని, ఇది ఆమెకి మూడోసారి అని తెలిపింది. దీనికి నవదీప్‌ కౌంటర్‌ వేస్తూ, `ఈ స్టేజ్‌లో మీ అమ్మ పక్కన ఉండటం కంటే ఇది ముఖ్యమా ఇప్పుడు` అని ప్రశ్నించడంతో తెల్లమొహం వేసింది. మూడో రోజు ఫిల్టర్‌ చేసే ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థమవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories