Honey Rose Love Marriage : సౌత్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది హనీరోజ్. తెలుగులో ఒక్క సినిమాతో అందరికి అలా గుర్తుండిపోయింది. తాజాగా ఆమె పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇంతకీ హనీరోజ్ ఏమంటుందంటే?
చిన్న, చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా స్టార్ డమ్ సాధించింది హనీరోజ్. మలయాళ పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టి.. సౌత్ లో మంచి ఇమేజ్ తెచ్చుకుంది హనీరోజ్. ఇప్పుడు 'రేచెల్' అనే పవర్ ఫుల్ ఉమెన్ పాత్రతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
25
బాలయ్యతో స్టెప్పులేసిన హనీరోజ్
టాలీవుడ్ లో హనీరోజ్ రెండు సినిమాలు చేసింది. గతంలో శివాజీ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆసినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆతరువాత చాలా గ్యాప్ తీసుకుని.. బాలయ్య హీరోగా మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో.. వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ హనీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది.ఆతరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు హనీ.
35
పెళ్లిపై హనీ రోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మలయాళంలో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న హనీరోజ్.. తాజాగా ప్రేమ, పెళ్లి గురించి తనకున్న అభిప్రాయాలను షేర్ చేసుకుంది. ఈ కాలంలో ఆదర్శవంతుడు అంటూ ఎవరు దొరకరని.. ఎవరిని చేసుకున్న సర్ధుకుపోవడం ముఖ్యమని ఆమె అన్నారు. హనీరోజ్ ప్రేమ పెళ్లికే ఓటేసింది. దాంతో హనీ పెళ్లి ఎప్పుడా అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
హనీ రోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'రేచెల్' డిసెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్న ఈ బహుభాషా చిత్రంలో, హనీ తన కెరీర్‌లోనే చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ లో నటించింది.
55
ప్రేమ, పగ, సంఘర్షణల కలబోతగా
ప్రేమ, పగ, సంఘర్షణల కలబోతగా రానున్న ఈ బహుభాషా చిత్రానికి సబంధించి ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈసినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది హనీరోజ్. హనీ రోజ్‌తో పాటు పలువురు మలయాళ నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.