కాంతార పై కామెడీ కామెంట్స్, రణ్ వీర్ సింగ్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు

Published : Nov 30, 2025, 04:08 PM IST

ఈమధ్య సినిమా సెలబ్రిటీల నుంచి వివాదాలు ఎక్కువైపోయాయి. నోరు జారీ ఎదో ఒకటి మాట్లాడి అనవసరంగా కాంట్రవర్సీ అవుతున్నారు. రీసెంట్ గా రణ్ వీర్ సింగ్ కాంతార సినిమాపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. 

PREV
14
కాంతార వివాదంలో రణ్ వీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన కాంతార సినిమాపై ఆయన చేసిన కామెంట్స్, కన్నడ ఆడియన్స్ తో పాటు, అందరికి కోపం తెప్పించాయి. ఈసినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని స్టేజ్‌పై అనుకరించడం, అది కూడా కామెడీగా ఇమిటేట్ చేయడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.

24
రిషబ్ శెట్టికి ప్రశంసలు

ఫిల్మ్ ఫెస్టివల్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్, ‘కాంతార’ సినిమాలో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. ముఖ్యంగా దైవం ఆవహించే సన్నివేశాలను అత్యద్భుతంగా చిత్రీకరించారని, అందులో రిషబ్ ఎక్స్ ప్రెషన్స్ అయితే అద్భుతమని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఊరకోకుండా.. స్టేజ్‌పై నిలబడి, కాంతారలో రిషబ్ శెట్టి చేసిన సౌండ్ ఒకటి ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సౌండ్ చాలా ఫేమస్, సినిమాను గుర్తు పెట్టుకోవడానికి ఈ సౌంట్ కూడా ముఖ్య కారణం. అటువంటి ‘ఓ’ శబ్దాన్ని కామెడీగా అనుకరించారు. ఈ క్షణాల్లో అక్కడే ఉన్న రిషబ్ శెట్టి నవ్వుతూ కనిపించినా.. కాస్త అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.

34
క్షమాపణ చెప్పాలని డిమాండ్..

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి భారీగా వ్యతిరేకత వచ్చింది. చాలామంది సోషల్ మీడియా జనాలు రణ్‌వీర్‌ను విమర్శిస్తున్నారు. కన్నడ సంస్కృతిలో పవిత్రంగా భావించే దైవానికి సంబంధించిన సన్నివేశాన్ని అపహాస్యం చేయడం కరెక్ట్ కాదు అని వారు మండిపడుతున్నారు. మరికొందరు వెంటనే క్షమాపణ కోరాలని, లేకపోతే రణ్‌వీర్ నటిస్తున్న 'ధురంధర్' సినిమా విడుదలను అడ్డుకునేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు.

44
రిషబ్ శెట్టి స్పందిస్తారా?

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన సినిమా ‘ధురంధర్’ ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈసినిమాకు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వివాదం తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో.. వివాదంపై ఎవరు ఎలా స్పందిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతే కాదు ఈసినిమా హీరో , దర్శకుడు రిషబ్ శెట్టి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి.. వివాదంపై ఆయన ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories