కింగ్ నాగార్జునకు ఓ డైరెక్టర్ కోపం వచ్చేలా చేశాడు. అది కూడా ఒక పోస్టర్ తో కింగ్ కు ఒళ్లు మండేలా చేశాడు. పట్టరాని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు నాగార్జున. కానీ వారి కాంబోలో వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఎవరా దర్శకుడు?
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయాడు నాగార్జున.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నాగార్జున కెరీర్ కు బిగినింగ్ లోనే ఊపునిచ్చిన సినిమా మాత్రం శివ. ఈసినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నాగ్. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతే కాదు ఇటు నాగార్జున కెరీర్ ను.. అటు రామ్ గోపాల్ వర్మ కెరీర్ ను నిలబెట్టింది ఈసినిమా. అయితే ఈ మూవీకి పోస్టర్ డిజైన్ చేసింది మాత్రం అప్పటి కెమెరా మెన్ అయిన తేజ.
24
శివ సినిమాకు పోస్టర్ డిజైన్ చేసిన తేజ
శివ సినిమా అన్ని రకాలుగా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్స్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం డైరెక్టర్ వర్మకు అప్పటికి కెమెరా మెన్ గా వర్క్ చేస్తున్న తేజా సహాయం చేశారు. శివ సినిమా టైటిల్ డిజైన్, పోస్టర్స్ డిజైన్ బాధ్యతలను వర్మ తేజాకు అప్పగించారు వర్మ. అయితే అప్పటికే ఉన్న టైటిల్స్, పోస్టర్స్ కు భిన్నంగా తేజ సరికొత్తగా శివ సినిమా పోస్టర్స్ ను డిజైన్ చేశారు. అయితే ఫస్ట్ టైమ్ బ్లాక్ అండ్ వైట్ లో హీరో ఫోటో, టైటిల్ ను డిజైన్ చేశారు తేజ. పోస్టర్ లో హీరో ఫోటో బ్లాక్ గా ఉండటం, అందరు ఇది వర్కౌట్ కాదు అన్నారు. కానీ పోస్టర్ చూపించిన వెంటనే ఎవరికి నోట్లో మాట రాలేదు. అందరికి ఈ పోస్టర్ నచ్చింది.
34
తేజాపై కోపంతో వెళ్లిపోయిన నాగార్జున
శివ సినిమా టైటిల్ పోస్టర్స్ ను తేజ అందరికి చూపించారు. చుట్టు ఉన్నవారంతా బాగుంది అన్నారు. అక్కడే నాగచైతన్యను ఎత్తుకుని నిల్చున్న నాగార్జున మాత్రం ఈ పోస్టర్ చూసి కోపంతో రగిలిపోయారు. హీరో ఫేస్ బ్లాక్ ఉంటే ఎవరికైనా నచ్చదు కదా.. అందుకే ఓళ్లు మండి నాగార్జున అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ వర్మ మాత్రం ఈ పోస్టర్స్ బాగున్నాయి ప్రొసీడ్ అవ్వు అని చెప్పారు.. దాంతో అవే పోస్టర్లు బయటకు వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు డిఫరెంట్ గా ఫీల్ అయ్యారు.. శివ సినిమాకు ఈ పోస్టర్లే పెద్ద పబ్లిసిటీ అయ్యింది. ఇండస్ట్రీలో ఈ పోస్టర్ల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అంతకు మించి శివ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
‘శివ’ సినిమా నాగార్జున కెరీర్‌లోనే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాగార్జునను ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. అప్పట్లోనే ఈమూవీ 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక ఈసినిమా 36 ఏళ్ల తర్వాత తాజాగా రీ-రిలీజ్ అయ్యింది మూవీ. ఆధునిక హంగులతో 4K వెర్షన్ శివ సినిమాను నవంబర్ 14న రీ రిలీజ్ చేశారు మేకర్స్.